టాలీవుడ్‌పై కోలీవుడ్ కన్ను

తెలుగు సినిమా మార్కెట్ ఇప్పుడు దేశవ్యాప్తంగా నంబర్ వన్ పొజిషన్‌లో ఉంది. వందల కోట్ల వసూళ్లు, మాస్ ఆడియన్స్ పల్స్ తెలిసిన హీరోలు ఉండటంతో తమిళ స్టార్ డైరెక్టర్లందరూ ఇప్పుడు టాలీవుడ్ వైపు క్యూ కడుతున్నారు. కేవలం డబ్బింగ్ సినిమాలతో సరిపెట్టుకోకుండా, నేరుగా మన హీరోలతో స్ట్రెయిట్ సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అట్లీ నుండి నెల్సన్ వరకు ప్రతి ఒక్కరూ మన స్టార్ హీరోల డేట్స్ కోసం వెయిట్ చేస్తుండటం విశేషం.

మెగాస్టార్ చిరంజీవి సంక్రాంతికి ‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమాతో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన జోష్ లో ఉండగా, యంగ్ హీరోలు మాత్రం కోలీవుడ్ మేకర్స్‌తో క్రేజీ కాంబోలు సెట్ చేసుకుంటున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈ విషయంలో అందరికంటే ముందున్నారు. అట్లీ దర్శకత్వంలో రాబోయే ప్రాజెక్ట్ ఇప్పటికే షూటింగ్ కొనసాగుతోంది. దీని తర్వాత లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో #AA23పై అఫీషియల్ క్లారిటీ వచ్చేసింది. రీసెంట్ గా రిలీజ్ చేసిన కార్టూన్ గ్లింప్స్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.

మరోవైపు గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ కూడా కోలీవుడ్ వైపు మొగ్గు చూపుతున్నారు. ‘జైలర్’ ఫేమ్ నెల్సన్ దిలీప్ కుమార్ తో తారక్ నెక్స్ట్ ప్రాజెక్ట్ దాదాపు కన్ఫర్మ్ అయ్యింది. ప్రస్తుతం కథా చర్చలు జరుగుతుండగా, త్వరలోనే అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చే అవకాశం ఉంది. నెల్సన్ మార్క్ డార్క్ కామెడీలో ఎన్టీఆర్ యాక్టింగ్ చూడాలని ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అలాగే పీరియడ్ యాక్షన్ సినిమాల స్పెషలిస్ట్ వెట్రిమారన్ కూడా రామ్ చరణ్ తో ఒక పవర్ ఫుల్ స్క్రిప్ట్ గురించి చర్చిస్తున్నారని సినీ వర్గాల్లో చర్చ జరుగుతుంది.

వీరితో పాటు ‘అమరన్’ సక్సెస్ తర్వాత రాజ్ కుమార్ పెరియసామి మన టాలీవుడ్ స్టార్ హీరోలను సంప్రదిస్తున్నారు. అలాగే ‘జై భీమ్’ ఫేమ్ టి.జె. జ్ఞానవేల్, నేచురల్ స్టార్ నానితో సినిమా చేయడానికి కథా చర్చల్లో ఉన్నారు. కథ ఫైనల్ అయితే నాని ఇమేజ్‌కు ఇది ఒక డిఫరెంట్ మలుపు అవుతుంది.

ఇలా ప్రతి ఒక్క తమిళ డైరెక్టర్ టాలీవుడ్ హీరోల ఇమేజ్, మార్కెట్ ను క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారు. ఏదేమైనా 2026లో టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద కోలీవుడ్ డైరెక్టర్ల హవా గట్టిగా కనిపించబోతోంది. అట్లీ మార్క్ మాస్ ఎలిమెంట్స్, లోకేష్ మార్క్ యూనివర్స్, నెల్సన్ మార్క్ కామెడీ.. ఇలా వెరైటీ జోనర్లతో మన హీరోలు గ్లోబల్ బాక్సాఫీస్ దగ్గర సందడి చేయడానికి రెడీ అవుతున్నారు.