కోలీవుడ్ సీనియర్ డైరెక్టర్ సుందర్ సి ఈమధ్య కాలంలో కమర్షియల్ గా మంచి ట్రాక్ లో వెళుతున్నాడు. గతేడాది కమల్ హాసన్ నిర్మాణంలో రజినీకాంత్ 173వ సినిమాను అఫీషియల్ గా ఎనౌన్స్ చేసినప్పటికీ ఎందుకో మళ్ళీ వెనక్కి తగ్గారు. రజినీ సినిమా క్యాన్సిల్ అవ్వడంతో ఆయన కెరీర్ స్లో అవుతుందని అందరూ అనుకున్నారు, కానీ సీన్ రివర్స్ అయ్యింది.
ప్రస్తుతం సుందర్ సి చేతిలో క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. నయనతార లీడ్ రోల్ చేస్తున్న ‘మూకుత్తి అమ్మన్ 2’ (అమ్మోరు తల్లి సీక్వెల్) రిలీజ్‌కు రెడీ అవుతోంది. నయనతారను మళ్ళీ దేవతగా చూపిస్తూ సుందర్ సి తీసిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. దీంతో పాటు విశాల్‌తో ‘పురుషన్’ అనే పక్కా మాస్ అండ్ కామెడీ ఎంటర్టైనర్‌ను అనౌన్స్ చేసి టీజర్ కూడా వదిలారు. విశాల్ సుందర్ సి కాంబో అంటే మినిమం గ్యారెంటీ ఉండటంతో బిజినెస్ వర్గాల్లో దీనిపై మంచి బజ్ ఉంది.
మరోవైపు సుందర్ సి ఇప్పుడు స్టార్ హీరో కార్తీతో ఒక భారీ ప్రాజెక్టును పట్టాలెక్కించే ప్లాన్‌లో ఉన్నారు. ఇప్పటికే కార్తీకి కథ వినిపించడం, ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం కూడా జరిగిపోయాయి. ఈ ఏడాది చివర్లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. అలాగే తన సక్సెస్ ఫుల్ హారర్ ఫ్రాంచైజీ ‘అరన్మనై 5’ కి కూడా గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు. ఇందులో అతనే హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించబోతున్నారు, ఇది బహుశా 2027లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.
రజినీకాంత్ సినిమా చేజారినప్పటికీ, సుందర్ సి ఏమాత్రం గ్యాప్ లేకుండా వరుసగా సినిమాలను లైన్ లో పెడుతుండటం విశేషం. ఒకవైపు నయనతార వంటి స్టార్ హీరోయిన్‌తో సోషియో ఫాంటసీ, మరోవైపు విశాల్, కార్తీలతో కమర్షియల్ యాక్షన్ సినిమాలు చేస్తూ తన రేంజ్‌ను మళ్ళీ ప్రూవ్ చేసుకుంటున్నారు. గతంలో ‘మద గజ రాజు’ సక్సెస్ కూడా ఆయనకు మంచి బూస్ట్ ఇచ్చింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates