మార్చి 27 విడుదల కావాల్సిన పెద్ది వాయిదా ప్రచారం మరింత బలపడుతోంది. టీమ్ ఖండించడం లేదు కానీ డేట్ లో ఎలాంటి మార్పు లేదనే రీతిలో సంకేతాలు ఇస్తోంది. కానీ ఫ్యాన్స్ లో అనుమానాలు అలాగే ఉన్నాయి. దర్శకుడు బుచ్చిబాబు రామ్ చరణ్ పుట్టినరోజుని టార్గెట్ గా పెట్టుకుని దానికి అనుగుణంగానే షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ రెండూ చేస్తున్నారు.
అయితే ప్రమోషన్లతో పాటు మిగిలిన పనులకు టైం సరిపోకపోయే ప్రమాదం ఉండటం, దురంధర్ 2తో కేవలం వారం గ్యాప్ లో క్లాష్ కు సిద్ధపడటం లాంటివి ఖచ్చితంగా రిస్క్ పెంచేవే. అందుకే పెద్ది నిర్ణయం ఒక కోణంలో చూస్తే లాభదాయకమే.
తాజాగా మే 1 రిలీజ్ అవకాశాలను పరిశీలనలో పెట్టారని ఇన్ సైడ్ టాక్. అదే తేదీకి అఖిల్ లెనిన్ దింపే ఆలోచనలో సితార ఎంటర్ టైన్మెంట్స్ ఉంది. అఫీషియల్ గా చెప్పలేదు. ఒకవేళ పెద్ది వచ్చే పక్షంలో తప్పుకునే ఛాన్స్ ఎక్కువగా ఉంది. మార్చి వీకెండ్ నిజానికి మంచి టైం. రంగస్థలం అదే వారంలో వచ్చి రికార్డులు కొల్లగొట్టింది.
ఎందుకంటే స్కూల్స్ కాలేజీల సెలవులు అప్పుడే మొదలవుతాయి. పైగా సమ్మర్ హాలిడేస్ ఉంటాయి కాబట్టి థియేటర్ ఆక్యుపెన్సీలు పెరుగుతాయి. కానీ మే 1కి ఆ స్కోప్ తగ్గిపోతుంది. బళ్ళు తెరిచే సీజన్ కనక కుటుంబ ప్రేక్షకులను గంపగుత్తగా సినిమా హాళ్లకు రప్పించడం సులభంగా ఉండదు.
సో ఇవన్నీ ఆలోచించుకునే పనిలో పెద్ది టీమ్ ఉండే ఉంటుంది. అంతా చూసుకున్నాకే ప్రకటన ఇస్తారు తప్పించి ఇప్పటికిప్పుడు అధికారికంగా ఎలాంటి సమాచారం రాకపోవచ్చు. ఇక చిరంజీవి విశ్వంభరకు జూలై 10 ఫిక్స్ చేయొచ్చని మరో టాక్. అంటే తండ్రి కొడుకుల మెగా సినిమాలు కేవలం రెండు నెలల గ్యాప్ లో వస్తాయన్న మాట.
అదే జరిగితే ఫ్యాన్స్ కి పండగే. ఎందుకంటే మార్చి చివరిలో పెద్ది ప్లేసులో ఉస్తాద్ భగత్ సింగ్ వస్తే కనక బ్యాక్ టు బ్యాక్ రిలీజులతో అభిమానులు ఉక్కిరిబిక్కరవుతారు. క్లారిటీ వచ్చే దాకా వీటి గురించి రకరకాల చర్చలు జరుగుతూనే ఉంటాయి కానీ కొంచెం వెయిట్ చేయక తప్పదు.
This post was last modified on January 24, 2026 10:00 pm
బ్యాక్ టు బ్యాక్ మూడు సినిమాలు జవాన్, పఠాన్, డంకీ ఇచ్చిన షారుఖ్ ఖాన్ తర్వాత కొంచెం గ్యాప్ తీసుకుని…
రాజకీయాలకు కీలకమైన విజయవాడలో నాయకుల దూకుడు ఓ రేంజ్లో ఉంటుంది. ఈ విషయంలో ఎవరికీ సందేహం లేదు. అయితే.. కేవలం…
పెళ్లంటే ఆడంబరాలకు మారు పేరుగా మారిపోయిన రోజులు ఇవి. ఎవరు ఎక్కువ ఖర్చు పెడితే.. ఎంత ఘనంగా చేసుకుంటే అంత…
టీడీపీ ఫైర్ బ్రాండ్ నేత, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర లేదు. స్వపక్షమైనా, విపక్షమైనా…
వైసీపీ అధినేత జగన్పై సీఎం చంద్రబాబు సెటర్లు పేల్చారు. ``జగన్ ఈ రాష్ట్రానికి గొప్ప ఆస్తి ఇచ్చాడు. నేను కూడా…
భారత క్రికెట్ చరిత్రలో ఎంతోమంది గొప్ప కెప్టెన్లు ఉన్నారు. కానీ ఆ అందరిలో భారత క్రికెట్ను అత్యంత గొప్ప మలుపు…