ఈ ఏడాది పాన్ ఇండియా స్థాయిలో అత్యధిక అంచనాలతో రాబోతున్న చిత్రాల్లో ‘పెద్ది’ ఒకటి. ‘ఆర్ఆర్ఆర్’తో నేషనల్ వైడ్ ఫాలోయింగ్ సంపాదించిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. తర్వాతి చిత్రాలతో నిరాశపరిచినప్పటికీ, ‘పెద్ది’కి మాత్రం ఇప్పటికే కావాల్సినంత హైప్ వచ్చింది. అదంతా ‘చికిరి’ పాట పుణ్యమే. అది ఎవ్వరూ ఊహించని స్థాయిలో దేశవ్యాప్తంగా వైరల్ అయింది.
‘పెద్ది’ని మార్చి 26కే రిలీజ్ చేయాలని అనుకున్నారు కానీ.. అప్పటికి సినిమాను రెడీ చేయడం కష్టమని భావించి ఇంకో నెల రోజులు విడుదల తేదీని వెనక్కి జరిపారు. ఏప్రిల్ 30న విడుదల అని ఇటీవలే కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. ఐతే అప్పటికైనా పక్కాగా సినిమా రిలీజవుతుందా అనే అనుమానాలు లేకపోలేదు. ఎందుకంటే ఇంకా ఈ సినిమా చిత్రీకరణ పూర్తి కాలేదు.
ఇంకా నెల రోజులకు పైగానే చిత్రీకరణ జరపాల్సి ఉందట. ముందు షూట్ అవ్వాలి. ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ చేయాలి. పాన్ ఇండియా స్థాయిలో నాలుగు భాషల్లో పక్కాగా డబ్బింగ్ చేయాలి. అంతకంటే ముందు వివిధ భాషలకు పాటలు పూర్తి చేయాలి. అలాగే బ్యాగ్రౌండ్ స్కోర్ పని కూడా అవగొట్టాలి. కానీ రెహమాన్ అంటే ఆలస్యానికి మారుపేరు. బీజీఎం కోసం నెలల తరబడి సమయం తీసుకుంటాడు.
పాటల పని ఈపాటికే పూర్తి అయి ఉండొచ్చు కానీ.. ఇంకో నెల రోజుల పాటు షూట్ అయ్యాక, రెహమాన్ తక్కువ టైంలో బీజీఎం వర్క్ చేసి ఫైనల్ ఔట్ పుట్ సమయానికి ఇవ్వగలడా అన్నది సందేహం. ప్రస్తుతానికైతే చాలా టైట్ షెడ్యూల్స్ మధ్య పని నడుస్తోంది. ధైర్యంగా ఏప్రిల్ 30న రిలీజ్ అని ప్రకటించేశారు కానీ.. సమయానికి సినిమా రెడీ అవుతుందా అన్న భయాలు అయితే టీంలో ఉన్నాయి. ముఖ్యంగా రెహమాన్ విషయంలోనే టీం ఎక్కువ భయపడుతున్నట్లు తెలుస్తోంది.
This post was last modified on February 10, 2026 8:18 am
ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…
దసరా నెల ప్రారంభంలో విడుదలవుతున్న మొదటి వారం సినిమాల్లో సిగ్మా మీద మంచి అంచనాలే నెలకొన్నాయి. తమిళనాడు సిఎం కొడుకు…
దక్షిణాది సంగీత దర్శకుల్లో అత్యధిక డిమాండ్ ఎంజాయ్ చేస్తున్న వాళ్లలో మొదట వినిపించే పేరు అనిరుధ్ రవిచందర్. బ్యాక్ గ్రౌండ్…
కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీపై సోషల్ మీడియాలో రకరకాల ట్రోలింగ్స్ వస్తుంటాయి. గతంలో అయితే ఆయనను పప్పు అంటూ…
తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుడైన మోహన్ బాబును గత 20 ఏళ్లలో మన ఇండస్ట్రీ సరిగా ఉపయోగించుకోలేదనే…
సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్ ల మధ్య మరోసారి మాటల యుద్ధం మొదలైంది. కేటీఆర్ కు లగ్జరీ…