జనవరిలో సంక్రాంతి సినిమాల హడావిడి తర్వాత చెప్పుకోదగ్గ రిలీజులు లేకపోవడంతో నెలాఖరు వరకు జనాలకు ఇతర ఆప్షన్లు పెద్దగా లేవు. చివరి వారంలో తరుణ్ భాస్కర్ హీరోగా నటించిన ఓం శాంతి శాంతి శాంతి తప్ప వేరే నోటెడ్ మూవీస్ లేవు. అందుకే ఇప్పుడు ఫిబ్రవరి మీద అందరి దృష్టి వెళ్తోంది.
వాటిలో చెప్పుకోదగినది విశ్వక్ సేన్ ఫంకీ. సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ మీద అనుదీప్ దర్శకత్వంలో రూపొందిన ఈ ఎంటర్ టైనర్ లో కయదు లోహర్ హీరోయిన్ గా నటించింది. ఫిబ్రవరి 13 రిలీజ్ ఉందంటూ ఇటీవలే పోస్టర్ ఒకటి ఆన్ లైన్ లో వదిలారు. సో వాయిదా ప్రసక్తే లేదు.
విశ్వక్ సేన్ కు ఫంకీ చాలా కీలకం. ఎందుకంటే గత ఏడాది సరిగ్గా ఇదే సమయంలో లైలా చేసినందుకు తీవ్ర విమర్శలు ఎదురుకున్నాడు. కామెడీ పేరుతో ఒక పిచ్చి కంటెంట్ వదిలారని క్రిటిక్స్ గట్టిగా తలంటారు. ఆడియన్స్ రిజక్ట్ చేశారు. దీంతో బయట కనిపించడం కూడా మానేసి విశ్వక్ పూర్తిగా ఫంకీకే అంకింతమైపోయాడు.
సౌండ్ చేయకుండా లెగసి అనే మరో పొలిటికల్ థ్రిల్లర్ స్టార్ట్ చేసి దాన్ని కూడా సగానికి పైగా పూర్తి చేశాడు. ఏదైనా సరే సక్సెస్ కొట్టిన తర్వాతే బయటికి రావాలని డిసైడ్ అయిన విశ్వక్ దానికి తగ్గట్టే బ్యాక్ గ్రౌండ్ లో ఉంటూ వచ్చాడు. ఇప్పుడు విడుదల టైం వచ్చేసింది.
దర్శకుడు అనుదీప్ జాతిరత్నాలుతో సెన్సేషన్ సృష్టించాక శివ కార్తికేయన్ తో చేసిన ప్రిన్స్ చేదు ఫలితాన్ని ఇచ్చింది. ఆ తర్వాత రవితేజతో సినిమా ఓకే అనుకున్న స్టేజి దగ్గర చేజారింది. అదే కథనే విశ్వక్ సేన్ తో ఫంకీగా తీశాడని ఇన్ సైడ్ టాక్.
ఇండస్ట్రీ బ్యాక్ డ్రాప్ లో నిజ జీవిత దర్శకుడిగా విశ్వక్ సేన్ నటిస్తున్న ఈ మూవీ మొత్తం ఫన్ జోన్ లోనే ఉంటుందట. అయితే రిలీజ్ కు కేవలం పాతిక రోజులు కూడా లేని నేపథ్యంలో పబ్లిసిటీ వేగాన్ని పెంచాలి. మరుసటి రోజు యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకత్వం వహించిన సీత పయనం, సంతోష్ శోభన్ కపుల్ ఫ్రెండ్లీ రిలీజవుతున్నాయి. సో ఫంకీ త్వరగా క్రాంకీ మూడ్ లోకి వచ్చేయాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates