Movie News

దురంధర్ VS విశ్వరూపం – ఎందుకీ రచ్చ?

ఆల్ ఇండియా బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా అవతరించిన దురంధర్ తాజాగా ఓటిటిలో వచ్చాక కొత్త డిబేట్ మొదలయ్యింది. ఇంతకన్నా గొప్పగా కమల్ హాసన్ పన్నెండు సంవత్సరాల క్రితమే 2013లో విశ్వరూపం తీశాడనేది తమిళ అభిమానుల వాదన. దానికి కౌంటర్ గా బాలీవుడ్, టాలీవుడ్ మూవీ లవర్స్ వాదించుకుంటున్న వైనం ట్వీట్స్ కామెంట్స్ లో కనిపిస్తోంది.

నిజం చెప్పాలంటే అసలీ వాదోపవాదాలు అనవసరం. ఎందుకనేది అర్థం కావాలంటే కొంత విశ్లేషణ చేసుకోవాలి. విశ్వరూపంలో టెర్రరిజం ఇష్యూని టచ్ చేసిన మాట వాస్తవమే కానీ అందులో ప్రధానంగా చూపించింది ఆఫ్గనిస్తాన్ కేంద్రంగా పెరిగిపోయిన తీవ్రవాదం గురించి.

‘రా’లో పని చేసే ఒక ముస్లిం గూఢచారి ఆఫ్ఘానిస్తాన్ వెళ్ళిపోయి, అక్కడి ప్రజల్లో నమ్మకస్తుడిగా ఎదిగి, వాళ్ళ కుట్రలను భగ్నం చేసే సాహసానికి పూనుకుంటాడు. తర్వాత తన ఉనికిని మార్చుకుని డాన్స్ డైరెక్టర్ అవతారం ఎత్తి ఉగ్రవాద మూలాల గురించి వెతుకుతూ ఉంటాడు.

రెండు టైం లైన్స్ లో దర్శకుడు కమల్ హాసన్ చాలా వైవిధ్యమైన ట్రీట్ మెంట్ తో విశ్వరూపం తీశారు. అయితే డాక్యమెంటరీ తరహా స్క్రీన్ ప్లే వల్ల విశ్వరూపంలో అధిక భాగం ల్యాగ్ అనిపిస్తుంది. సన్నివేశాల్లోని ఘాడత వల్ల కనెక్ట్ అవుతాం కానీ రెగ్యులర్ ఆడియన్స్ చాలా మందికి కాన్సెప్ట్ అర్థం కాలేదు. అయినా సరే తమిళంలో బ్లాక్ బస్టర్ వసూళ్లు సాధించింది.

దురంధర్ కేసు వేరు. పాకిస్థాన్ లో పాతుకుపోయిన మాఫియాని, అక్కడి రాజకీయం ఇండియా మీద తీవ్రవాదాన్ని ఎలా ఎగదోస్తోందో కళ్ళకు కట్టినట్టు కమర్షియల్ టచ్ లో చూపించారు దర్శకుడు ఆదిత్య ధార్. మూడున్నర గంటలు కథనం పరుగులు పెడుతూనే ఉంటుంది. అందుకే విసుగు రాకుండా ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.

విశ్వరూపం సూపర్ హిట్టే కానీ ఇంత పెద్ద రెసెప్షన్ దక్కలేదు. రెండు కాన్సెప్టులు వేరు కాబట్టి అసలు పోలిక అనవసరం. కాకపోతే అక్షయ్ ఖన్నాని పోలిన పాత్రని విశ్వరూపంలో రాహుల్ బోస్ పోషించాడు. కానీ ప్రెజెంటేషన్ లో చాలా వ్యత్యాసం ఉంటుంది. దేని ప్రత్యేకత దానిదే కానీ బాక్సాఫీస్ లెక్కల్లో చూసుకుంటే దురంధర్ దే పైచేయి. అయితే ఇక్కడ నటన విషయంలోనూ కమల్ రణ్వీర్ ఫాన్స్ మధ్య వార్ నడుస్తుంది కానీ నటనలో ఎవరిది పే చెయ్యి అనే డిబేట్ కూడా అనవసరం. దానికి సమాధానం అందరికీ తెలిసిందే.

This post was last modified on February 5, 2026 8:08 am

Share

Recent Posts

వివేకా కేసులో వాస్తవాలు కక్కిస్తాం

మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వాస్తవాలు కక్కిస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. కుట్రలే గొడ్డలి…

27 minutes ago

వారణాసి ముందు ఇది పెద్ద దెబ్బే

డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ బాక్సాఫీస్ ఫలితం చాలా త్వరగా తేలిపోయింది. ప్రీమియర్ల నుంచి మొదలైన మిక్స్డ్ టాక్ చివరికి…

2 hours ago

కీర్తి సురేష్ ఉన్నా లాభం లేకపోయింది

మొన్న అక్టోబర్ రెండు గాంధీ జయంతికి చాలా సినిమాలొచ్చాయి. వాటిలో తమిళ డబ్బింగ్ డోరతీ కూడా ఉంది. సున్నితమైన అంశం…

3 hours ago

నాగవంశీ కారణాలు నమ్మశక్యంగా ఉన్నాయా

నిన్న రాత్రంతా ప్రచారం జరిగినట్టే ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా అఫీషియలయ్యింది. నిర్మాత నాగవంశీ ప్రెస్ మీట్ పెట్టి…

3 hours ago

తమిళ రాజకీయాల్లోకి ఇంకో స్టార్?

జయలలిత, కరుణానిధి ఒకరి తర్వాత ఒకరు మరణించడంతో తమిళ రాజకీయాల్లో చాలా ఏళ్ల కిందటే ఒక పెద్ద ఖాళీ ఏర్పడింది.…

3 hours ago

ట్రెండింగ్ సాంగ్ ‘జిలేబి’ని ఎవరు వాడుకుంటారో

ఈ మధ్య సినిమాల్లో ఛార్ట్ బస్టర్ సాంగ్స్ కు కరువొచ్చి పడింది. ఆల్బమ్ మొత్తంలో ఒకటి రెండు పాటలు బాగుంటే…

4 hours ago