Movie News

అనిల్ రావిపూడి చెప్పిన స్టార్ మంత్రం

మలయాళంలో మోహన్ లాల్, మమ్ముట్టి లాంటి స్టార్లు ఇమేజ్ ఛట్రంలో ఇరుక్కుపోకుండా అనేక ప్రయోగాలు చేస్తుంటారు. అతి సామాన్యమైన పాత్రలు చేస్తుంటారు. మమ్ముట్టినే తీసుకుంటే ‘కలంకవల్’ అనే కొత్త సినిమాలో ఏకంగా సైకో కిల్లర్‌గా విలన్ పాత్ర చేసి షాకిచ్చారు. లాల్ గత ఏడాది ‘తుడరుమ్’, ‘హృదయపూర్వం’ సినిమాల్లో ఎంత సామాన్యమైన పాత్రలు చేశాడో తెలిసిందే.

ఇలాంటివి మన సీనియర్ స్టార్లు ఎందుకు చేయరు అనే చర్చ తరచుగా జరుగుతుంటుంది. మెగాస్టార్ చిరంజీవి ఈ వయసులోనూ డ్యాన్సులు, ఫైట్లు అంటూ ఒక ఛట్రంలో ఇరుక్కుపోయారని.. ఆయన ప్రయోగాలు చేయొచ్చు కదా అనే ప్రశ్నలు సోషల్ మీడియాలో వినిపిస్తుంటాయి.

ఐతే రజినీకాంత్, చిరు లాంటి స్టార్లకు ఇమేజ్ అన్నది ఒక వరం అని.. దాన్ని ఉపయోగించుకుంటూనే కొంతమేర ప్రయోగాలు చేయొచ్చు కానీ.. పూర్తిగా ఇమేజ్‌కు భిన్నంగా వెళ్లాల్సిన అవసరం లేదని అంటున్నాడు దర్శకుడు అనిల్ రావిపూడి.

చిరుతో తీసిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టిన నేపథ్యంలో స్టార్ హీరోల ఇమేజ్, అభిమానుల ఆకాంక్షల గురించి ఆసక్తికర విశ్లేషణ చేశాడు అనిల్.

‘‘రజినీకాంత్ గారి సినిమాలు బీజీఎం, ఎలివేషన్ లేకుండా కామ్‌గా సాగితే ప్రేక్షకులు చూడలేరు. జైలర్ మూవీలో ఆయన విరగబడి ఫైట్లు చేయకపోయినా ఎలివేషన్ మిస్ కాలేదు. అలాగే చిరంజీవి అనగానే అభిమానులు ఎక్కువ కోరుకునేది డ్యాన్సులు, ఫైట్లు, కామెడీ. ఇవన్నీ విడిచిపెట్టి ఆయన సినిమాలు చేయాల్సిన అవసరం లేదన్నది నా అభిప్రాయం.

రీఎంట్రీలో సైరా, గాడ్ ఫాదర్ లాంటి ప్రయోగాత్మక చిత్రాలను ఆయన చేశారు. కానీ వాటితో పోలిస్తే ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రానికి ఎక్కువ కలెక్షన్లు ఎందుకు వచ్చాయి అంటే.. ఇందులో అభిమానులు కోరుకున్న అంశాలున్నాయి. అలా అని మరీ రొటీన్‌గా, తక్కువ స్థాయిలో సన్నివేశాలు పెట్టాల్సిన అవసరం లేదు. కొంచెం వైవిధ్యమూ ఉండాలి.

చిరంజీవి గారిని వయసుకు తగ్గట్లు చూపించాలి. ‘మన శంకర వరప్రసాద్ గారు’లో లవ్ స్టోరీని డిఫరెంట్‌గా, మెచ్యూర్డ్‌గా ప్రెజెంట్ చేశాం. దాన్ని ప్రేక్షకులు బాగా ఆస్వాదించారు. చిరంజీవి గారు ఇప్పటికీ ఫిట్‌గా ఉంటూ, ఫిజిక్ మెయింటైన్ చేస్తున్నారు. అలాంటపుడు దాన్ని ఉపయోగించుకుని ఆయన్ని హీరోయిగ్గా చూపించడంలో తప్పు లేదు. అలా అని వయసుకు తగ్గట్లుగానే కథ, పాత్రలు, సన్నివేశాలు ఉండేలా చూసుకోవాలి. అలా చేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి’’ అని అనిల్ తెలిపాడు.

This post was last modified on January 23, 2026 7:02 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

జ‌గ‌న్ అప్పుల‌కు వ‌డ్డీలు తగ్గించిన చంద్రబాబు

ఏపీలో జ‌గ‌న్ ప‌రిపాల‌నా కాలంలో చేసిన అప్పుల కార‌ణంగా రాష్ట్ర ఆర్థిక వ్య‌వ‌స్థ పూర్తిగా గాడి త‌ప్పింద‌ని సీఎం చంద్ర‌బాబు…

24 minutes ago

మరోసారి భారత్ ఊచకోత

న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో టీమిండియా వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసి అదరగొట్టింది. రాయ్‌పూర్‌లోని షహీద్…

59 minutes ago

బోర్డర్ పరువును సీక్వెల్ నిలబెట్టిందా

1997లో విడుదలైన బోర్డర్ ప్రభంజనాన్ని అప్పట్లో చూసినవాళ్లు అంత సులభంగా మర్చిపోలేరు. పాకిస్థాన్ తో యుద్ధ నేపధ్యాన్ని దర్శకడు జెపి…

1 hour ago

టాలీవుడ్‌పై కోలీవుడ్ కన్ను

తెలుగు సినిమా మార్కెట్ ఇప్పుడు దేశవ్యాప్తంగా నంబర్ వన్ పొజిషన్‌లో ఉంది. వందల కోట్ల వసూళ్లు, మాస్ ఆడియన్స్ పల్స్…

1 hour ago

ప్ర‌భాస్ ఫ్యాన్స్ బూతులు… ప్రొడ్యూసర్ ఫిర్యాదు

రాజాసాబ్ సినిమా మీద ప్ర‌భాస్ అభిమానులు పెట్టుకున్న ఆశ‌లు, అంచ‌నాలు నిల‌బ‌డ‌లేదు. సంక్రాంతి కానుక‌గా భారీ అంచ‌నాల మ‌ధ్య విడుద‌లైన…

2 hours ago

ఉస్తాద్ ముందుకు రావడం మంచిదే

సంక్రాతి సినిమాల సందడి ఒకవైపు కొనసాగుతుండగానే ఇంకోవైపు భవిష్యత్తులో విడుదల కాబోతున్న ప్యాన్ ఇండియా మూవీస్, వాటి రిలీజ్ డేట్ల…

3 hours ago