Movie News

అప్పులు కట్టుకుంటున్న మంచు లక్ష్మీ

టాలీవుడ్లో ఘ‌న చ‌రిత్ర ఉన్న బేన‌ర్లో ల‌క్ష్మీప్ర‌స‌న్న పిక్చ‌ర్స్ ఒక‌టి. ఈ బేన‌ర్ మీద ప‌దుల సంఖ్య‌లో సినిమాలు తీశారు మోహ‌న్ బ‌బు. అందులో అల్లుడు గారు, అసెంబ్లీ రౌడీ, మేజ‌ర్ చంద్ర‌కాంత్, పెద‌రాయుడు లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్లు ఉన్నాయి. సినీ రంగంలో మోహ‌న్ బాబు జోరు త‌గ్గాక ఈ బేన‌ర్‌ను కొన‌సాగిస్తున్న‌ది ఆయ‌న త‌న‌యురాలు ల‌క్ష్మీప్ర‌స‌న్నే.

కానీ ఆమె ప్రొడ్యూస్ చేసిన సినిమాలేవీ ఆశించిన ఫ‌లితాలు ఇవ్వ‌లేదు. కొన్నేళ్లుగా ఆమె ప్రొడ‌క్ష‌న్‌కు దూరంగా ఉంటున్న సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు న‌టిగా మాత్ర‌మే కొన‌సాగుతున్నారు. ఆమె ఓ కీల‌క పాత్ర పోషించిన ఓ త‌మిళ చిత్రం తెలుగులో బూకి పేరుతో ఈ నెల 20న విడుద‌ల కాబోతోంది. ఈ సినిమా ప్ర‌మోష‌న‌ల్ ప్రెస్ మీట్లో మంచు ల‌క్ష్మి కొన్ని షాకింగ్ కామెంట్స్ చేశారు. నిర్మాత‌గా త‌న ప్ర‌యాణం ముగిసిందంటూ పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు.

సినిమాలు ప్రొడ్యూస్ చేయ‌డం ద్వారా తాను బాగానే న‌ష్టాలు చ‌విచూసిన‌ట్లు మంచు ల‌క్ష్మి స్ప‌ష్టం చేశారు. తాను ఐదేళ్ల ముందు ప్రొడ్యూస్ చేసిన సినిమా తాలూకు న‌ష్టాల‌ను ఇప్ప‌టికీ క‌డుతున్నాన‌ని ఆమె చెప్ప‌డం గ‌మ‌నార్హం. తాను ఇప్పుడు న‌టిగా మాత్ర‌మే కొన‌సాగుతున్నానని, నిర్మాత‌గా ఇకపై సినిమాలు తీయ‌న‌ని ఆమె తేల్చి చెప్పారు.

న‌టిగా వ‌చ్చే డ‌బ్బుల‌తో నిర్మాత‌గా చేసిన అప్పుల‌ను కొంత‌మేర రిక‌వ‌ర్ చేసుకునే ప్ర‌య‌త్నం చేస్తున్న‌ట్లు కూడా ఆమె వ్యాఖ్యానించారు. చివ‌ర‌గా గ‌త ఏడాది ద‌క్ష సినిమాతో ప‌ల‌క‌రించారు మంచు ల‌క్ష్మి. ఆమె లీడ్ రోల్ చేస్తూ ప్రొడ్యూస్ చేసిన ఈ చిత్రంలో మోహ‌న్ బాబు కూడా ఓ కీల‌క పాత్ర పోషించారు.

చాలా ఏళ్ల పాటు ఆ సినిమా విడుద‌ల‌కు నోచుకోకుండా ఆగిపోయింది. చివ‌రికి రిలీజైనా ప్రేక్ష‌కులు ప‌ట్టించుకోలేదు. అంత‌కుముందు ఆమె ప్రొడ్యూస్ చేసిన దొంగాట‌, ఊ కొడ‌తారా ఉలిక్కి ప‌డ‌తారా లాంటి సినిమాలు కూడా దారుణ ఫ‌లితాన్ని అందించాయి.

This post was last modified on February 17, 2026 9:49 pm

Share

Recent Posts

రాహుల్ ముందే పసిగడుతున్నారా?

కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీపై సోషల్ మీడియాలో రకరకాల ట్రోలింగ్స్ వస్తుంటాయి. గతంలో అయితే ఆయనను పప్పు అంటూ…

23 minutes ago

మోహన్ బాబును మోసం చేసిన ఓదెల

తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుడైన మోహన్ బాబును గత 20 ఏళ్లలో మన ఇండస్ట్రీ సరిగా ఉపయోగించుకోలేదనే…

1 hour ago

‘హోటళ్ళు నా భార్యా బిడ్డల కోసం’

సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్ ల మధ్య మరోసారి మాటల యుద్ధం మొదలైంది. కేటీఆర్ కు లగ్జరీ…

3 hours ago

హిట్టు కొట్టిన పది నెలలకు దర్శనం

టాలీవుడ్ బిజీ హీరోల్లో ఆది సాయికుమార్ పేరు ఖచ్చితంగా ఉంటుంది. వరసగా హిట్లు లేకపోయినా అవకాశాలకు లోటు లేకుండా ఏదో…

3 hours ago

షాకింగ్ టాక్… బత్తా అంత కొత్తగా ఉందా

విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో బత్తా విడుదలయ్యింది. ప్రమోషన్లు జోరుగా చేశారు. తెలుగు డబ్బింగ్ చేద్దామనుకున్నారు కానీ ఎక్కువ రిలీజులు…

5 hours ago

మతిపోగొడుతున్న వారణాసి లెక్కలు

సినిమాలు చూడ్డానికి థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గిపోతోంది.. బయ్యర్ల పెట్టుబడి వెనక్కి రావట్లేదు.. పెడుతున్న బడ్జెట్లకు తగ్గట్లు బిజినెస్…

5 hours ago