మెగాస్టార్ చిరంజీవి సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే.. బాక్సాఫీస్ దగ్గర ఇప్పటికీ ఎలాంటి విధ్వంసం సృష్టించగలరో ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రం రుజువు చేస్తోంది. చిరు చివరి చిత్రం ‘భోళా శంకర్’ పెద్ద డిజాస్టర్ అయ్యేసరికి ఆయన పనైపోయిందంటూ సోషల్ మీడియాలో కామెంట్లు మొదలయ్యాయి. చిరు బాక్సాఫీస్ స్టామినా ఏంటో తెలియని ఈ తరం కుర్రాళ్లు వెటకారాలు ఆడడం మొదలుపెట్టారు.
కానీ ఆయనకు నప్పే క్యారెక్టర్ పడితే ఎలా చెడుగుడు ఆడుకుంటాడో ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా చూస్తే అర్థమవుతుంది. అనిల్ రావిపూడికి ఫ్యామిలీస్‌లో ఉన్న ఫాలోయింగ్‌కు చిరు స్టార్ పవర్ తోడవడంతో ఈ సినిమా పెద్ద మాస్ సినిమా తరహాలో థియేటర్లను నింపేస్తోంది. మంగళవారం రవితేజ సినిమా ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’, బుధవారం ‘అనగనగా ఒక రాజు’, ‘నారీ నారీ నడుమ మురారి’ చిత్రాలు రిలీజైనా సరే.. చిరు సినిమాకు టికెట్లు దొరకడం కష్టమైన పరిస్థితి.
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉదయం 7-8 మధ్య చిరు చిత్రానికి షోలు నడిపిస్తున్నారు. అలాగే రాత్రి 1 తర్వాత కూడా షోలు పడుతున్నాయి. ‘మన శంకర వరప్రసాద్ గారు’కు ఆ స్థాయిలో డిమాండ్ ఉంది. ఇంకో విశేషం ఏంటంటే.. చిరు సినిమాకు ఉన్న డిమాండ్ వేరే చిత్రాలకు కూడా కలిసొస్తోంది. ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా చూద్దామని వచ్చి టికెట్లు దొరక్కపోవడంతో చేసేది లేక వేరే సినిమాలకు వెళ్తున్నారు ఆడియన్స్.
చిరు సినిమా ఓవర్ ఫ్లోస్ వేరే చిత్రాలకు కలిసి రావడం దశాబ్దాలుగా జరుగుతున్న విషయమే. ఇలా ఎన్నో సినిమాలు ప్రయోజనం పొందాయి. ఇలాంటి పండుగ సీజన్లలో చిరు సినిమా ఉన్నా వేరే చిత్రాలు పోటీకి వెళ్లడానికి ఓవర్ ఫ్లోస్ కలిసి రావడం కూడా ఒక కారణమే. ఇలా పదుల సంఖ్యలో సినిమాలు లాభం పొంది ఉంటాయి. ఇప్పుడు సంక్రాంతి బరిలో ఉన్న మిగతా సినిమాలన్నింటికీ చిరు మూవీ ఓవర్ ఫ్లోస్ కలిసి వస్తున్నాయి.
This post was last modified on January 15, 2026 2:34 pm
సంక్రాంతి వస్తే చాలు పతంగులు ఎగురవేసేందుకు చిన్నా, పెద్దా అంతా ఆసక్తి చూపుతుంటారు. అయితే, దారంతో కాకుండా చైనా మాంజాతో…
పండగ చివర్లో వచ్చిన సినిమా నారి నారి నడుమ మురారి. ప్రీమియర్లు పడే దాకా అండర్ డాగ్ గా ఉంటూ…
రాజకీయ రంగప్రవేశానికి ముందు చివరి సినిమాగా విపరీతమైన ప్రచారానికి నోచుకున్న జన నాయకుడుకి మోక్షం ఎప్పుడో అర్థం కాక అభిమానులు…
నిన్న లోకేష్ కనగరాజ్ అనౌన్స్ మెంట్ వచ్చాక అల్లు అర్జున్ సినిమాల గురించి మరోసారి చర్చ మొదలయ్యింది. ఎందుకంటే అట్లీది…
ఇది కేరళ కాదు… ఆంధ్రప్రదేశ్‌లోని ఆత్రేయపురం. సంక్రాంతి పండుగ సందర్భంగా ఆత్రేయపురంలో పండుగ వాతావరణం నెలకొంది అంటూ మంత్రి నారా…
2026 బాక్సాఫీస్ సంక్రాంతి ప్రధాన ఘట్టం అయిపోయింది. మొత్తం అయిదు సినిమాల స్క్రీనింగ్‌లు అయిపోయాయి. టెక్నికల్ గా నారి నారి…