Movie News

ఇళయరాజా ఇప్పుడైనా మారతారా?

ఇళయరాజా సంగీతం అంటే చెవికోసుకునే సంగీత ప్రియులు దక్షిణాదిన కోట్లల్లో ఉన్నారు. దశాబ్దాలుగా ఆయన పాటలను వింటూ వాళ్లు పొందుతున్న అనుభూతి గురించి మాటల్లో వర్ణించడం కష్టం. తర్వాతి తరానికి కూడా ఆయన పాటల మాధుర్యమేంటో తెలియాలన్నది ఆయన అభిమానుల కోరిక. కానీ ఇళయరాజా తీరుతో ఏదైనా సినిమాల్లో ఇళయరాజా పాటనో, బీజీఎంనో ఉపయోగించాలన్నా భయపడే పరిస్థితి. లీగల్ నోటీసులు, కేసులతో రాజా బెంబేలెత్తించేస్తున్నారు. 

అనుమతి తీసుకుని, డబ్బులు చెల్లిస్తే తప్ప ఆయన పాటలు, బీజీఎంను ఉపయోగించడానికి వీల్లేని పరిస్థితి. ఇంత తతంగం ఎందుకని క్రమంగా ఆయన పాటల జోలికి వెళ్లడం మానేస్తున్నారు. పాటకు సంబంధించి ప్రథమ హక్కు సంగీత దర్శకుడిదే కదా, ఎవరు ఆ వర్క్ వాడుకున్నా రాయల్టీ ఇవ్వాలి కదా అనే చర్చ ఓవైపు ఉన్నప్పటికీ.. ఇళయరాజా తీరు అలా ఉండట్లేదన్నది మెజారిటీ వాదన.

కమర్షియల్‌గా వాడుకోవడం కంటే.. ఆయన మీద తమ ప్రేమను చాటుతున్నా, ఆయన సంగీతాన్ని సెలబ్రేట్ చేస్తున్నా ఆయన ఊరుకోవడం లేదు. దీంతో ఇళయరాజా మరీ కమర్షియల్ అయిపోతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఐతే కాపీ రైట్ కేసులతో సినిమా బృందాలను, ఆడియో సంస్థలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఇళయరాజాకు ఇప్పుడు రివర్స్ షాక్ తగిలింది. ‘సరిగమ’ సంస్థ తమకు హక్కులున్న సినిమాల పాటలను ఇళయరాజా వాడుకోవడం, వేరే సంస్థలకు రైట్స్ రాసి ఇవ్వడం మీద కోర్టును ఆశ్రయించింది. ఈ కేసులో ఇళయరాజాకు కోర్టు షాకిచ్చింది.

దీంతో తాను సంగీతం అందించిన పలు చిత్రాల పాటలు, బీజీఎంను ఉపయోగించుకోలేని పరిస్థితి తలెత్తింది. తన మ్యూజికల్ కన్సర్ట్స్‌లో కూడా ఆయన ఈ పాటలను వాడుకోవడానికి వీల్లేదట. ఇది ఇళయరాజాకు తీవ్ర ఇబ్బంది కలిగించే విషయమే.

చాలామంది దీన్ని ‘టిట్ ఫర్ ట్యాట్’ అంటున్నారు. ఐతే ఈ అనుభవం తర్వాత అయినా ఇళయరాజాలో మార్పు రావాలని.. తన పాటలు, బీజీఎం విషయంలో ఆంక్షలకు బ్రేక్ వేస్తే మంచిది అని ఆయన అభిమానులే అభిప్రాయపడుతున్నారు.

This post was last modified on February 18, 2026 10:25 am

Share

Recent Posts

షాకింగ్ టాక్… బత్తా అంత కొత్తగా ఉందా

విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో బత్తా విడుదలయ్యింది. ప్రమోషన్లు జోరుగా చేశారు. తెలుగు డబ్బింగ్ చేద్దామనుకున్నారు కానీ ఎక్కువ రిలీజులు…

1 hour ago

మతిపోగొడుతున్న వారణాసి లెక్కలు

సినిమాలు చూడ్డానికి థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గిపోతోంది.. బయ్యర్ల పెట్టుబడి వెనక్కి రావట్లేదు.. పెడుతున్న బడ్జెట్లకు తగ్గట్లు బిజినెస్…

2 hours ago

కళ్యాణ్ గుండె ధైర్యం గట్టిదే

అక్టోబర్ 9 విడుదల కాబోతున్న కామ్రేడ్ కళ్యాణ్ వెనక్కు తగ్గేలా కనిపించడం లేదు. ఎదురుగా ఆదర్శ కుటుంబం ఏకె 47…

2 hours ago

పరీక్షలు బాగా రాపించి సినిమాకి తీసుకురండి

చిన్న లేదు.. పెద్ద లేదు.. ఇప్పుడు చాలా సినిమాలకు ముందు రోజే ప్రిమియర్స్ వేసేస్తున్నారు. చిన్న సినిమాలకు సెలెక్టివ్‌గా కొన్ని…

4 hours ago

హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టుకు ఏపీ సర్కార్?

ఏపీలో త్వరలో జరగాల్సి ఉన్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించేలా జారీ అయిన జీవోలను…

4 hours ago

ఐకానిక్ షోకు తెర‌… చివ‌రి సీజ‌న్లో అల్లు అర్జున్‌?

ఇండియాలో వివిధ భాష‌ల్లో అనేక టాక్ షోలు ఉన్నాయి. అందులో అత్యంత పాపుల‌ర్ ఏది అంటే బాలీవుడ్ ద‌ర్శ‌క నిర్మాత…

5 hours ago