బన్నీ చేస్తోంది లోకేష్ డ్రీమ్ ప్రాజెక్టా ?

అట్లీ తర్వాత అల్లు అర్జున్ చేయబోయే సినిమా అనౌన్స్ మెంట్ వచ్చాక దాని మీద సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఇది దర్శకుడు లోకేష్ కనగరాజ్ కెరీర్ ప్రారంభం నుంచే డ్రీమ్ ప్రాజెక్టుగా చెప్పుకుంటూ వచ్చిన ‘ఇరుంబు కై మాయావి’ అని ఫ్యాన్స్ డిస్కస్ చేసుకుంటున్నారు.

ఇది మానగరం కన్నా ముందు లోకేష్ సూర్యతో చేయాలనుకున్న ప్యాన్ ఇండియా మూవీ. ఆ మేరకు అప్పట్లో ప్రకటన ఇచ్చారని చెన్నై వర్గాల్లో చెప్పుకుంటారు. కానీ బడ్జెట్ ఇష్యూస్ వల్ల ముందుకు వెళ్లలేకపోయింది. పైగా రజనీకాంత్ రోబోతో పోలికలు వచ్చే రిస్క్ ఉందని లోకేష్ దాన్ని తాత్కాలికంగా పక్కన పెట్టాడని అంటారు.

ఇరుంబు కై మాయావి ఫాంటసీ సబ్జెక్టు. ఒక చెయ్యి తెగిన హీరో కృత్రిమంగా మరొకటి చేయించుకుని విలన్ల మీద ప్రతీకారం తీర్చుకోవడంతో పాటు ఊహకందని పనులు చేస్తూ ఉంటాడు. ఇది కూలి టైంలో అమీర్ ఖాన్ కు చెబితే ఆయనకూ నచ్చింది. కానీ తర్వాత ఎందుకో ఆయన వద్దనుకున్నారు.

ఇప్పుడు కూడా హోల్డ్ లో పెట్టమంటున్నారు తప్ప క్యాన్సిల్ అనడం లేదు. ఇది పక్కన పెడితే బన్నీ 23లో ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ చూపించారు. జంతువులు, తుపాకులు ఉన్నాయి. అంటే ఖచ్చితంగా ఇరుంబు కై మాయావి కాదనేది ఒక వెర్షన్. ఎందుకంటే అప్పుడెప్పుడో రాసుకున్న కథను అల్లు అర్జున్ చేసే అవకాశాలు తక్కువ.

దీనికి సంబంధించి అఫీషియల్ క్లారిటీ రావాలంటే షూటింగ్ మొదలై కనీసం టీజర్ రావాలి. అప్పుడే స్పష్టత వస్తుంది. దీనికి చాలా టైం పడుతుంది. అట్లీది పూర్తవ్వడానికి ఇంకో ఆరేడు నెలలు పట్టేలా ఉంది. కూలిలో జరిగిన పొరపాట్లు మళ్ళీ రిపీట్ కాకుండా లోకేష్ ఈసారి స్క్రిప్ట్ మీద జాగ్రత్తగా వర్క్ చేయబోతున్నాడట.

హీరోగా నటిస్తున్న మూవీ షూటింగ్ కూడా వేగవంతం చేసి అల్లు అర్జున్ 23కి పూర్తి సమయం కేటాయించబోతున్నట్టు ఇన్ సైడ్ టాక్. మైత్రి మూవీ మేకర్స్ దీనికి పెట్టబోయే బడ్జెట్ వివరాలు ఇంకా లీక్ కాలేదు. అట్లీది అయ్యేదాకా లోకేష్ కనగరాజ్ సినిమాకు సంబంధించి అప్డేట్స్ ఇకపై ఉండనట్టే.