అఖిల్ లెనిన్ ఏ ముహూర్తంలో మొదలుపెట్టారో కానీ బ్రేకుల మీద బ్రేకులు పడుతూనే ఉన్నాయి. షూటింగ్ మొదలుపెట్టినప్పుడు శ్రీలీల హీరోయిన్ గా ఉంది. ఆమెతో ఫస్ట్ లుక్ కూడా వదిలారు. తర్వాత రకరకాల కారణాలతో ఆమెను తప్పించి భాగ్యశ్రీ బోర్సేని తీసుకొచ్చారు. అఖిల్ పెళ్లి వల్ల మరికొంత కాలం షూట్ ఆపేయాల్సి వచ్చింది.
తిరిగి కంటిన్యూ అవుతూ విడుదలకు రూట్ క్లియర్ అవుతున్న టైంలో కథ మళ్ళీ మొదటికే వచ్చేలా ఉంది. ప్రాథమికంగా లెనిన్ రిలీజ్ అనుకున్న డేట్ మే 1. కానీ ఏప్రిల్ 30 పెద్ది వస్తుండటంతో దాంతో క్లాష్ ఎంత మాత్రం సేఫ్ కాదని అక్కినేని అభిమానులే కామెంట్ చేస్తున్నారు. సో నిర్ణయం మార్చుకోవాలి.
అంతకన్నా ముందే వద్దామంటే అప్పటికంతా ఫైనల్ కాపీ రెడీ అవుతుందా లేదానేది ఇప్పుడే చెప్పలేని పరిస్థితి ఉందట. ఎందుకంటే ఈ ప్రాజెక్టులో నిర్మాణ భాగస్వామిగా నాగార్జున ప్రతిదీ దగ్గరుండి చూసుకుంటున్నారట. సితార ఎంటర్ టైన్మెంట్స్ ప్రొడక్షన్ అయినప్పటికీ అన్నపూర్ణ భాగస్వామ్యం వల్ల డబుల్ సూపర్ విజన్ ఉంది.
అందులోనూ నాగ్ ఈసారి కంటెంట్ ని బలంగా నమ్మారు. కేవలం ఒక సినిమా అనుభవమున్న మురళి కిషోర్ అబ్బూరుకి చాలా పెద్ద బాధ్యత అప్పగించారు. తమన్ సంగీతం మీద కూడా భారీ బరువు ఉంది. ఇవన్నీ బ్యాలన్స్ చేసుకుంటూ బ్లాక్ బస్టర్ అవుట్ ఫుట్ సిద్ధం చేయాలి.
మరి లెనిన్ బృందం ఏం చేస్తుందనేది ప్రస్తుతానికి సస్పెన్స్. పక్కా పల్లెటూరి బ్యాక్ డ్రాప్ మాస్ లుక్ తో వస్తున్న అఖిల్ అన్నయ్య నాగ చైతన్య తండేల్ తో హిట్టు కొట్టినట్టు, తను కూడా బోణీ చేస్తానడనే నమ్మకంతో ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. నాగవంశీ మాత్రం సోలో డేట్ కోసం చూస్తున్నారట.
ఒకవేళ పెద్దితో క్లాష్ వద్దనుకుంటే మే రెండు లేదా మూడో వారంలోకి షిఫ్ట్ అయిపోవాలి. లేదా జూన్ లో చూసుకోవాలి. కాకపోతే ప్యాన్ ఇండియా సినిమాల క్యాలెండర్లను పరిగణనలోకి తీసుకుని ప్లానింగ్ చేయాలి. రా అండ్ రస్టిక్ డ్రామాగా రూపొందుతున్న లెనిన్ లో రెగ్యులర్ ఎలిమెంట్స్ కు భిన్నంగా షాకింగ్ అంశాలు చాలానే ఉంటాయట.
This post was last modified on February 5, 2026 4:57 pm
వైసిపి అధినేత జగన్ వచ్చే నెలలో యూరప్ పర్యటన పెట్టుకున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఆయన సర్వం సిద్ధం…
కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ లో మారుమ్రోగిన పేరు మృణాల్ ఠాకూర్. సీతారామం బ్లాక్ బస్టర్ అయ్యాక హాయ్ నాన్న విజయం…
విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో అక్టోబర్ ఒకటి విడుదలైన బత్తా రెండు వారాలు పూర్తి చేసుకోవడానికి దగ్గరగా ఉన్నా వసూళ్లు…
ఓటర్ల ప్రత్యేక సవరణపై సమరం కొనసాగుతూనే వుంది. దేశ రాజధాని ఇంద్రప్రస్థ కురుక్షేత్ర యుద్దాన్ని తలపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు,…
ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…
ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…