గత ఏడాది డిసెంబర్ లో విడుదలైన కలం కవల్ కేరళలో సెన్సేషనల్ సక్సెస్ అందుకుంది. తక్కువ బడ్జెట్ లో వేగంగా రూపొందిన ఈ సైకో థ్రిల్లర్ మూవీ ఫైనల్ రన్ లో 80 కోట్లకు పైగా వసూలు చేయడం ఒక రికార్డు. అయితే అసలు విశేషం ఇది కాదు.
మలయాళం మెగాస్టార్ గా పిలవబడే మమ్ముట్టి ఇందులో విలన్ గా పూర్తి నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్ర చేస్తే, హీరో లాంటి పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ ని జైలర్ ఫేమ్ వినాయకన్ పోషించడం. ఈ పాత్రల స్వాపింగ్ ఎక్స్ పెక్ట్ చేయని ఆడియన్స్ నేరుగా థియేటర్లలో ఈ ట్విస్టుని చూసి షాకయ్యి హిట్ ఇచ్చారు. ఇప్పుడీ కలం కవల్ తెలుగు డబ్బింగ్ తో పాటు ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతోంది.
సోషల్ మీడియాలో దీని మీద ప్రశంసలు కురుస్తున్నాయి. కథ మరీ కొత్తదేం కాదు. మహిళలను ట్రాప్ చేసి వాళ్ళను లొంగదీసుకుని తర్వాత తాపీగా హత్యలు చేసే ఒక స్పెషల్ బ్రాంచ్ ఆఫీసర్ బయోపిక్ ఈ కలం కవల్. ఆధారాలు వదలకుండా కూల్ గా ఇరవైకి పైగా మర్డర్లు చేసి కుటుంబంతో మాములుగా ఉండే కిల్లర్ పాత్రలో మమ్ముట్టి జీవించేశారు.
ట్విస్టులు మరీ కుర్చీ అంచులో కూచోబెట్టకపోయినా స్క్రీన్ ప్లే ఇంటరెస్టింగ్ గా సాగుతుంది. చివర్లో వినాయకన్ చేతిలో మమ్ముట్టి చనిపోవడం రెగ్యులర్ గానే ఉంటుంది. అయితే ఇలాంటి రిస్కీ సబ్జెక్టుని ఆయన ఒప్పుకోవడం అన్నింటికన్నా ప్రధాన విశేషం.
కంటెంట్ బాగానే ఉన్నా ఇది మన కప్పు టీ కాదు. ఎందుకంటే తెలుగు ప్రేక్షకులకు స్టార్లంటే ఒక ఆరాధనా భావం. చిరంజీవి నుంచి మహేష్ బాబు వరకు ఎవరైనా కావొచ్చు, కత్తులు పట్టుకుని అమ్మాయిలను కిరాతకంగా చంపితే డైజెస్ట్ చేసుకోలేరు. అలా చేసే వాళ్ళను మట్టుబెడితే ఎంజాయ్ చేస్తారు.
‘వి’లో నానిని ఆడియన్స్ తిరస్కరించడానికి కారణం ఇదే. అందులోనూ కలం కవల్ లాంటివి టాలీవుడ్ కు సూటవ్వవు. వాటితో పోల్చుకుని మన హీరోలు అలాంటివి ఎందుకు ట్రై చేయరనే విమర్శలూ రైట్ కాదు. ఆడియన్స్ అభిరుచులు భిన్నంగా ఉండటం వల్లే తమిళ, తెలుగులో ఈ తరహా ఎక్స్ పరిమెంట్లు చూడలేం.
Gulte Telugu Telugu Political and Movie News Updates