ది రాజా సాబ్ ఫలితం గురించి మళ్ళీ చెప్పడానికి ఏం లేదు. ఏదైనా డిఫెండ్ చేసుకుందామన్నా ఆ అవకాశం లేకపోవడంతో సోషల్ మీడియాలో ప్రభాస్ అభిమానులు సైలెంట్ అయిపోయారు. పండగకు అందరి కంటే ముందు వచ్చే అడ్వాంటేజ్ ని ఫుల్లుగా వాడుకుని రికార్డులు బద్దలు కొడదామని అంటుకుంటే, దానికి రివర్స్ జరగడం ఎవరూ ఊహించలేదు.
పైగా మన శంకరవరప్రసాద్ గారు అంచనాలకు మించి బ్లాక్ బస్టర్ కావడం చాలా డ్యామేజ్ చేసింది. రవితేజ, నవీన్ పోలిశెట్టి, శర్వానంద్ కాంపిటీషన్ తట్టుకోవచ్చేమో కానీ ఈసారి మెగాస్టార్ ర్యాంపేజ్ ఉండేసరికి బలంగా నిలబడేందుకు అవకాశం లేకపోయింది.
ఇదంతా ఒక కోణం. రెండో వైపు చూద్దాం. నెగటివ్ రివ్యూలు, సానుకూలంగా లేని పబ్లిక్ టాక్, హారర్ జానర్ కావడంతో దూరంగా ఉన్న ఫ్యామిలీ ఆడియన్స్, లైట్ తీసుకున్న ఫ్యాన్స్, ఇలా ఇన్ని మైనస్ ఫాక్టర్స్ ఉన్నప్పటికీ రాజా సాబ్ థియేటర్లలో జనం కనిపిస్తున్నారంటే ఆ క్రెడిట్ పూర్తిగా ప్రభాస్ ఇమేజ్ కే చెందుతుంది.
వాటిలో కొన్ని ఇతర సినిమాల ఓవర్ ఫ్లోస్ ఉండొచ్చేమో కానీ సగానికి పైగా టికెట్లు తెగడానికి వన్ అండ్ ఓన్లీ రీజన్ డార్లింగే. ప్రభాస్ సినిమా కాబట్టి టాక్ తో పనేముంది ఒక్కసారైనా చూడాలని ఫిక్స్ అయినవాళ్లు లక్షల్లో ఉండబట్టే రెండు వందల కోట్ల మార్కుని అందుకోగలిగింది. ఇక్కడ వేరే కారణాలు ఏమీ లేవు.
ఒకవేళ రాజా సాబ్ కనక హిట్టు టాక్ తెచ్చుకుని ఉంటే ఇవాళ సీన్ ఇంకోలా ఉండేది. ఒకటి రెండు సినిమాలు వాయిదా వేసుకునే పరిస్థితి వచ్చినా ఆశ్చర్యం లేదు. అలాని ఇప్పుడు రాజా సాబ్ షోలన్నీ హౌస్ ఫుల్ అవుతున్నాయని కాదు. మెయిన్ సెంటర్స్ లో చెప్పుకోదగ్గ ఆక్యుపెన్సీలు నమోదవుతున్నాయి.
దర్శకుడు మారుతీ వీలైనంత ప్రమోట్ చేసే ప్రయత్నం చేసినప్పటికీ ఆయన మాటల ప్రభావం బాక్సాఫీస్ మీద లేదు. కేవలం ప్రభాస్ అనే పేరే ఇక్కడిదాకా లాక్కొచ్చింది. ఇలాంటి పోటీ కాకుండా సోలోగా వచ్చి ఉంటే ఇదే టాక్ తో ఇంకో వంద కోట్లయినా అదనంగా వచ్చి ఉండేవి. ఎలా అంటారా. ఆదిపురుష్ నెంబర్లే దానికి సాక్ష్యం.
Gulte Telugu Telugu Political and Movie News Updates