మరో ‘జిగేలు రాణి’ వైబ్ లో పెద్ది

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ‘పెద్ది’ అనే పక్కా రూరల్ స్పోర్ట్స్ డ్రామా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా నుండి వచ్చిన ‘చికిరి చికిరి’ సాంగ్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. లేటెస్ట్ గా ఈ సినిమా గురించి ఒక ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఫిలిం నగర్ సర్కిల్స్‌లో వైరల్ అవుతోంది. అదేంటంటే, ఈ చిత్రంలో ఒక అదిరిపోయే ‘స్పెషల్ సాంగ్’ ఉండబోతోందని సమాచారం.

ఈ స్పెషల్ సాంగ్ కోసం చిత్ర యూనిట్ ఇప్పటికే ‘సీతారామం’ బ్యూటీ మృణాల్ ఠాకూర్‌ను సంప్రదించినట్లు టాక్ వినిపిస్తోంది. సుకుమార్ శిష్యుడైన బుచ్చిబాబు, తన గురువు ‘రంగస్థలం’లో ‘జిగేలు రాణి’తో క్రియేట్ చేసిన వైబ్స్‌ను మళ్ళీ ‘పెద్ది’లో రిపీట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఈ సాంగ్ కోసం ఏఆర్ రెహమాన్ ఇప్పటికే ఒక హుషారైన మాస్ ట్యూన్‌ను సిద్ధం చేసినట్లు సమాచారం.

మృణాల్ ఠాకూర్ ఇప్పటివరకు ఎక్కువగా క్లాస్ పాత్రల్లోనే కనిపించింది. కానీ ఈ స్పెషల్ సాంగ్ కోసం ఆమెను మేకర్స్ అడిగినట్లు వార్తలు వస్తున్నాయి. ఒకవేళ ఇది నిజమైతే, చరణ్ మాస్ స్టెప్పులకు తోడు మృణాల్ గ్లామర్ తోడైతే థియేటర్లు దద్దరిల్లడం ఖాయం. రంగస్థలంలో పూజా హెగ్డే ఎలాగైతే సర్ప్రైజ్ ఇచ్చిందో, ఇప్పుడు పెద్దిలో మృణాల్ కూడా అదే రేంజ్‌లో సందడి చేయబోతున్నట్లు తెలుస్తోంది.

ఈ స్పెషల్ సాంగ్ కోసం మేకర్స్ భారీ ఎత్తున సెట్ వేయబోతున్నారని, మృణాల్‌కు కూడా భారీ రెమ్యూనరేషన్ ఆఫర్ చేసినట్లు టాక్. అయితే దీనిపై ఇంకా అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది. ఇప్పటివరకు శ్రీలీల, సమంత పేర్లు వినిపించినప్పటికీ, ప్రస్తుతానికి మృణాల్ పేరు గట్టిగా వినిపిస్తోంది. బుచ్చిబాబు తన సెకండ్ మూవీతోనే మాస్ ఆడియన్స్‌ను మెప్పించడానికి అన్నీ విధాలుగా సిద్ధం చేసుకుంటున్నారు. మార్చి 27న చరణ్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమా థియేటర్లలోకి రాబోతోంది.