శృతి లాగే శ్రీలీల.. పవన్ హిట్ ఇస్తాడా?

​టాలీవుడ్ సెన్సేషన్ శ్రీలీల ప్రస్తుతం కెరీర్ పరంగా గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. ‘ధమాకా’ సినిమాతో ఓ రేంజ్ క్రేజ్ సంపాదించుకున్న ఈ బ్యూటీకి ఆ తర్వాత అదృష్టం మాత్రం కలిసి రావడం లేదు. రీసెంట్ గా రవితేజతో చేసిన ‘మాస్ జాతర’ బాక్సాఫీస్ వద్ద దారుణంగా నిరాశపరిచింది. అంతకుముందు 

ఆది కేశవ, రాబిన్ హుడ్ లాంటి సినిమాలు కూడా కోలుకోలేని దెబ్బ కొట్టాయి. పోనీ పక్క ఇండస్ట్రీలో అయినా లక్ చెక్ చేసుకుందామని కోలీవుడ్ లో ‘పరాశక్తి’ అనే సినిమా చేసింది. కానీ అది కూడా పెద్దగా క్లిక్ కాలేదు.

​వరుస పరాజయాల తర్వాత శ్రీలీల ఆశలన్నీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాపైనే ఉన్నాయి. గమ్మత్తైన విషయం ఏంటంటే, అప్పట్లో శృతి హాసన్ కూడా వరుస ఫ్లాపులతో ఐరెన్ లెగ్ అనే ముద్రను ఎదుర్కొంది. కానీ సరిగ్గా ఇదే హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్ కలయికలో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ సినిమాతో ఆమె ఒక్కసారిగా బౌన్స్ బ్యాక్ అయ్యి స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది.  ఇప్పుడు దాదాపు అదే తరహా పరిస్థితులను ఎదుర్కొంటున్న శ్రీలీల కూడా అదే కాంబినేషన్ మీద తన ఆశలన్నీ పెట్టుకుంది.

​అప్పట్లో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ కూడా రీమేక్ సినిమానే అయినప్పటికీ, హరీష్ శంకర్ తన మాస్ టచ్‌తో కథలో చేసిన మార్పులు ఆ సినిమాను ఇండస్ట్రీ హిట్‌గా నిలబెట్టాయి. ఇప్పుడు ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కూడా ‘తెరి’ కి రీమేక్ అన్నప్పటి నుంచి ఫ్యాన్స్‌లో కొంత నిరాశ ఉన్నప్పటికీ, హరీష్ మాత్రం పవన్ కళ్యాణ్ బాడీ లాంగ్వేజ్‌కు సూటయ్యేలా కథను పక్కాగా మార్చినట్లు భరోసా ఇస్తున్నారు. .

కమర్షియల్ ఎలిమెంట్స్ గట్టిగా ఉండటంతో పాటు ఒక పవర్‌ఫుల్ థీమ్ ఈ సినిమాలో హైలైట్ కాబోతోందట. ​శ్రీలీల కెరీర్ మళ్ళీ గాడిలో పడాలంటే ఈ సినిమా హిట్ అవ్వడం చాలా కీలకం. గబ్బర్ సింగ్ తర్వాత మళ్ళీ అదే డైరెక్టర్, హీరో కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో మార్కెట్‌లో దీనికి మంచి డిమాండ్ ఉంది. కేవలం గ్లామర్, డ్యాన్స్ మాత్రమే కాకుండా ఈ పవర్‌ఫుల్ సినిమాలో శ్రీలీల నటనకు కూడా స్కోప్ ఉంటే ఆమె ఫేట్ మారిపోవడం ఖాయం. ఒకవేళ కొత్త అప్‌డేట్స్ ఆకట్టుకుంటే ఆడియెన్స్‌లో ఉన్న అంచనాలు కూడా పూర్తిగా మారవచ్చు.

​మొత్తానికి శృతి హాసన్ లాగే శ్రీలీల కూడా ఈ మెగా ఆఫర్‌తో తనపై ఉన్న నెగటివ్ ముద్రను చెరిపేసుకోవాలని చూస్తోంది. హరీష్ శంకర్ గనుక మరోసారి తన మార్క్ మ్యాజిక్ రిపీట్ చేస్తే శ్రీలీల ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ పడటం పక్కా. మరి ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఈ ముద్దుగుమ్మను ఎంతవరకు గట్టెక్కిస్తాడో చూడాలి.