ఒకప్పుడు టాలీవుడ్లో మెగాస్టార్ చిరంజీవి నంబర్ వన్ హీరో. సినిమాల బడ్జెట్, బిజినెస్, కలెక్షన్లు, పారితోషకాలు.. ఇలా ఏది చూసుకున్నా చిరు తరచుగా రికార్డులు కొల్లగొట్టేవారు. వేరే స్టార్ల హిట్ సినిమాలకు సమానంగా చిరు ఫ్లాప్ చిత్రాల వసూళ్లు ఉండేవి. ఆయన సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చిందంటే కొత్త రికార్డులు నమోదు కావాల్సిందే అన్నట్లుండేది.
కానీ చిరు మధ్యలో పదేళ్ల బ్రేక్ తీసుకుని తిరిగి వచ్చేసరికి వేరే స్టార్లు చాలామంది ఆయన్ని దాటి ముందుకు వెళ్లిపోయారు. వాళ్ల మార్కెట్ చాలా పెద్ద స్థాయికి వెళ్లిపోయింది. అయినా సరే రీఎంట్రీలో ‘ఖైదీ నంబర్ 150’తో భారీ విజయాన్నందుకుని తన పునరాగమనాన్ని ఘనంగా చాటాడు మెగాస్టార్.
కానీ ఆ తర్వాత మాత్రం చిరు కెరీర్ ఆశించినట్లుగా ముందుకు సాగలేదు. దీంతో ఈ తరం ప్రేక్షకుల్లో చాలామంది చిరు గురించి తేలిగ్గా మాట్లాడ్డం మొదలుపెట్టారు. ఆచార్య, భోళా శంకర్ లాంటి సినిమాల ఫలితాలు యాంటీ ఫ్యాన్స్‌కు పెద్ద ఆయుధాలను ఇచ్చాయి.
కానీ చిరు అసలు బాక్సాఫీస్ స్టామినా ఏంటో ‘మన శంకర వరప్రసాద్ గారు’ రుజువు చేస్తోంది. అనిల్ రావిపూడి లాంటి ఫ్యామిలీస్‌లో మంచి ఫాలోయింగ్ ఉన్న దర్శకుడు తోడవడంతో చిరు బాక్సాఫీస్ దగ్గర అద్భుతాలు చేస్తున్నారు. ఆరంభం నుంచి ఈ సినిమా వసూళ్ల మోత మోగిస్తూ దూసుకెళ్తోంది.
రిలీజైన నాలుగో రోజు తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా ‘ఆర్ఆర్ఆర్’ లాంటి మెగా మూవీ నెలకొల్పిన రికార్డును చిరు చిత్రం బద్దలు కొట్టడం విశేషం. తాజాగా మరో ఘనతను ఈ సినిమా సొంతం చేసుకుంది. ఏడో రోజు ఏపీ, తెలంగాణల్లో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా అల్లు అర్జున్ మూవీ ‘అల వైకుంఠపురములో’ నెలకొల్పిన రికార్డును ‘మన శంకర వరప్రసాద్ అధిగమించింది.
బన్నీ మూవీ ఏడో రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ.8.6 కోట్లు కొల్లగొడితే.. చిరు చిత్రం రూ.9.5 కోట్ల దాకా కలెక్షన్లు రాబట్టింది. ప్రస్తుతం ‘మన శంకర వరప్రసాద్ గారు’ ఓవరాల్ వసూళ్లు రూ.300 కోట్లకు చేరువగా ఉన్నాయి.
This post was last modified on January 19, 2026 9:39 pm
ప్రపంచవ్యాప్తంగా ధనవంతులు మరింత ధనవంతులుగా మారుతున్నారు. చరిత్రలో తొలిసారిగా ప్రపంచ బిలియనీర్ల సంఖ్య 3,000 మార్క్‌ను దాటేసింది. ఆశ్చర్యకరమైన విషయం…
కెరీర్ ఆరంభంలో చిన్న సినిమాలు చేసి మంచి పేరు సంపాదించిన మారుతి… ఆ తర్వాత మిడ్ రేంజ్ చిత్రాలకు ఎదిగాడు.…
సినిమాలు సమాజం మీద ఎంతగా ప్రభావం చూపుతాయో ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఆ ప్రభావం మంచిగానూ ఉండొచ్చు. అలాగే చెడుగానూ…
ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి, బీఆర్ఎస్ కీలక నేత హరీశ్ రావు నేడు సిట్ విచారణకు హాజరైన సంగతి…
సౌత్ ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే బిగ్గెస్ట్ సూపర్ స్టార్లలో ఒకడైన రజినీకాంత్‌తో సినిమా చేయాలని ప్రతి దర్శకుడూ ఆశిస్తాడు. ఒకసారి…
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి హరీశ్ రావు ఈ రోజు సిట్ విచారణకు హాజరైన సంగతి…