Movie News

ఆ కమెడియన్ కు సోనూసూద్ సాయం

బాలీవుడ్ కమెడియన్ రాజ్‌పాల్ యాదవ్ చెక్ బౌన్స్ కేసులో తీహార్ జైల్లో ఉన్న విషయం తెలిసిందే. 2010 లో అడ్వాన్స్ కు సంబంధించిన కేసులో రాజ్‌పాల్ యాదవ్ దోషిగా ఉన్నారు. దాదాపు కొన్నేళ్లుగా సాగుతున్న ఈ కేసుకి సంబంధించిన తీర్పు ఇటీవలే వచ్చింది. ఢిల్లీ కోర్టు రాజ్‌పాల్ యాదవ్ ని దోషిగా నిర్దార్దించింది. తనకు కొంత సమయం కావాలని అడిగినా కూడా కోర్టు అందుకు అంగీకరించలేదు.

రాజ్‌పాల్ యాదవ్ ఆర్ధిక ఇబ్బందుల వల్ల తిరిగి ఆ మొత్తాన్ని చెల్లించలేని పరిస్థితి ఏర్పడింది. అందుకే ఆయనకు లొంగిపోవడం తప్ప మరో అవకాశం లేకుండా పోయింది. మరోసారి తన వాదన వినిపించేందుకు ప్రయత్నిస్తున్నారు రాజ్‌పాల్ యాదవ్. ఈ క్రమంలో ఢిల్లీ హైకోర్ట్ ఈ కేసుని ఫిబ్రవరి 16 కి వాయిదా వేసింది.

నేడు మరోసారి ఢిల్లీ హైకోర్టులో రాజ్‌పాల్ యాదవ్ కేసు విచారణ జరుగుతుంది. ఐతే ఇదే టైంలో రాజ్‌పాల్ యాదవ్ కు ప్రముఖ నటుడు సోనూసూద్ సోషల్ మీడియా ద్వారా సపోర్ట్ అందించారు. ఈరోజు సోదరుడు రాజ్‌పాల్ యాదవ్ భాయ్ కి ముఖ్యమైన రోజు. పరిస్థితులు అన్ని సరైన దిశలో జరగాలని దీని నుంచి ఆయనకు ఉపశమనం లభించాలని ప్రార్ధిస్తున్నా. ఎంతో ప్రతిభ, అద్భుతమైన వ్యక్తి ఆయన. ఆయనతో నిలబడి ఈ మొమెంటం తగ్గకుండా చూద్దాం.. అన్ని విషయాలు సరైన విధానంలో జరిగేలా చూద్దామని రాసుకొచ్చారు.

అంతకుముందే సోనూ సూద్ ఈ కేసు విషయమై రాజ్‌పాల్ యాదవ్ కు సాయం చేయాలని సోషల్ మీడియా ద్వారా పిలుపునిచ్చారు. సినీ పరిశ్రమలో ఎవరికి ఏ కష్టం వచ్చినా సోనూ సూద్ ముందుంటాడు. అతని సేవా గుణం, మంచి మనసు ప్రజలను అతనికి మరింత దగ్గర చేస్తుంది. ఇప్పుడు బాలీవుడ్ కమెడియన్ రాజ్‌పాల్ యాదవ్ కోసం సోనూ సూద్ స్టాండ్ తీసుకుని నిలబడటం కూడా అతని మంచి హృదయాన్ని తెలియచేస్తుంది.

This post was last modified on February 17, 2026 12:53 pm

Share

Recent Posts

కుటుంబం ముందున్న అసలు ముప్పు

ప్యాన్ ఇండియా సినిమాలు వాయిదా పడటం సహజమే కానీ ఆదర్శ కుటుంబం ఏకే 47 లాంటి రీజనల్ మూవీ ఇంత…

4 hours ago

కళ్యాణ్ నెమ్మదించినా ఇబ్బంది లేదు

మొదటి మూడు రోజులు డీసెంట్ టాక్ తో దూసుకెళ్లిన కామ్రేడ్ కళ్యాణ్ నిన్న సోమవారం నుంచి బాగా డ్రాప్ అయినట్టు…

5 hours ago

పెద్ద గండం దాటేసిన రణబాలి

ఇంకో మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రణబాలి బుకింగ్స్ మెల్లగా ఊపందుకుంటున్నాయి. సాధారణంగా ఓవర్సీస్ లో విజయ్ దేవరకొండ చూపించే…

5 hours ago

జ‌గ‌న్ విదేశీ ప‌ర్య‌ట‌నకు బ్రేక్ ప‌డుతుందా?

వైసిపి అధినేత జగన్ వచ్చే నెలలో యూరప్ పర్యటన పెట్టుకున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఆయన సర్వం సిద్ధం…

7 hours ago

డెకాయిట్ తర్వాత దర్శనం లేదేంటి

కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ లో మారుమ్రోగిన పేరు మృణాల్ ఠాకూర్. సీతారామం బ్లాక్ బస్టర్ అయ్యాక హాయ్ నాన్న విజయం…

9 hours ago

సత్తా చాటుతుందంటే మొహం చాటేసింది

విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో అక్టోబర్ ఒకటి విడుదలైన బత్తా రెండు వారాలు పూర్తి చేసుకోవడానికి దగ్గరగా ఉన్నా వసూళ్లు…

10 hours ago