తారక్ 250 స్పీడ్ మీద డ్రైవ్ చేస్తాడా

యంగ్ టైగర్ ఎన్టీఆర్.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎంత క్లోజ్ ఫ్రెండ్సో ఆర్ఆర్ఆర్ టైంలో అందరికీ అర్థం అయింది. వీళ్ళ స్నేహానికి సంబంధించి ఆ టైంలో ఎన్నో విషయాలు బయటికి వచ్చాయి. ఐతే సినిమా ప్రమోషన్ కోసమే ఆ సంగతులన్నీ చెప్పారని కామెంట్లు చేసిన వాళ్ళు కూడా లేకపోలేదు. ఐతే ఇప్పుడు చరణ్ కొత్తగా ఇచ్చిన స్పెషల్ ఇంటర్వ్యూలో తారక్ ప్రస్తావన తెచ్చాడు. టాలీవుడ్లో తన ఫేవరెట్ డ్రైవర్ తారకే అని చరణ్ కామెంట్ చేయడం విశేషం.

ఇండస్ట్రీలో ఉన్న స్నేహితుల్లో 250 కిలోమీటర్ల వేగంతో కారు డ్రైవింగ్‌ చేస్తుంటే ఎవరి పక్కన కూర్చోవాలని అనుకుంటారు? అని యాంకర్​ ప్రశ్నించగా.. చరణ్‌ స్పందిస్తూ సాధారణంగా డ్రైవింగ్‌ సీట్‌లో తాను తప్ప ఇంకెవరినీ కూర్చోనివ్వనని తేల్చేశాడు. ఐతే కొందరికి మాత్రమే మినహాయింపు ఉందంటూ తారక్ పేరు చెప్పాడు. తారక్ కారు నడుపుతుంటే ఎంజాయ్ చేస్తా అని చరణ్ చెప్పాడు. తారక్‌ను ‘క్రేజీ మ్యాడ్‌ డ్రైవర్‌’గా అభివర్ణించాడు చరణ్. తారక్ తో పాటు కారులో కూర్చున్న కొందరు చిత్రమైన అనుభవాలను ఎదుర్కున్నట్లు తాను విన్నానని చరణ్ చెప్పాడు.

ఎన్టీఆర్‌ డ్రైవింగ్‌లో ఎంతో ఎనర్జీ, ఇంటెన్సిటీ ఉంటాయని అతనన్నాడు. తారక్ కేవలం కారు నడపడమే కాదు రోడ్డును పూర్తిగా తన కంట్రోల్​లో తెచ్చుకుంటాడని చరణ్ కొనియాడాడు. ఎప్పుడైనా తాను ప్యాసింజర్‌ సీట్‌లో కూర్చోవాల్సి వస్తే, డ్రైవింగ్‌ సీట్‌లో కచ్చితంగా ఎన్టీఆర్‌ ఉంటారని చరణ్‌ స్పష్టం చేశారు.

తారక్‌తో కలిసి చేసిన ప్రతి ప్రయాణం మరపురాని అనుభవమని, అది నిజంగా నెక్స్ట్‌ లెవల్‌ ఎక్స్‌పీరియెన్స్‌ అని రామ్‌ చరణ్‌ చెప్పుకొచ్చాడు. తారక్ డ్రైవింగ్ గురించి గతంలో కొందరు సెలెబ్రెటీలు భయపడుతూ మాట్లాడారు. తారక్ విపరీతమైన వేగంతో వెళ్లాడని.. తనతో జర్నీ చాలా కష్టం అని అభిప్రాయపడ్డారు.