Movie News

లెజెండరీ దర్శకుడికి… నిర్మాతలు లేరా?

తెలుగులో ఎందరో స్టార్, లెజెండరీ డైరెక్టర్లు ఉన్నారు. వాళ్లందరిలో క్రియేటివ్ డైరెక్టర్ అని ట్యాగ్ తెచ్చుకున్నది మాత్రం ఒక్క కృష్ణవంశీ. రామ్ గోపాల్ వర్మ శిష్యరికంలో రాటుదేలి.. తొలి చిత్రం గులాబీతోనే గురువుకు తగ్గ శిష్యుడు అనిపించుకున్న కృష్ణవంశీ.. తర్వాత నిన్నే పెళ్లాడతా, సింధూరం, ఖడ్గం, మురారి, చందమామ లాంటి కల్ట్ మూవీస్ అందించి తెలుగు సినీ చరిత్రలో దర్శకుడిగా తనకో ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించుకున్నాడు.

ఐతే ఎంత గొప్ప దర్శకుడైన ఏదో ఒక దశలో వరుస ఫ్లాపులు ఎదుర్కోవడం, కెరీర్లో డౌన్ అవ్వడం మామూలే. కృష్ణవంశీ కూడా అందుకు మినహాయింపు కాలేక పోయాడు. మొగుడు, నక్షత్రం, రంగమార్తాండ లాంటి ఫెయిల్యూర్లు ఆయన్ని వెనక్కి లాగేశాయి. రంగమార్తాండకు ముందు ఆయనకు చాలా గ్యాప్ వచ్చింది. ఆ సినిమా తర్వాత గ్యాప్ మరింత పెరిగింది. తన కొత్త సినిమాను ఎంతకీ ప్రకటించడం లేదు. 

ఐతే నిర్మాతలు లేకే కొత్త సినిమా తీయట్లేదని కృష్ణవంశీ ఎప్పటికప్పుడు ఎక్స్ వేదికగా సంకేతాలు ఇస్తూనే ఉంటాడు. తాజాగా మరోసారి తాను ఎదుర్కొంటున్న ఇబ్బందిని ఆయన మరోసారి బయట పెట్టారు. ఒక నెటిజన్ ఒక భారీ కథను నరేట్ చేసే అవకాశం ఇవ్వాలని కృష్ణవంశీని ఎక్స్ ద్వారా కోరాడు.

ఆ కథ కృష్ణవంశీ బలానికి తగ్గ కథ అని, కచ్చితంగా వర్కౌట్ అవుతుందని అన్నాడు. దానికి ఈ లెజెండరీ బదులిస్తూ.. మరి నిర్మాతల మాటేంటి అని ప్రశ్నించాడు. మొగుడు మూవీ పెద్ద డిజాస్టర్ అయిన దగ్గర్నుంచి ప్రతి సినిమాకు నిర్మాతల విషయంలో ఇబ్బంది ఎదుర్కొంటూనే ఉన్నాడు కృష్ణవంశీ.

ఆయన చివరి చిత్రం  రంగమర్తాండ కూడా మేకింగ్, రిలీజ్ విషయంలో ఇబ్బంది ఎదుర్కొంది. ఆ చిత్రాన్ని ఎవరైనా సోషల్ మీడియాలో కొనియాడినా.. అది సరిగా ఆడలేదని, కాస్ట్ ఫెయిల్యూర్ అని ఓపెన్ గానే చెబుతుంటాడు కృష్ణవంశీ. ఎవరైనా పెద్ద స్టార్లతో సినిమాలు చెయ్యచ్చుగా, భారీ చిత్రాలు తెరకెక్కించవచ్చుగా అని అన్నా.. తనను నమ్మి సినిమాలు చేసే స్టార్లు, నిర్మాతలు ఇప్పుడు లేరని కుండబద్దలు కొడుతుంటాడాయన.

This post was last modified on January 18, 2026 5:48 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

మెగా అభిమానులు… ఉక్కిరి బిక్కిరే

మెగా అభిమానులు కొన్నేళ్ల నుంచి అంత సంతృప్తిగా లేరు. చిరు నుంచి ‘భోళా శంకర్’ లాంటి భారీ డిజాస్టర్ వచ్చింది.…

1 hour ago

కవిత ‘పీకే’ మంత్రం ఫలిస్తుందా?

సొంత పార్టీ పెట్టుకుంటాన‌ని ప్ర‌క‌టించిన బీఆర్ ఎస్ మాజీ నాయ‌కురాలు, మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె క‌విత‌.. తన పార్టీకి…

2 hours ago

మారుతి… మళ్లీ తన స్టయిల్లో?

ఈ రోజుల్లో, బస్ స్టాప్, ప్రేమకథా చిత్రమ్ లాంటి చిన్న సినిమాలతో సంచలనం సృష్టించి.. ఆపై నానితో చేసిన ‘భలే…

2 hours ago

`పాల‌న కోసం పుస్త‌కం` ప‌ట్ట‌నున్న రేవంత్ రెడ్డి

తెలంగాణ ముఖ్య‌మంత్రిగా నిత్యం ఎంతో బిజీగా ఉండే రేవంత్ రెడ్డి..పుస్త‌కాలు ప‌ట్టుకుని స్టూడెంట్ గా మార‌నున్నారు. నిజానికి త‌న‌కు ఒక్క‌రోజు…

3 hours ago

ఆ కుక్కలను నేను పెంచుకుంటా: రేణు దేశాయ్

వీధి శునకాలను అకారణంగా చంపుతున్నారని నటి రేణు దేశాయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తప్పుబడుతూ…

3 hours ago

‘IPLలో మ్యాచ్ ఫిక్సింగ్ అసంభవం’

మార్చిలో ప్రారంభం కానున్న ఐపీఎల్ 2026 కోసం క్రికెట్ ఫ్యాన్స్ వెయిట్ చేస్తుండగా, ఈ మెగా టోర్నీపై తరచుగా వచ్చే…

3 hours ago