మార్చి 27 విడుదలని ముందు నుంచి చెప్పుకుంటూ వచ్చిన పెద్ది ఖచ్చితంగా వాయిదా పడుతుందనే రీతిలో సోషల్ మీడియాలో ఒక వర్గం చేస్తున్న హడవిడి చూసి మెగా ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. రామ్ చరణ్ పుట్టినరోజుకు బ్లాక్ బస్టర్ పడుతుందనే టైంలో ఇలాంటి ప్రచారాలు జరగడం ఆందోళన కలిగిస్తాయి.
కొందరు ఏకంగా ఒక అడుగు ముందుకేసి మే 1 అంటూ కొత్త డేట్ చెప్పేస్తున్నారు. నిజానికి బుచ్చిబాబుకి ప్రస్తుతం అలాంటి ఆలోచనేదీ లేదట. అనుకున్న టైంకే రిలీజ్ చేయడానికి సరిపడా ప్లానింగ్ తన దగ్గర ఉందట. కాకపోతే ఇతరత్రా అంశాల గురించి యూనిట్ లో చర్చ జరుగుతున్న మాట వాస్తవమే.
వాటిలో ప్రధానమైంది, కేవలం వారం ముందు మార్చి 19 రిలీజయ్యే దురంధర్ 2, టాక్సిక్ ప్రభావం పెద్ది మీద ఏ స్థాయిలో ఉండొచ్చనే దాని మీద రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఉత్తరాది రాష్ట్రాల్లో ఈ రెండు సినిమాలకు భారీ డిమాండ్ ఉంది. బడా డిస్ట్రిబ్యూటర్లు ఆల్రెడీ రంగంలోకి దిగి థియేటర్లను బ్లాక్ చేసే పనిలో పడ్డారు.
పుష్ప 2 పంపిణి చేసింది అనిల్ తదాని. ఆ బాండింగ్ తో ఇప్పుడు పెద్ది చేయడానికి ముందుకు వచ్చినా టాక్సిక్ కూడా ఆయన చేతికే వెళ్లే క్రమంలో స్క్రీన్ల పంపకాలు ఇబ్బందిగా మారతాయి. పైగా దురంధర్ 2 డిమాండ్, హైప్ ని మ్యాచ్ చేయడం పెద్దికి అనుకున్నంత ఈజీగా ఉండదు.
ఇవన్నీ డిస్కషన్ స్టేజిలో ఉన్నాయి తప్పించి ఇప్పటికిప్పుడు పెద్ది మనసు అయితే మారలేదు. రామ్ చరణ్ సైతం దీన్ని త్వరగా పూర్తి చేయాలనే సంకల్పంతోనే ఉన్నాడు. ఎందుకంటే సుకుమార్ స్క్రిప్ట్ తాలూకు పనులు పూర్తి కావొస్తున్నాయి. సెట్స్ పైకి వెళ్లే ముహూర్తం ఇంకా నిర్ణయించలేదు కానీ ఈ వేసవిలోపే ఆ లాంఛనం ఉంటుంది.
ఎందుకంటే సుకుమార్ ఆ తర్వాత పుష్ప 3, ప్రభాస్ ప్యాన్ ఇండియా మూవీలకు కమిట్ మెంట్ ఇవ్వొచ్చనే ప్రచారం నేపథ్యంలో ఆర్సి 17కి ఏడాది కంటే ఎక్కువ సమయం కేటాయించకపోవచ్చు. ముందైతే పెద్ది మీద జరుగుతున్న ప్రచారాలకు బుచ్చిబాబు త్వరగా క్లారిటీ ఇస్తే మంచిది.
Gulte Telugu Telugu Political and Movie News Updates