Political News

కూటమి మరింత స్ట్రాంగ్…!

ఏపీలో కూటమి ప్రభుత్వం మరింత బలోపేతం అవుతోందా? పార్టీల మధ్య సమన్వయం కట్టుతప్పకుండా జాగ్రత్తగా చూసుకుంటున్నారా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. తాజాగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో కూటమి పార్టీల మధ్య సఖ్యత విషయంలో పలు సందేహాలు వస్తున్నాయన్న చర్చ జరిగింది. ముఖ్యంగా రెండు కీలక అంశాలపై ప్రజల్లోనూ జోరుగా చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో ఉమ్మడిగా రాజకీయ వివాదాలను ఎదుర్కొనాలన్నది ఇప్పుడు ప్రధాన లక్ష్యం.

తిరుమల లడ్డూ వ్యవహారంపై వైసీపీ వర్సెస్ టీడీపీ మధ్య పోరుగా చర్చ సాగుతోంది. అంటే.. దీనిలో ఇతర కూటమి పార్టీలకు సంబంధం లేదన్న వాదన వినిపిస్తోంది. దీంతో ఈ వ్యవహారంపై వైసీపీ నేతలు వర్సెస్ టీడీపీ నేతల మధ్య మాత్రమే పోరు సాగుతోంది. వాస్తవానికి గతంలోనే ఏ సమస్య వచ్చిన కలసి కట్టుగా స్పందించాలని, ఎదుర్కొనాలని కూడా నిర్ణయించుకున్నారు. కానీ, తాజా పరిణామాల్లో జనసేన పార్టిసిపేషన్ తగ్గింది.

జనసేన నేతలు చేస్తున్న రాజకీయ వ్యవహారాలు కూడా కాకరేపుతున్నాయి. అరవ శ్రీధర్ ఎపిసోడ్ నుంచి బొలిశెట్టి సత్యనారాయణ, పార్టీ అధికార ప్రతినిధి రజనీ సహా పలువురు నాయకుల వ్యవహారం ఈ పార్టీని కూడా ఇబ్బంది పెడుతోంది. ఈ క్రమంలో వైసీపీ నుంచి ఎదురుదాడి కనిపిస్తోంది. దీనికి బలమైన కౌంటర్ ఇచ్చే విషయంలో టీడీపీ నేతలు సహా బీజేపీ నాయకులు కలిసి రావడం లేదన్న చర్చ ఉంది. ఈ నేపథ్యంలోనే కూటమిపై అనుమానాలు పెరిగాయి.

దీనిని పసిగట్టిన సీఎం చంద్రబాబు, జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌లు హుటాహుటిన భేటీ అయ్యారు. పైకి రాజ్యసభ వ్యవహారమేనని అంటున్నా, అంతర్గత చర్చల్లో సఖ్యత పైనే ఎక్కువగా దృష్టి పెట్టారు. క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలను అంచనా వేసుకుని, నాయకుల మధ్య కలివిడిని పెంచకపోతే ఇది రాబోయే రోజుల్లో ఇబ్బందులకు గురిచేయొచ్చని భావిస్తున్నారు. అందుకే సఖ్యతపైనే ఎక్కువగా దృష్టి పెట్టారు. రాబోయే రోజుల్లో ఉమ్మడి కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. సో, మొత్తంగా చూస్తే కూటమి బలం తగ్గలేదన్న సంకేతాలు ఇస్తున్నారు.

This post was last modified on February 5, 2026 4:59 pm

Share

Recent Posts

కళ్యాణ్ నెమ్మదించినా ఇబ్బంది లేదు

మొదటి మూడు రోజులు డీసెంట్ టాక్ తో దూసుకెళ్లిన కామ్రేడ్ కళ్యాణ్ నిన్న సోమవారం నుంచి బాగా డ్రాప్ అయినట్టు…

51 minutes ago

పెద్ద గండం దాటేసిన రణబాలి

ఇంకో మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రణబాలి బుకింగ్స్ మెల్లగా ఊపందుకుంటున్నాయి. సాధారణంగా ఓవర్సీస్ లో విజయ్ దేవరకొండ చూపించే…

1 hour ago

జ‌గ‌న్ విదేశీ ప‌ర్య‌ట‌నకు బ్రేక్ ప‌డుతుందా?

వైసిపి అధినేత జగన్ వచ్చే నెలలో యూరప్ పర్యటన పెట్టుకున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఆయన సర్వం సిద్ధం…

4 hours ago

డెకాయిట్ తర్వాత దర్శనం లేదేంటి

కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ లో మారుమ్రోగిన పేరు మృణాల్ ఠాకూర్. సీతారామం బ్లాక్ బస్టర్ అయ్యాక హాయ్ నాన్న విజయం…

6 hours ago

సత్తా చాటుతుందంటే మొహం చాటేసింది

విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో అక్టోబర్ ఒకటి విడుదలైన బత్తా రెండు వారాలు పూర్తి చేసుకోవడానికి దగ్గరగా ఉన్నా వసూళ్లు…

6 hours ago

జనాభా పెరుగుతుంటే ఓట్లు ఎలా తగ్గుతాయి?

ఓటర్ల ప్రత్యేక సవరణపై సమరం కొనసాగుతూనే వుంది. దేశ రాజధాని ఇంద్రప్రస్థ కురుక్షేత్ర యుద్దాన్ని తలపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు,…

7 hours ago