Movie News

యానిమల్ పార్క్… బోల్డెస్ట్ ట్రీట్

యానిమల్ సినిమాతో బాలీవుడ్ మేకర్స్ ని సైతం ముక్కున వేలేసుకునేలా చేశాడు సందీప్ వంగ. అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్ సింగ్ తోనే అక్కడ ఆడియన్స్ ని ఆకట్టుకున్న ఈ దర్శకుడు యానిమల్ తో తన బోల్డ్ సినిమాటిక్ ఎక్స్ ప్రెషన్ తో షేక్ చేశాడు. రణ్ బీర్ కపూర్ ని ఇలా మనం ఎందుకు చూపించలేకపోయాం అని బాలీవుడ్ మేకర్స్ అంతా తలలు పట్టుకునేలా చేశాడు. యానిమల్ తో సందీప్ పేరు మారుమోగిపోయింది. ఆ సినిమాతో అప్పటిదాకా అసలు లైం లైట్ లో లేని త్రిప్తి కూడా స్టార్ క్రేజ్ దక్కించుకుంది.

యానిమల్ వచ్చి రెండేళ్లు అవుతున్నా ఇంకా ఆ సినిమా తాలూకా బజ్ కొనసాగుతూనే ఉంది. లేటెస్ట్ గా ఈ సినిమాను జపాన్ లో రిలీజ్ షెడ్యూల్ చేశారు. స్వయంగా సందీప్ వంగ, రణ్ బీర్ వెళ్లి జపాన్ లో ప్రమోషన్స్ చేస్తున్నారు. ఈ క్రమంలో యానిమల్ పార్క్ గురించి హింట్ ఇచ్చాడు డైరెక్టర్ సందీప్. యానిమల్ పార్క్ మరింత బోల్డ్ అండ్ వైల్డ్ గా ఉంటుందని అక్కడ ఆడియన్స్ తో చెప్పాడు సందీప్ వంగ. యానిమల్ చూసే చాలామంది షాక్ అయ్యి సినిమాను ఇలా కూడా తీస్తారా అంటూ నానా హడావిడి చేశారు.

కానీ సందీప్ యానిమల్ పార్క్ ని యానిమల్ ని మించి అంటే డబల్ ఎక్స్ మోడ్ లో చేసే ప్లానింగ్ లో ఉన్నాడని అతని కామెంట్స్ తో తెలుస్తుంది. సో సందీప్ ఇలా చెప్పిన దగ్గర నుంచి ఆ సినిమా ఎప్పుడెప్పుడు సెట్స్ మీదకు వెళ్తుందా అన్న ఆసక్తి ఆడియన్స్ లో మొదలైంది.

ప్రస్తుతం సందీప్ వంగ ప్రభాస్ తో స్పిరిట్ చేస్తున్నాడు. ఆ సినిమా నెక్స్ట్ ఇయర్ మార్చి రిలీజ్ టార్గెట్ పెట్టుకున్నారు. అటు స్పిరిట్ రిలీజ్ అవగానే యానిమల్ పార్క్ మొదలు పెట్టి 2028లో రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నాడు సందీప్ వంగ.

రణ్ బీర్ కపూర్ కూడా రామాయణం ప్రాజెక్ట్ తో బిజీగా ఉన్నాడు. రామాయణ్ పార్ట్ 1 ఈ ఇయర్ నవంబర్ లో రిలీజ్ షెడ్యూల్ చేశారు. సో ఆ సినిమా రిలీజ్ తర్వాత యానిమల్ పార్క్ కోసమే రణ్ బీర్ టైం కేటాయిస్తారని చెప్పొచ్చు. సందీప్ సినిమాలే కాదు స్టేట్మెంట్స్ కూడా వైరల్ అవుతాయి. యానిమల్ పార్క్ పై సందీప్ బోల్డ్ అండ్ వైల్డ్ అనే కామెంట్స్ చూసి యానిమల్ పార్క్ కచ్చితంగా ఆడియన్స్ కి బోల్డెస్ట్ ట్రీట్ ఇవ్వడం పక్కా అని ఫిక్స్ అవుతున్నారు.

This post was last modified on February 5, 2026 3:30 pm

Share

Recent Posts

పిఠాపురం ఇకపై పవన్ కంచు కోట

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నియోజకవర్గమైన పిఠాపురంలో అభివృద్ధి పనులు పరుగులు పెడుతున్నాయి. కూటమి ప్రభుత్వంలో కీలకపాత్ర పోషిస్తున్న పవన్…

23 minutes ago

రక్తంతో రాసుకున్న ‘ప్యారడైజ్’ శాసనం

న్యాచురల్ స్టార్ నాని, దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ సెప్టెంబర్ 24 విడుదలకు రెడీ…

2 hours ago

డీఎస్సీపైనే వైసీపీకి ఎందుకంత మంకుపట్టు?

ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో ఒక్క డీఎస్సీ నోటిఫికేషన్ కూడా విడుదల చేయలేదు, ఒక్క ఉపాధ్యాయ నియామకాన్ని…

2 hours ago

కొత్త మార్పుల వైపు చరణ్ & సుకుమార్ ?

ఇంకా ప్రారంభం కాలేదు కానీ క్యాస్టింగ్ ముందే ఫైనల్ చేసుకోవాలి కాబట్టి ఆర్సి 17కి సంబంధించిన పనుల్లో సుకుమార్ టీమ్…

3 hours ago

నాగార్జున 100 గురించి ఎప్పుడు చెబుతారు

అక్కినేని నాగార్జున వందో సినిమా హడవిడి లేకుండా షూటింగ్ జరుపుకుంటోంది. మాములుగా ఏదో ఒక అప్డేట్ లీకుల రూపంలో కానీ…

4 hours ago

జార్ఖండ్ లో మరో సోనమ్ వాంగ్ చుక్ దీక్ష

దేశంలో ఎక్కడ చూసినా విద్యార్థి ఉద్యమాలు జరుగున్నాయి. ఢిల్లీ నుంచి మొదలుపెట్టుకొని ఆంధ్రప్రదేశ్, తెలంగాణా, జార్ఖండ్, బీహార్, పశ్చిమ బెంగాల్…

6 hours ago