రాజమౌళి సినిమా అంటేనే విజువల్స్ కి మించి యాక్షన్ సీక్వెన్స్ లో ఒక ఎమోషన్ ఉంటుంది. ఇప్పుడు మహేష్ బాబుతో చేస్తున్న ‘వారణాసి’ ప్రాజెక్ట్ లో కూడా అదే స్థాయి ఇంపాక్ట్ ఉండబోతోందని ఫిల్మ్ నగర్ వర్గాల్లో గట్టి చర్చ నడుస్తోంది. ఈ సినిమాలో దాదాపు నాలుగు మేజర్ యాక్షన్ బ్లాక్స్ ఉండబోతున్నాయట. గ్లోబ్ ట్రాటింగ్ అడ్వెంచర్ కాబట్టి ఒక్కో యాక్షన్ సీన్ ఒక్కో డిఫరెంట్ లొకేషన్ లో, సరికొత్త కాన్సెప్ట్ తో రాజమౌళి డిజైన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ నాలుగు యాక్షన్ బ్లాక్స్ లో ఒక పర్టికులర్ సీక్వెన్స్ మాత్రం ఆడియన్స్ మైండ్ బ్లాక్ చేసే రేంజ్ లో ఉంటుందని సమాచారం. అదే రామాయణ కాలం నాటి ఎపిసోడ్ అని టాక్. ఇక గతంలో రాజమౌళి సినిమాల్లోని ఇంటర్వెల్ లేదా క్లైమాక్స్ యాక్షన్ సీన్స్ ఎలాగైతే ఒక బెంచ్ మార్క్ సెట్ చేశాయో, ఈ సినిమాలో కూడా మరో సీక్వెన్స్ కోసం భారీగా ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. గ్లోబల్ ఆడియన్స్ ని టార్గెట్ చేస్తూ హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ల పర్యవేక్షణలో ఈ సీన్స్ ఉండబోతున్నాయట.
ఫస్ట్ హాఫ్ లో రెండు సెకండ్ హాఫ్ లో రెండు యాక్షన్ ఘట్టాలతో జక్కన్న పక్కా లెక్కలతో స్క్రీన్ ప్లేని సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక మహేష్ బాబు కెరీర్ లోనే ఇది అత్యంత కష్టతరమైన మేకోవర్ అని చెప్పాలి. రుద్ర అనే పాత్రలో మహేష్ బాబును గతంలో ఎన్నడూ చూడని విధంగా ప్రెజెంట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఫిజికల్ మేకోవర్ తో పాటు ఈ యాక్షన్ సీక్వెన్స్ లో మహేష్ బాబు పెర్ఫార్మెన్స్ సినిమాకే హైలైట్ కానుందట.
సుమారు 1000 కోట్లకు పైగా బడ్జెట్ పెడుతున్నారు కాబట్టి, ఆ క్వాలిటీ స్క్రీన్ మీద కనిపించేలా రాజమౌళి ప్రతి ఫ్రేమ్ ని పక్కాగా ప్లాన్ చేస్తున్నారు. కేవలం యాక్షన్ మాత్రమే కాకుండా దాని వెనుక ఉన్న ఎమోషన్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యేలా జాగ్రత్త పడుతున్నట్లు ఇన్ సైడ్ టాక్.
ఐమాక్స్ ఫార్మాట్ లో వస్తున్న ఈ విజువల్ వండర్ లో యాక్షన్ ఎపిసోడ్స్ థియేటర్ లో ఒక సరికొత్త ఎక్స్ పీరియన్స్ ఇస్తాయని మేకర్స్ నమ్ముతున్నారు. 2027 ఏప్రిల్ లో రాబోతున్న ఈ సినిమా ఇండియన్ సినిమా స్థాయిని మరో మెట్టు ఎక్కించేలా ఉంటుందని భావిస్తున్నారు. రాజమౌళి విజన్, మహేష్ బాబు క్రేజ్ తోడైతే బాక్సాఫీస్ రికార్డులు తిరగరాయడం ఖాయంగా కనిపిస్తోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates