వకీల్ సాబ్ షూటింగ్ పూర్తి చేయగానే ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ చిత్రాన్ని మొదలు పెట్టి నలభై రోజుల్లో తన పార్ట్ షూటింగ్ పూర్తి చేయాలని పవన్ కళ్యాణ్ భావించాడు. అయితే వకీల్‌సాబ్ షూట్ చివరి దశకు చేరుకున్నా ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ చిత్రానికి స్క్రిప్ట్, కాస్టింగ్, ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఒక కొలిక్కి రాలేదట. అన్ని పనులు పూర్తి కావడానికి ఇంకా సమయం పడుతుంది కనుక ఈలోగా సమయం వృధా కాకుండా పవన్ మళ్లీ క్రిష్ చిత్రం షూటింగ్ మొదలు పెట్టుకోమని కబురు పంపించాడట.
క్రిష్ సినిమా ఏప్రిల్‌లో కానీ మళ్లీ మొదలవదని అనుకున్నారు కానీ తాజా సమాచారం ప్రకారం ఇప్పుడో షెడ్యూల్ అయితే పవన్ చేస్తాడని, ఆ తర్వాత కంటిన్యూ చేయాలా లేదా బ్రేక్ ఇచ్చి అయ్యప్పనుమ్ కోషియుమ్ రీమేక్ పని పూర్తి చేసుకుని రావాలా అనేది డిసైడ్ అవుతాడని అంటున్నారు. ఇదిలావుంటే ఆ మలయాళ రీమేక్ కథకు త్రివిక్రమ్ మెరుగులు దిద్దుతున్నాడట.
మాటలు రాయడమే కాకుండా పవన్ ఇమేజ్‌కి తగ్గట్టుగా మార్పులు కూడా చేస్తున్నాడని, అయితే పవన్ కాకుండా మరో హీరో ఎవరనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదని టాక్ వినిపిస్తోంది. వకీల్‌సాబ్ సంక్రాంతికి రిలీజ్ అయితే ఈ చిత్రాన్ని సమ్మర్ రిలీజ్ అనుకున్నారు. అదే ఇప్పుడు ఏప్రిల్‌కి వెళ్లడంతో ఈ చిత్రం ఆగస్ట్‌కి వాయిదా పడవచ్చు.
Gulte Telugu Telugu Political and Movie News Updates