Movie News

‘నేను చెప్పానంటే హిట్టే’

తాను ఆషామాషీగా ఏ సినిమా హిట్ అని చెప్పనని.. అలా చెప్పాను అంటే అది హిట్టయి తీరుతుందని అంటున్నాడు సీనియర్ నటుడు నరేష్. ఆయన సంక్రాంతికి రిలీజైన ‘నారీ నారీ నడుమ మురారి’ పెద్ద హిట్టవుతుందని చెప్పారు. అంతకుముందు ‘సామజవరగమన’ చిత్రానికి కూడా తాను ఇలాగే చెప్పానన్నారు. ఇప్పుడు ‘హే భగవాన్’ సైతం కచ్చితంగా సక్సెస్ అవుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

ఇది ప్రమోషన్ల కోసం చెబుతున్న మాట కాదని.. సినిమా రిలీజయ్యాక తన మాటతో అందరూ ఏకీభవిస్తారని పవిత్రతో కలిసి చేసిన ఒక ఇంటర్వ్యూలో నరేష్ చెప్పారు.

‘‘నేను రాజకీయాలను, సినిమాలను బాగా విశ్లేషిస్తాను. నేను గతంలో చెప్పినట్లుగానే ఎన్నికల ఫలితాలు వచ్చాయి. సినిమాల విషయానికి వస్తే ఈ మధ్య ‘కేర్యాంప్’ సినిమా హిట్టవుతుందని చెబితే చాలామంది నమ్మలేదు. హిట్టయింది కదా. తర్వాత ‘నారీ నారీ నడుమ మురారి’కి చెప్పాను. అది రిలీజవుతున్నపుడు హైప్ లేదు. అది హిట్టవుతుందని అన్నాను. సంక్రాంతి విన్నర్ అయింది. ఇప్పుడు మళ్లీ చెబుతున్నా మనస్ఫూర్తిగా. ప్రమోషన్ల కోసం చెబుతున్నది కాదు.

హే భగవాన్ తెలుగులో ఒక కొత్త తరహాలో తీసిన సినిమా. ఫ్యామిలీకి నచ్చే ఫన్ ఉన్న సినిమా. యూత్‌కు కూడా నచ్చుతుంది. నా కెరీర్లో కూడా మైలురాయిగా నిలుస్తుంది. నా కెరీర్లోనే ఈ సినిమాలోది బెస్ట్ క్లైమాక్స్ అవుతుంది. ఫిలిం క్రిటిక్స్ సైతం మెచ్చే సినిమా ఇది. నా పాత్రను దర్శకుడు అద్భుతంగా తీర్చిదిద్దాడు. ప్రేక్షకులు ఆ పాత్రను చూసి ఆశ్చర్యపోతారు. కొత్త కథకు వినోదాన్ని జోడించిన తీరు హైలైట్‌గా నిలుస్తుంది’’ అని నరేష్ తెలిపారు.

గోపీ అచ్చర దర్శకత్వంలో తెరకెక్కిన ‘హే భగవాన్’లో సుహాస్, శివాని నాగారం హీరో హీరోయిన్లుగా నటించారు. వచ్చే శుక్రవారం ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తుంది.

This post was last modified on February 15, 2026 11:43 am

Share

Recent Posts

రవితేజ – వివేక్ సినిమా పరిస్థితి ఏంటి

మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…

4 hours ago

రాకా… అలా ఫిక్సయిపోవచ్చా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…

6 hours ago

ఆదర్శ నిర్ణయాలు మంచి ఫలితాలు ఇవ్వాలి

ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…

7 hours ago

హైదరాబాద్ తగలబెడతానంటోన్న దానం

ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…

7 hours ago

జగన్ పిలిచినా సాయిరెడ్డి వెళ్ళరు

ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…

7 hours ago

సిగ్మా తీర్చాల్సిన బాకీ ఇద్దరిదే

దసరా నెల ప్రారంభంలో విడుదలవుతున్న మొదటి వారం సినిమాల్లో సిగ్మా మీద మంచి అంచనాలే నెలకొన్నాయి. తమిళనాడు సిఎం కొడుకు…

7 hours ago