చరిత్ర సృష్టిస్తూ బాలీవుడ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన దురంధర్ ఇప్పుడు ఏకంగా బాహుబలి 2 రికార్డుకే ఎసరు పెట్టింది. నార్త్ అమెరికాలో ఇప్పటిదాకా దీని పేరు మీదున్న 20.7 మిలియన్ డాలర్ల మార్కుని దురంధర్ దాటేసింది. 21 మిలియన్లతో ఇంకా రన్ కొనసాగిస్తోంది.
నిజానికి రిలీజ్ కు ముందు ఈ సంచలనం ఎవరూ ఊహించలేదు. ప్రెస్ ప్రీమియర్ క్యాన్సిల్ కావడం, ట్రైలర్ అనుకున్న స్థాయిలో క్లిక్ కాకపోవడం లాంటి కారణాలు భారీ ఓపెనింగ్స్ కు అడ్డుగా నిలిచాయి. కానీ మొదటి ఆట పూర్తి కావడం ఆలస్యం టాక్ దావానలంలా పాకిపోయింది. తెలుగు రాష్ట్రాల్లోనూ హిందీ వెర్షన్ గొప్పగా ఆడింది.
ఇప్పటిదాకా 1300 కోట్ల వసూళ్లతో టాప్ గ్రాసర్ గా నిలిచిన దురంధర్ ఇప్పుడు కూడా బుక్ మై షో ట్రెండింగ్ లో ఉండటం గమనించాల్సిన విషయం. ఉత్తరాది రాష్ట్రాల్లో ఫ్రెష్ రిలీజ్ రాజా సాబ్ కన్నా ఇదే ముందంజలో ఉండటం ఎవరూ ఊహించలేదు. ఇంత లాంగ్ రన్ గత కొన్నేళ్లలో ఏ హిందీ మూవీకి రాలేదన్నది వాస్తవం.
ఒకరకంగా చెప్పాలంటే హమ్ ఆప్కె హై కౌన్, దిల్వాలే దుల్హనియా లేజాయేంగే నాటి రోజులను దురంధర్ గుర్తుకు తెచ్చింది. నెట్ ఫ్లిక్స్ లో జనవరి 30 నుంచి స్ట్రీమింగ్ ఉండొచ్చని వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో అప్పటిదాకా థియేటర్ల నుంచి దురంధర్ వెళ్లిపోయేలా లేడు.
మార్చి 19 విడుదలకు దురంధర్ 2 రెడీ అవుతోంది. వాయిదా పడొచ్చనే వార్తలను నిర్మాతలు కొట్టి పారేస్తున్నారు. పుష్ప తర్వాత ఒక సీక్వెల్ కి పెద్ద ఎత్తున క్రేజ్ రావడంతో దీంతో చూడొచ్చని బయ్యర్లు నమ్మకంగా ఉన్నారు. అదే రోజు రిలీజ్ ప్లాన్ చేసుకున్న టాక్సిక్, డెకాయిట్ అదే మాటకు కట్టుబడి ఉన్నాయి.
ఒకవేళ దురంధర్ 2 కనక ఏదైనా కారణాల వల్ల పోస్ట్ పోన్ అయితే తమకు లాభమవుతుందని వాళ్ళ అంచనా. దీని వల్లే బాక్సాఫీస్ పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. దర్శకుడు ఆదిత్య ధార్ ప్రస్తుతం దురంధర్ 2 తాలూకు పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు. డబ్బింగ్ ఈ నెలాఖరులో అయిపోతుందట.
Gulte Telugu Telugu Political and Movie News Updates