Movie News

బాల‌య్య ప‌రువు నిల‌బెట్టిన మురారి

ఒక సినిమా టైటిల్‌ను ప‌దేళ్ల త‌ర్వాత ఇంకో చిత్రం కోసం వాడుకునే సౌల‌భ్యం ఉంటుంది. కాబ‌ట్టే ఆక‌ర్ష‌ణీయ‌మైన పేర్ల‌ను రిపీట్ చేస్తుంటారు. కానీ సినీ చ‌రిత్ర‌లో చిర స్థాయిగా నిలిచిపోయిన చిత్రాల‌ టైటిళ్ల‌ను మ‌ళ్లీ వాడాలంటే కొంచెం ముందు వెనుక ఆలోచించాల్సి ఉంటుంది. ఆ టైటిళ్ల‌కు న్యాయం చేసేలా సినిమా లేక‌పోతే.. ప్రేక్ష‌కులు నిరాశ చెందుతారు. ఐకానిక్ టైటిళ్ల‌ను చెడ‌గొట్టిన‌ట్లు అవుతుంది.

మాయాబ‌జార్, మ‌రో చ‌రిత్ర స‌హా ఎన్నో లెజెండ‌రీ సినిమాల టైటిళ్లు ఇలాగే వృథా అయ్యాయి. ఐతే మిస్స‌మ్మ‌, తొలి ప్రేమ లాంటి కొన్ని టైటిళ్ల‌కు మాత్రం న్యాయం జ‌రిగింది. ఇప్పుడు ఈ కోవ‌లోకే చేరింది నారీ నారీ న‌డుమ మురారి టైటిల్. నంద‌మూరి బాల‌కృష్ణ కెరీర్లో ప్ర‌త్యేకంగా చెప్పుకోద‌గ్గ చిత్రాల్లో నారీ నారీ న‌డుమ మురారి ఒక‌టి.

ఎక్కువ‌గా మాస్ మ‌సాలా సినిమాలు చేసిన బాల‌య్య‌కు.. ఈ ఫ్యామిలీ ఎంట‌ర్టైన‌ర్ డిఫ‌రెంట్ మూవీగా నిలిచింది. ఈ సినిమాలో పాట‌లు కూడా విజ‌య‌వంతం అయ్యాయి. ఇప్పుడు ఈ టైటిల్‌నే శ‌ర్వానంద్ సినిమాకు వాడుకున్నారు.

సంక్రాంతి కానుక‌గా విడుద‌లైన కొత్త నారీ నారీ న‌డుమ మురారి ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంది. పెద్ద‌గా ప‌బ్లిసిటీ లేకుండా, రేసులో లేటుగా వ‌చ్చిన ఈ చిత్రం మంచి టాక్ తెచ్చుకుని సూప‌ర్ హిట్ దిశ‌గా దూసుకెళ్తోంది. త‌క్కువ థియేట‌ర్ల‌లోనే మంచి వ‌సూళ్లు సాధిస్తోంది. శ‌ర్వాకు చాన్నాళ్ల త‌ర్వాత ద‌క్కిన విజ‌య‌మిది. సంక్రాంతి సీజ‌న్లో అత‌ను హ్యాట్రిక్ కూడా కొట్టేశాడు. దీనికి యాప్ట్ టైటిల్ పెట్టార‌ని సినిమా చూసిన వారికి అర్థ‌మ‌వుతుంది.

ఈ సినిమా విజ‌య‌వంత‌మైన నేప‌థ్యంలో బాల‌య్య కూడా త‌న ఆనందాన్ని వ్య‌క్తం చేశాడ‌ట‌. బాల‌య్య త‌న‌కు ఫోన్ చేసి.. నా పరువు నిల‌బెట్టావు శ‌ర్వా అని చెప్పిన‌ట్లు శ‌ర్వా నారీ నారీ న‌డుమ మురారి పోస్ట్ రిలీజ్ ప్ర‌మోష‌న్ల‌లో వెల్ల‌డించాడు.

ప‌దేళ్ల త‌ర్వాత ఏ టైటిలైనా వాడుకునే సౌల‌భ్యం ఉన్న‌ప్ప‌టికీ.. బాల‌య్య చిత్రం పేరును ఉప‌యోగించుకోవ‌డానికి శ‌ర్వా ఆయ‌న అనుమ‌తి కోర‌డం విశేషం. అందుకు బాల‌య్య సంతోషంగా ఒప్పుకున్న విషయాన్ని కూడా శ‌ర్వా ఇంత‌కుముందు వెల్ల‌డించాడు. రామ్ అబ్బ‌రాజు ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన నారీ నారీ న‌డుమ మురారిలో శ‌ర్వా స‌ర‌స‌న సంయుక్త‌, సాక్షి వైద్య న‌టించారు.

This post was last modified on January 21, 2026 7:09 am

Share

Recent Posts

ఆరు రోజుల్లో అంచనాలు పెంచేయాలి

కేవలం ఆరు రోజుల్లో టాక్సిక్ విడుదల కానుంది. ఇప్పటిదాకా ఉన్న బజ్ చూసుకుంటే కెజిఎఫ్, పుష్పలాంటి బ్లాక్ బస్టర్స్ ని…

33 minutes ago

అనిరుధ్‌‌కు పిచ్చెక్కించే ఆంధ్రా మీల్స్‌

అనిరుధ్ రవిచందర్‌ పేరుకు తమిళ సంగీత దర్శకుడే కానీ.. అతడికి తెలుగు ప్రేక్షకుల్లో ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు.…

2 hours ago

అన్నయ్య సెట్లయ్యాడు… తమ్ముడు హిట్టివ్వాలి

గత పదేళ్లలో గట్టిగా చెప్పుకునే ఒక్క బ్లాక్ బస్టర్ లేక అయితే యావరేజ్ లేదా డిజాస్టర్ తో నెట్టుకుంటూ వస్తున్న…

2 hours ago

బాబు, లోకేశ్ ల మైండ్ లో చిప్ ఉందా?: జగన్

శాసనసభ వర్షాకాల సమావేశాల సందర్భంగా మెగా డీఎస్సీలో అవకతవకలంటూ వైసీపీ చేస్తున్న ఆరోపణలపై శాసనమండలిలో వాడీవేడీ చర్చ జరుగుతున్న సంగతి…

3 hours ago

సేవకు గుర్తింపు.. క్యాడర్ ఖుషీ

తెలుగుదేశం పార్టీలో క్షేత్రస్థాయిలో కష్టపడి పనిచేసే వారికి గుర్తింపు ఉంటుందని మరోసారి రుజువైంది. గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీ పదవులకు దళవాయి…

4 hours ago

తెలుగు సినిమాను గిల్లుతున్న షారుఖ్ డైరెక్టర్

‘బాహుబలి’ దగ్గర్నుంచి ఉత్తరాదిన తెలుగు సినిమాల ఆధిపత్యం ఎలా సాగుతోందో చూస్తూనే ఉన్నాం. ‘బాహుబలి’ని తక్కువ అంచనా వేసిన బాలీవుడ్…

5 hours ago