శర్వా సంక్రాంతులు… ఏడాదిలో 4 సినిమాలు

నారి నారి నడుమ మురారి సక్సెస్ ని ఆస్వాదిస్తున్న శర్వానంద్ ముందులాగా గ్యాప్ ఇవ్వకూడదని డిసైడ్ అయ్యాడు. ప్రేక్షకులకు కంటిన్యూగా సినిమాలు ఇవ్వాలనే ప్లానింగ్ తో ఇకపై షూటింగుల్లోనే గడపాలని నిర్ణయించుకున్నాడు. దానికి తగ్గట్టే లైనప్ కనిపిస్తోంది. 2026 సంక్రాంతి నుంచి 2027 సంక్రాంతి వరకు మొత్తం సంవత్సర కాలంలో నాలుగు సినిమాలతో థియేటర్లలో అడుగు పెట్టబోతున్నాడు.

నారి నారి నడుమ మురారి తర్వాత బైకర్ రెడీ అవుతోంది. తండ్రి కొడుకులుగా శర్వా డ్యూయల్ రోల్ చేసిన ఈ స్పోర్ట్స్ డ్రామాలో రాజశేఖర్ కీలక పాత్ర పోషించారు. మార్చి లేదా ఏప్రిల్ గ్రాండ్ రిలీజ్ కు రెడీ చేస్తున్నారు.

సంపత్ నంది దర్శకత్వంలో రూపొందుతున్న భోగికి బ్రేక్ ఇచ్చి ఈ నెలలోనే రీ స్టార్ట్ చేయబోతున్నారు. ఇది పీరియాడిక్ డ్రామా తరహాలో సాగే యాక్షన్ థ్రిల్లర్. కమర్షియల్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉంటాయట. ఇంట్రో టీజర్ తోనే దీని మీద అంచనాలు ఏర్పడ్డాయి. శర్వానంద్ గతంలో చేయని మాస్ లుక్ తో ఇందులో దర్శనమివ్వబోతున్నాడు. దసరా లేదా దీపావళికి రావొచ్చు.

మైత్రి మూవీ మేకర్స్ సంస్థ శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందే ఎంటర్ టైనర్ వచ్చే సంక్రాంతికి రిలీజవుతుందని శర్వా ఆల్రెడీ పబ్లిక్ స్టేజి మీద చెప్పేశాడు. ఇది పూర్తిగా వైట్ల స్టైల్ లో నవ్వించే జానర్ లో ఉంటుంది. అంటే పండగ సీజన్ కి సూటయ్యే కంటెంట్ అన్నమాట.

సో మొత్తం నాలుగు సినిమాలు రావడమంటే చిన్న విషయం కాదు. శర్వా నుంచి మిస్సవుతోంది ఈ స్పీడే. జాను, రణరంగం, పడి పడి లేచే మనసు, శ్రీకారం లాంటివి వరసగా ఫ్లాప్ అయినప్పుడు ఫ్యాన్స్ బాగా ఫీలయ్యారు. జానర్లు మారుస్తున్నా సరే ఫలితం ఒకేలా రావడంతో శర్వా బ్రేక్ తీసుకున్నాడు.

ఒకే ఒక జీవితం ఊరట కలిగించినా మనమే రిజల్ట్ మళ్ళీ నిరాశ పరిచింది. ఇప్పుడు నారి నారి నడుమ మురారి ఇచ్చిన ఉత్సాహంతో నాన్ స్టాప్ గా రాబోతున్నాడు. అన్నట్టు మీడియం రేంజ్ హీరోల్లో పన్నెండు నెలల కాలంలో నాలుగు సినిమాలు ఇవ్వబోతున్న ఒకే ఒక్క హీరో శర్వానందే. దీంట్లో డౌట్ అక్కర్లేదు.