రిపబ్లిక్ డేని వాడుకుంటేనే రికార్డు వస్తుంది

మన శంకరవరప్రసాద్ గారు సంక్రాంతి పండగ తర్వాత నెమ్మదించారు. సోమవారం నుంచి బుధవారం దాకా ఏపీలో పెంచిన టికెట్ రేట్లే ఉండటం ఆక్యుపెన్సీ మీద ప్రభావం చూపించగా, తెలంగాణలో వర్కింగ్ డేస్ ఎఫెక్ట్ గట్టిగా కనిపించింది. నిన్నటి నుంచి రెండు రాష్ట్రాల్లో ధరలు మాములుగానే ఉన్నాయి.

అయితే అనూహ్యమైన పికప్ కొన్ని ప్రాంతాల్లో నమోదు కాలేదు. బుక్ మై షో గణాంకాల్లో 55 వేలకు పైగా రోజువారీ టికెట్ల అమ్మకాలతో వరప్రసాద్ ముందంజలో ఉండగా రెండో ప్లేస్ లో 16 వేలని దాటి అనగనగా ఒక రాజు, 13 వేలని దాటి నారి నారి నడుమ మురారి తర్వాత ప్లేసుల్లో ఉన్నాయి. రాజా సాబ్ సైతం ట్రెండింగ్ లోనే ఉంది.

ఇప్పుడు రిపబ్లిక్ డే మీద అందరి దృష్టి నిలుస్తోంది. శనివారం వీకెండ్ తో పాటు సండే, మండే వరసగా సెలవులు కావడంతో థియేటర్లలో మళ్ళీ హౌస్ ఫుల్స్ చూడొచ్చనే నమ్మకంతో బయ్యర్లు ఎదురు చూస్తున్నారు. డ్రాప్స్ ఉండటం వల్లే నిర్మాణ సంస్థలు నెంబర్లతో కలెక్షన్ల పోస్టర్లు వదలడం లేదు. ఆ అవకాశం ఇచ్చేది వీకెండే.

మూమెంట్ తగ్గకుండా ఉండేందుకు అనిల్ రావిపూడి రంగంలోకి దిగి వరసగా ఇంటర్వ్యూలు ఇస్తుండగా, ఆదివారం సక్సెస్ మీట్ ని పెద్ద ఎత్తున నిర్వహించే మార్గాల గురించి నిర్మాతలు అన్వేషణలో ఉన్నారు. వసూళ్ళలో ఊపు రావాలంటే ఇలాంటివి చాలా అవసరం. వీలైనంత త్వరగా చేయాలి.

మన శంకరవరప్రసాద్ గారు ప్రస్తుత టార్గెట్ 400 కోట్ల వరల్డ్ వైడ్ గ్రాస్. అది చేరుకోవాలంటే మంగళవారం ఉదయం లోపు ఎంత వీలైతే అంత రాబట్టుకునే ప్రయత్నాలు చేయాలి. ట్రేడ్ అంచనా అయితే ఊహించనంత మాస్ పికప్ అన్ని సెంటర్లలో ఉంటుందని, ఫ్యామిలీ ఆడియన్స్ ఇంకా పెద్ద సంఖ్యలో చూడాల్సి ఉన్నందున వాళ్లంతా ఇప్పుడు ప్రిఫర్ చేస్తారని చెబుతున్నారు.

ఇప్పుడు ఊపందుకోలేదంటే జనవరి చివరి నుంచి పెద్దగా ఆశించడానికి ఏం ఉండదు. మరి వరప్రసాద్ గారు సోమవారం సెకండ్ షో దాకా మాగ్జిమం ఎంత రాబడతారనేది వేచి చూడాలి. ఈ ఫ్రైడే కొత్త రిలీజులు కూడా ఏం రాలేదు.