ముందు వెనుక ఆలోచిస్తున్న ఉస్తాద్

పెద్ది వాయిదాని టీమ్ అధికారికంగా ప్రకటించలేదు కానీ పోస్ట్ పోన్ లో ఎలాంటి అనుమానం అక్కర్లేదు. తాజా పరిణామాలు, జనవరి ఆఖరున ప్లాన్ చేసుకున్న సెకండ్ ఆడియో సింగల్ ఆపేయడం లాంటివి సదరు నిర్ణయాన్ని చెప్పకనే చెబుతున్నాయి. అయితే పెద్ది డ్రాప్ అయ్యింది కాబట్టి ఆ స్థానంలో ఉస్తాద్ భగత్ సింగ్ వస్తే మంచి లాభసాటి అవుతుందని మెగాభిమానులతో పాటు ట్రేడ్ కూడా ఎదురు చూసింది.

దర్శకుడు హరీష్ శంకర్ దీనికి కొద్దిరోజుల క్రితం హఠాత్తుగా సోషల్ మీడియాలో పబ్లిసిటీ మొదలుపెట్టారు. తీరా చూస్తే రెండు మూడు రోజుల సౌండ్ తర్వాత ఉస్తాద్ బృందం హఠాత్తుగా మౌనం వహిస్తోంది.

ఇక్కడ మైత్రి టీమ్ చాలా వ్యూహాత్మకంగా ఆలోచిస్తున్నట్టు కనిపిస్తోంది. ఎందుకంటే మార్చి రెండో వారంలో దురంధర్ 2, టాక్సిక్ వస్తున్నాయి. వీటికి సంబంధించిన థియేటర్ అగ్రిమెంట్లు బయట రాష్ట్రాల్లో మొదలైపోయాయి. త్వరలోనే ఏపీ తెలంగాణ కూడా మొదలుపెడతారు. వీటికున్న డిమాండ్ తెలిసిందే. అడవి శేష్ డెకాయిట్ కూడా ఉంది.

ఎంత పవన్ కళ్యాణ్ మన దగ్గర పెద్ద హీరో, డిప్యూటీ సిఎం అయినా పక్క స్టేట్స్ లో రణ్వీర్ సింగ్, యష్ ను ఫేస్ చేయడం అంత సులభంగా ఉండదు. అందులోనూ ఉస్తాద్ భగత్ సింగ్ కమర్షియల్ ఎంటర్ టైనర్. ఉదాహరణకు కర్ణాటకలో పవన్ కళ్యాణ్ ఫాలోయింగ్ భారీగా ఉన్న దృష్ట్యా అలాంటి చోట గరిష్టంగా రెవిన్యూ రాబట్టుకోవాలంటే కాంపిటీషన్ తీవ్రంగా ఉండకూడదు. యాష్ టాక్సిక్ పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఆ సమయంలో పవన్ ఉస్తాద్ వస్తే కీలకమయిన కర్ణాటక వసూళ్లపై తీవ్ర ప్రభావం పడుతుంది.

ఈ లెక్కలన్నీ చూసుకుని ఏప్రిల్ అయితేనే బెటరనే అభిప్రాయం యూనిట్ లో వ్యక్తమవుతోందని అంటున్నారు. అందులోనూ ప్రమోషన్లకు సరిపడా టైం కావాలి. పవన్ కళ్యాణ్ డేట్స్ చెక్ చేసుకోవాలి. ఎలాగూ ప్యారడైజ్ కూడా తప్పుకుంది కాబట్టి ఆ అడ్వాంటేజ్ ని పూర్తిగా వాడుకోవాలంటే ఏప్రిల్ రెండో వారం లోపు వచ్చేస్తే బెటర్.

అదే దిశగా డెసిషన్ తీసుకునే ఆలోచనలో ఉస్తాద్ గ్యాంగ్ ఉన్నట్టు సమాచారం. ఏదైనా వీలైనంత త్వరగా అనౌన్స్ మెంట్ ఇవ్వడం బెటర్. ఎక్కువ ఆలస్యం చేస్తే మిగిలిన నిర్మాతలు కర్చీఫ్స్ వేస్తారు. ఓజి అంత హైప్ ఉండదు కాబట్టి ఉస్తాద్ పబ్లిసిటీ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిందే.