మెగా అభిమానులు కొన్నేళ్ల నుంచి అంత సంతృప్తిగా లేరు. చిరు నుంచి ‘భోళా శంకర్’ లాంటి భారీ డిజాస్టర్ వచ్చింది. రామ్ చరణ్ ‘గేమ్ చేంజర్’ ఎలాంటి ఫలితాన్నిందుకుందో తెలిసిందే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘బ్రో’తో నిరాశపరిచి.. ‘హరి హర వీరమల్లు’తో ఇంకా పెద్ద షాకిచ్చాడు. మరోవైపు వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్‌ల కెరీర్లు కూడా అంత గొప్పగా లేవు. గత ఏడాది ‘హరిహర వీరమల్లు’ రిలీజ్ టైంకి మెగా ఫ్యాన్స్ పూర్తిగా డీలా పడిపోయారు.
ఐతే పవన్ నుంచి వచ్చిన ‘ఓజీ’ సినిమా వారికి గొప్ప ఉపశమనాన్ని అందించింది. ఆ సినిమాలో వింటేజ్ పవన్ విశ్వరూపాన్ని చూసి మురిసిపోయారు అభిమానులు. ఇక వర్తమానంలోకి వస్తే మెగాస్టార్ చిరంజీవి ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రంతో వారి ఆనందాన్ని రెట్టింపు చేశాడు. చిరు బాక్సాఫీస్ స్టామినా ఎలాంటిదో ఈ తరం ప్రేక్షకులకు ఈ చిత్రం చాటిచెబుతోంది. ఇందులో వింటేజ్ చిరును చూసి మెగా ఫ్యాన్స్ అమితానందానికి, తీవ్ర భావోద్వేగానికి గురవుతున్నారు.
కొత్త ఏడాదిలో మెగా ఫ్యామిలీకి ‘మన శంకర వరప్రసాద్ గారు’ అదిరే ఆరంభాన్నిచ్చింది. ఈ ఉత్సాహం ఏడాదంతా కొనసాగుతుందనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ ఏడాది మెగా హీరోల ట్రీట్ మామూలుగా ఉండబోదని వాళ్లు చేస్తున్న సినిమాలను బట్టి అర్థమవుతోంది. వేసవి ఆరంభంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమా ‘పెద్ది’ విడుదల కాబోతోంది. దానిపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఒక్క ‘చికిరి’ పాటే ఈ సినిమాకు కావాల్సినంత హైప్ తెచ్చేసింది. ఆ సినిమా స్యూర్ షాట్ బ్లాక్ బస్టర్ అన్నది ఇండస్ట్రీ వర్గాల మాట.
ఆ చిత్రం తర్వాత తక్కువ గ్యాప్‌లోనే పవన్ కళ్యాణ్ సినిమా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రాబోతోంది. అది పవన్ ఫ్యాన్ బాయ్ అయిన హరీష్ శంకర్.. తన ఫేవరెట్ హీరోతో ‘గబ్బర్ సింగ్’ తర్వాత తీస్తున్న చిత్రం. అది కూడా పెద్ద హిట్టవుతుందనే అంచనాలున్నాయి. వేసవిలోనే చిరు మరో చిత్రం ‘విశ్వంభర’ కూడా రాబోతోంది. టీజర్‌కు నెగెటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చిన నేపథ్యంలో చాలా జాగ్రత్తగా సినిమాకు మెరుగులు దిద్దుతోంది చిత్ర బృందం.
ఇప్పటికే ఓజీ, మన శంకర వరప్రసాద్ గారు చిత్రాలు సాధించిన విజయాలతో ఉత్సాహంలో ఉన్న మెగా అభిమానులు,. చిరు, పవన్, చరణ్ త్రయం నుంచి రాబోయే భారీ చిత్రాలతో ఉక్కిరి బిక్కిరి అయిపోవడం ఖాయం. ఇవి కాక తేజు కొత్త సినిమా ‘సంబరాల యేటి గట్టు’, వరుణ్ తేజ్ తర్వాతి చిత్రం ‘కొరియన్ కనకరాజు’ కూడా ప్రామిసింగ్‌గానే కనిపిస్తున్నాయి. కాబట్టి 2026 మెగా అభిమానులకు భారీ ట్రీట్ ఇవ్వబోతున్నట్లే.
Gulte Telugu Telugu Political and Movie News Updates
