Movie News

పెళ్లి రూమర్లపై మృణాల్ ఠాకూర్

కలిసి సినిమా చేయని ఒక హీరో, హీరోయిన్ కలిసి తరచుగా కనిపిస్తే.. వాళ్ల మధ్య ఏదో ఉందనే ప్రచారం మొదలైపోతుంది. ఇటీవల తమిళ నటుడు ధనుష్, బాలీవుడ్ భామ మృణాల్ ఠాకూర్‌ల గురించి ఇలాగే అందరిలోనూ సందేహాలు రేకెత్తించారు. ధనుష్‌‌కు ఆల్రెడీ రజినీకాంత్ కూతురు ఐశ్వర్యతో పెళ్లయింది. వాళ్లిద్దరూ కొన్నేళ్ల ముందు విడిపోయారు.

మృణాల్‌‌కు గతంలో బాయ్ ఫ్రెండ్ ఉండేవాడు. అతడితో బ్రేకప్ అయింది. ఈ మధ్య ఇద్దరి మధ్య బంధం మందలైందని.. త్వరలో వీరు పెళ్లి చేసుకోబోతున్నారని మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది. గత ఏడాది మృణాల్ నటించిన ‘సన్నాఫ్ సర్దార్-2’ సినిమాకు ముంబయిలో ప్రిమియర్ వేయగా.. దానికి ధనుష్ హాజరవడం, ఇద్దరూ చాలా సన్నిహితంగా మెలగడంతో ఈ ఊహాగానాలు ఊపందుకున్నాయి.

ఐతే ఇప్పటికే తన పెళ్లి గురించి జరుగుతున్న ప్రచారాన్ని ఖండించిన మృణాల్.. తాజాగా తమిళ క్రిటిక్ భరద్వాజ్ రంగన్ ఇంటర్వ్యూలో మరోసారి ఈ టాపిక్ మీద స్పందించింది. తన కొత్త లవ్ స్టోరీ గురించి ఎవరు ఎలా ప్రచారం మొదలుపెట్టారో కానీ.. ఆ వార్తలను చూస్తే తనకు నవ్వు వస్తోందని మృణాల్ ఠాకూర్ తెలిపింది.

ఫిబ్రవరి 14న మామూలుగా వేలంటైన్స్ డే జరుపుకుంటారని.. కానీ ఈసారి ఏప్రిల్ 1, ఫూల్స్ డే ముందే వస్తుందని.. తన పెళ్లి గురించి మాట్లాడుతున్న వారందరూ ఆ రోజు ఫూల్స్ డే చేసుకోవచ్చిన ఆమె వ్యంగ్యంగా స్పందించింది.

పెళ్ళి గురించి ఎవరు ఎలా వార్తలు సృష్టించారో తెలియదని.. కానీ ఇది పూర్తి అబద్ధమని ఆమె స్పష్టం చేసింది. ఇప్పటిదాకా తమిళంలో నటించని మృణాల్.. త్వరలోనే శింబు సరసన ఓ సినిమాలో కథానాయికగా నటించనుంది. తెలుగులో ఆమె మెగాస్టార్ చిరంజీవి సరసన ‘విశ్వంభర’ చిత్రంలో నటించింది.

This post was last modified on February 13, 2026 8:32 am

Share

Recent Posts

బడ్జెట్ రూ. 2 కోట్లు కలెక్షన్లు 50 కోట్లు…

పాన్ ఇండియా క్రేజ్ లో పడి వందల కోట్లు ఖర్చు పెడుతున్న ఈ రోజుల్లో.. ఒక చిన్న కన్నడ సినిమా…

13 minutes ago

కమల్ కోసం రజినీ త్యాగం?

సూపర్ స్టార్ రజినీకాంత్, లోకనాయకుడు కమల్ హాసన్ ఎంత మంచి మిత్రులో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఐతే కెరీర్…

4 hours ago

‘కామ్రేడ్ కళ్యాణ్’ను కాపాడిన మెగాస్టార్

ఇండస్ట్రీలో చిన్న సినిమాలకు మెగాస్టార్ చిరంజీవి ఎలాంటి మద్దతు ఇస్తారో చెప్పడానికి ఇది తాజా రుజువు. ఈ శుక్రవారం విడుదలైన…

4 hours ago

కోన వెంకట్ భాషలో ‘క్రిమినల్స్’ ఎవరు

నిర్మాత, రచయిత కోన వెంకట్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ బాగా వైరలవుతున్నాయి. కొందరు దర్శకులు మూడు గంటల…

6 hours ago

స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు ఖరారు

స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల విషయంలో సుప్రీం కోర్టు తీర్పు కూడా వచ్చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం స్పీడ్ పెంచింది. లోకల్…

7 hours ago

విజయ్ చెప్పింది ప్రాక్టికల్‌గా సాధ్యమేనా

రణబాలినే కాదు ఇకపై తన సినిమాలు దేనికీ తన పరిధి మేరకు టికెట్ రేట్ల పెంపు ఉండకుండా చూసుకుంటానని విజయ్…

7 hours ago