నారి నారి నడుమ మురారి సక్సెస్ తో మంచి జోష్ లో ఉన్న శర్వానంద్ మరోసారి సంక్రాంతి సెంటిమెంట్ తనకు వర్కౌటయినందుకు చాలా హ్యాపీగా ఉన్నాడు. అందులోనూ ఈసారి మన శంకరవరప్రసాద్ గారు లాంటి బ్లాక్ బస్టర్, అనగనగా ఒక రాజు లాంటి సూపర్ హిట్ ఎదురుగా పెట్టుకుని మరీ హిట్టు కొట్టడం మాములు విషయం కాదు.
చాలా ఏరియాల్లో భర్త మహాశయులకు విజ్ఞప్తిని డామినేట్ చేసేలా హౌస్ ఫుల్స్ పెట్టడమంటే శర్వా ఘనతని చిన్నదిగా చూడలేం. టికెట్ రేట్లు పెంచకుండా ఏపీ తెలంగాణలో మాములు ధరలు ఫాలో అయిన ఒకే ఒక్క సినిమా నారి నారి నడుమ మురారి. దీని సంగతలా ఉంచి ఇక అసలు విషయానికి వద్దాం.
శర్వానంద్ నెక్స్ట్ సినిమా బైకర్ విడుదలకు రెడీగా ఉంది, బైక్ రేసింగ్ నేపథ్యంలో అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ స్పోర్ట్ థ్రిల్లర్ లో యాంగ్రీ మ్యాన్ రాజశేఖర్ కీలక పాత్ర పోషించారు. అయితే ఇందులో శర్వానంద్ డ్యూయల్ రోల్స్ చేశాడు. ఈ విషయం తాజాగా శర్వానే పంచుకున్నాడు.
తండ్రి కొడుకులుగా రెండు టైం ఫ్రేమ్స్ లో డిఫరెంట్ లుక్స్ లో కనిపిస్తాడని ఇన్ సైడ్ టాక్. ఎమోషనల్ గా ఈ ట్రాక్ చాలా పవర్ ఫుల్ గా ఉంటుందట. ఏ రేంజ్ అనేది ట్రైలర్ వస్తే కానీ చెప్పలేం కానీ శర్వా కెరీర్ లో బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇదే అవుతుందని అంటున్నారు. ఎలా అంటే నాని జెర్సీ రేంజ్ లో ఊరిస్తున్నారు.
రిలీజ్ డేట్ విషయంలో యువి క్రియేషన్స్ మల్లగుల్లాలు పడుతోంది. ఒకవేళ మార్చి 27 పెద్ది రాని పక్షంలో ఆ స్లాట్ ని తీసుకునేందుకు బైకర్ ని సిద్ధం చేస్తున్నట్టు వినికిడి. ఎలాగూ ప్యారడైజ్ వచ్చే అవకాశాలు పూర్తిగా సన్నగిల్లాయి. మార్చి 19 దురంధర్ 2, టాక్సిక్, డెకాయిట్ ఉన్నప్పటికీ పెద్ది మిస్ అయితే మాత్రం ఆ అవకాశం బైకర్ అందుకోవచ్చని ఒక టాక్.
ఇప్పటికి ఇదంతా చర్చల దశలోనే ఉంది. నారి నారి నడుమ మురారి ఫైనల్ రన్ పూర్తయ్యాక బైకర్ కు సంబంధించి అప్డేట్స్, ప్రమోషన్స్ మొదలుపెడతారు. ఐమాక్స్, 3డి, 4డిఎక్స్ తదితర స్పెషల్ వెర్షన్లలో బైకర్ సిద్ధం చేయనుండటం గమనార్షం.
Gulte Telugu Telugu Political and Movie News Updates
