Movie News

మహేష్ రన్నింగ్ స్టైల్ మార్చడమేంటి జక్కన్నా?

తెలుగు సినిమాలో పరిగెత్తడంలోనూ ప్రత్యేక స్టాండర్డ్ సెట్ చేసిన ఏకైక హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు. అతని రన్నింగ్ స్టైల్ గురించి కేవలం ఫ్యాన్స్ మాత్రమే కాదు, పెద్ద పెద్ద హీరోలు కూడా మాట్లాడుతూ ఉంటారు. మెగా బ్రదర్ నాగబాబు, ఆపకుండా గంటసేపు పరిగెత్తగలిగే ఒకేఒక్క హీరో మహేష్ బాబు అంటూ ఇచ్చిన ఎలివేషన్ గుర్తు ఉండే ఉంటుంది.

అలాంటిది ఇప్పుడు వారణాసి కోసం మహేష్ బాబు రన్నింగ్ స్టైల్ ను రాజమౌళి మార్చేశాడని మహేష్ బాబు చెప్పడం ఫాన్స్ ని ఆశ్చర్యానికి గురి చేసింది. ఐతే ఇది రాముడి పాత్ర కోసం తీసుకున్న నిర్ణయం అని తెలుస్తుంది.

సినిమాలోని కీలక ఘట్టంలో నేను చేస్తున్న రాముడి పాత్ర కోసం నా నుంచునే విధానం, నడిచే విధానంతో పాటు నేను పరిగెత్తే విధానం కూడా మార్చాలని రాజమౌళి చెప్పడంతో దానికోసం సెపరేట్ గా ఆరు నెలలు ట్రైనింగ్ తీసుకున్నట్టు మహేష్ చెప్పడు. ఐతే అది కేవలం రెండు సన్నివేశాల్లోనే ఉంటుందని చెప్పడం మరో పెద్ద షాక్.

ఇక్కడ రాజమౌళి నిర్ణయానికి ఫాన్స్ ఏకీవభించినా ఒక రిక్వెస్ట్ చేస్తున్నారు. కొత్త రన్నింగ్ స్టైల్ కేవలం రాముడి సన్నివేశాలకు ఉంచి మిగతా సాహసాల ఘట్టాలకు మహేశ్ పాత స్టైల్ ను అలానే ఉంచాలని ఫ్యాన్స్ రిక్వెస్ట్ చేస్తున్నారు. మరి జక్కన్న వారి అభ్యర్థనను స్వీకరిస్తారో లేదో వేచి చూడాలి.

ప్రస్తుత సమాచారం మేరకు రాముడి ఘట్టం వరకు మాత్రమే ఈ కొత్తదనం ఉంటుందని తెలుస్తుంది. నిజానికి అలా అయితేనే ఎక్కువ హై ఇస్తుంది. కొత్తదనం సినిమా మొత్తం కనపడితే అది ఫ్యాన్స్ ఎలా తీసుకుంటారో చెప్పలేం. అదే కీలక భాగం వరకు కొత్త మహేష్ ను చూపిస్తే వేరే లెవెల్ కిక్ ఇస్తుందని ఫ్యాన్స్ కోరిక.

This post was last modified on February 5, 2026 7:21 am

Share

Recent Posts

వారణాసి ముందు ఇది పెద్ద దెబ్బే

డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ బాక్సాఫీస్ ఫలితం చాలా త్వరగా తేలిపోయింది. ప్రీమియర్ల నుంచి మొదలైన మిక్స్డ్ టాక్ చివరికి…

1 hour ago

కీర్తి సురేష్ ఉన్నా లాభం లేకపోయింది

మొన్న అక్టోబర్ రెండు గాంధీ జయంతికి చాలా సినిమాలొచ్చాయి. వాటిలో తమిళ డబ్బింగ్ డోరతీ కూడా ఉంది. సున్నితమైన అంశం…

2 hours ago

నాగవంశీ కారణాలు నమ్మశక్యంగా ఉన్నాయా

నిన్న రాత్రంతా ప్రచారం జరిగినట్టే ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా అఫీషియలయ్యింది. నిర్మాత నాగవంశీ ప్రెస్ మీట్ పెట్టి…

2 hours ago

తమిళ రాజకీయాల్లోకి ఇంకో స్టార్?

జయలలిత, కరుణానిధి ఒకరి తర్వాత ఒకరు మరణించడంతో తమిళ రాజకీయాల్లో చాలా ఏళ్ల కిందటే ఒక పెద్ద ఖాళీ ఏర్పడింది.…

2 hours ago

ట్రెండింగ్ సాంగ్ ‘జిలేబి’ని ఎవరు వాడుకుంటారో

ఈ మధ్య సినిమాల్లో ఛార్ట్ బస్టర్ సాంగ్స్ కు కరువొచ్చి పడింది. ఆల్బమ్ మొత్తంలో ఒకటి రెండు పాటలు బాగుంటే…

4 hours ago

జ్ఞానేష్ కుమార్‌ను ఇప్పటికిప్పుడు తొలగించలేం

కేంద్ర ఎన్నిక‌ల సంఘం క‌మిష‌న‌ర్ జ్ఞానేష్ కుమార్‌ను ఉద్దేశించి సుప్రీంకోర్టు హెచ్చ‌రిక చేసింది. ఆయన త‌ప్పు చేసిన‌ట్టు నిరూపిత‌మైతే.. క‌చ్చితంగా…

5 hours ago