మెగాస్టార్ చిరంజీవి.. పోస్టర్ మీద ఈ పేరు చూస్తే చాలు.. కళ్లు మూసుకుని థియేటర్లకు వెళ్లిపోయేవాళ్లు ఒకప్పుడు. ఆయన ఫ్లాప్ సినిమాలు కూడా వేరే స్టార్ హీరోల సూపర్ హిట్ సినిమాలతో సమానంగా ఓపెనింగ్స్, ఓవరాల్ వసూళ్లు సాధించేవి.
సినిమా బాలేకున్నా.. చిరంజీవిని రెండున్నర గంటల పాటు చూసిన ఆనందంతో బయటికి వచ్చేవాళ్లు అభిమానులు. కానీ పదేళ్లు సినిమాలకు దూరమై రీఎంట్రీ ఇచ్చాక మొదట్లో చిరు సినిమాలు బాగానే ఆడాయి కానీ.. గత ఐదారేళ్లలోనే చిరు ప్రభావం తగ్గుతూ వస్తోంది.
‘వాల్తేరు వీరయ్య’ మినహా సినిమాలన్నీ అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేశాయి. ముఖ్యంగా ఆచార్య, భోళా శంకర్ చిత్రాలకు వచ్చిన ఫలితం మెగా ఫ్యాన్స్‌ను కుదేలు చేశాయి. ఈ చిత్రాలకు కనీసం ఓపెనింగ్స్ కూడా కరువయ్యాయి. ‘భోళా శంకర్’ అయితే ముందే డిజాస్టర్ అనే ఫీలింగ్ వచ్చేయడంతో మెజారిటీ ప్రేక్షకులు ఆ సినిమా థియేటర్ల వైపు కూడా చూడలేదు. చిరు పెద్ద స్టార్ అయ్యాక ఏ సినిమాకూ అంత ఘోరమైన పరాభవం ఎదురు కాలేదు. దీంతో చిరు పనైపోయిందా అనే చర్చ కూడా జరిగింది.
కానీ ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రంతో మళ్లీ చిరు తన మార్కు మాస్ చూపిస్తున్నాడు. కొన్ని కారణాల వల్ల ఈ సినిమా మీద కూడా మధ్యలో సందేహాలు కలిగాయి కానీ.. రిలీజ్ దగ్గరికి వచ్చేసరికి అంతా మారిపోయింది. సంక్రాంతి పోటీలో ముందుగా వచ్చిన ‘రాజాసాబ్’ అంచనాలను అందుకోకపోవడం.. ఇటీవలే రిలీజ్ చేసిన చిరు హుక్ స్టెప్ మెగా అభిమానుల్లో ఫుల్ జోష్ తీసుకురావడం.. ఇలా అన్నీ ‘మన శంకర వరప్రసాద్ గారు’కు అనుకూలంగా మారాయి.
ఓవర్సీస్‌లో కొంచెం నెమ్మదిగా సాగుతున్న అడ్వాన్స్ బుకింగ్స్ ఒక్కసారిగా ఊపందుకున్నాయి. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో బుకింగ్స్ మంచి జోరు మీద ఉన్నాయి. సినిమాకు ఇప్పుడు ఫుల్ పాజిటివ్ బజ్ కనిపిస్తుండగా.. ఓపెనింగ్స్ ఒక రేంజిలో ఉండబోతున్నాయని స్పష్టమవుతోంది.
మొత్తంగా చూస్తే చిరు మార్కు ‘మెగా మాస్’ను మళ్లీ చూస్తున్నామని అభిమానులు ఎంతో ఉత్సాహంగా కనిపిస్తున్నారు. కావాల్సిందల్లా సినిమాకు పాజిటివ్ టాకే. అది వస్తే.. మళ్లీ చిరు బాక్సాఫీస్ విధ్వంసాన్ని చూడొచ్చు.
This post was last modified on January 11, 2026 9:37 pm
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…
సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…
ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…