మెగా ఫ్యాన్స్ జోష్ మాములుగా లేదు. మొన్నటిదాకా తమ హీరోలు వరస డిజాస్టర్లతో సతమతమవుతున్నప్పుడు వాళ్ళు పడిన బాధ అంతా ఇంత కాదు. ముఖ్యంగా హరిహర వీరమల్లు మీద జరిగిన ట్రోలింగ్, వచ్చిన నష్టాలు గుర్తు వచ్చినప్పుడంతా అదో రకమైన నరకం చూశారు. కానీ ఓజి రూపంలో 2025 బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ దక్కాక గేరు మారింది.
మూడు వందల కోట్లకు పైగా వసూళ్లతో మరోసారి పవన్ కళ్యాణ్ స్టామినా ఋజువు కావడంతో ఫ్యాన్స్ ఒక్కసారిగా యాక్టివ్ అయిపోయారు. ఇంకో మూడు నెలలు తిరగడం ఆలస్యం ఇప్పుడు మన శంకరవరప్రసాద్ గారు రూపంలో అన్నయ్య చిరంజీవి ఒక హిట్టు ఇచ్చేసరికి మొహాలు వెలిగిపోతున్నాయి.
ఇప్పుడు నెక్స్ట్ లిస్టులో రామ్ చరణ్ పెద్ది ఉంది. మార్చి 27 విడుదల కాబోతున్న ఈ విలేజ్ డ్రామాకు సంబంధించిన షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఎట్టి పరిస్థితుల్లో విడుదల తేదీని మిస్ కాకూడదనే లక్ష్యంతో దర్శకుడు బుచ్చిబాబు నాన్ స్టాప్ షూటింగ్ చేస్తున్నారు.
తక్కువ గ్యాప్ లో టాక్సిక్, దురంధర్ 2 ఉన్నప్పటికీ కంటెంట్ మీద నమ్మకంతో నిర్మాతలు రిస్క్ చేయడానికే ఆలోచిస్తున్నారట. చికిరి చికిరి సెన్సేషన్ వచ్చి నెలలు దాటిపోవడంతో నెక్స్ట్ సాంగ్ జనవరి 26 రిలీజ్ చేసేందుకు రెడీ అయ్యారని సమాచారం. టీజర్ ఫిబ్రవరిలో పెద్ద ఎత్తున లాంచ్ చేయొచ్చని తెలిసింది.
పెద్దికి ముందు నుంచి ప్రీ పాజిటివ్ వైబ్స్ చాలా ఉన్నాయి. ముఖ్యంగా చరణ్ పెర్ఫార్మన్స్ గురించి ఇన్ సైడ్ టాక్స్ ఓ రేంజ్ లో వినిపిస్తున్నాయి. క్లైమాక్స్, ఫైట్స్, ఇంటర్వెల్ ఎపిసోడ్, ఎమోషనల్ సీన్స్ అన్నింటిలోనూ బెస్ట్ ఇచ్చాడనే టాక్ గట్టిగా తిరుగుతోంది. ఇవి నిజమై ఏఆర్ రెహమాన్ ఆల్బమ్ మొత్తం బెస్ట్ సాంగ్స్ ఇస్తే మటుకు హైప్ ఎక్కడికో వెళ్ళిపోతుంది.
ప్రస్తుతం ఎక్స్, ఇన్స్ టాలో ఎక్కడ చూసినా మెగా ఫ్యాన్స్ తాలూకు ఆనందమే కనిపిస్తోంది. ముఖ్యంగా బాబాయ్, బాస్ తర్వాత అబ్బాయి బ్లాక్ బస్టర్ కొట్టాలని ట్వీట్లు పెడుతున్నారు. ఇది క్లిక్ అయితే నెక్స్ట్ ఉస్తాద్ భగత్ సింగ్ తో కొత్త రౌండ్ మొదలవుతుంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates