‘జాతిరత్నాలు’ సినిమాలో చిట్టి పాత్రలో అందం, అభినయంతో మెప్పించిన అమ్మాయి ఫరియా అబ్దుల్లా. థియేటర్ ఆర్టిస్ట్ అయిన ఈ హైదరాబాద్ అమ్మాయి.. ‘జాతిరత్నాలు’ లాంటి మరో మంచి బ్రేక్ కోసం గట్టిగానే ప్రయత్నిస్తోంది. కానీ కథానాయికగా నటించిన లవ్ షేర్ సబ్‌స్క్రైబ్, రావణాసుర, ఆ ఒక్కటీ అడక్కు తనకు తీవ్ర నిరాశనే మిగిల్చాయి.
‘మత్తు వదలరా-2’ హిట్టయినా ప్రేక్షకుల ఫోకస్ మొత్తం సత్య మీద నిలిచి, ఫరియాకు పెద్దగా క్రెడిట్ రాలేదు. ఇటీవలే ‘గుర్రం పాపిరెడ్డి’తో పలకరించిన ఫరియాకు ఆ సినిమా ఆశించిన ఫలితాన్నివ్వలేదు. అయినా ఫరియాకు అవకాశాలకైతే లోటు లేనట్లే కనిపిస్తోంది. ఓవైపు కథాానాయికగా నటిస్తూ.. చిన్న చిన్న పాత్రలూ చేస్తూ ముందుకు సాగోతోంది. ఫరియా వ్యక్తిగత జీవితం గురించి తాజాగా ఆసక్తికర విషయం వెల్లడైంది. ఆమె రిలేషన్‌షిప్‌లో ఉందట.
హీరోయిన్ల ప్రేమాయణం గురించి మీడియాలో ఊహాగానాలు రావడమే కానీ.. వాళ్లకు వాళ్లుగా దాని గురించి ఓపెన్ కావడం అరుదు. ఫరియా ఆ పనే చేసింది. కాకపోతే తన బాయ్ ఫ్రెండ్ పేరు చెప్పకుండా తనేం చేస్తాడో మాత్రం వెల్లడించింది. ఫరియా ప్రేమిస్తున్న వ్యక్తి ఇండస్ట్రీకి చెందిన వాడేనట. అతనొక కొరియోగ్రాఫరట. కొన్నేళ్లుగా ఫరియా అతడితో రిలేషన్‌షిప్‌లో ఉందట.
‘‘కొంత కాలంగా నా డ్యాన్స్, ర్యాప్‌లో మార్పు రావడానికి నా బాయ్‌ఫ్రెండే కారణం. అతను సినీ రంగానికి చెందిన వ్యక్తే. కొరియోగ్రఫీలో తన ప్రతిభతో ముందుకు వెళ్తున్నాడు. మేమిద్దరం కలిసి పని చేస్తూ ఒక టీంగా ముందుకు వెళ్తున్నాం. మాది కేవలం ప్రేమ బంధం మాత్రమే కాదు. జీవితానికి సంబంధించి బలమైన అనుబంధం. ఇండస్ట్రీలో ఉంటూ పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్‌ను బ్యాలెన్స్ చేసుకోవడం వెనుక నా బాయ్ ఫ్రెండ్ ప్రోత్సాహం ఎంతో ఉంది’’ అని ఫరియా తెలిపింది. తన ప్రియుడు కొరియోగ్రాఫర్ అని ఫరియా హింట్ ఇవ్వడంతో.. ఆ వ్యక్తి ఎవరా అని నెటిజన్లు తెగ చర్చించుకుంటున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates