సంక్రాంతి రేసులో రెండో పుంజు దిగుతోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ది రాజా సాబ్ ఫలితం మీద దాదాపు క్లారిటీ వచ్చేసినట్టే. కానీ పండగ అయిపోయేదాకా ఫైనల్ స్టేటస్ తేలదు కాబట్టి అప్పటిదాకా వెయిట్ చేయలి. ఇప్పుడు అందరి దృష్టి మన శంకరవరప్రసాద్ గారు మీదకు వెళ్తోంది.
చాలా సంవత్సరాల తర్వాత చిరంజీవి సినిమా ముందు రోజు రాత్రి ప్రీమియర్లు వేస్తున్నారు. తెలంగాణ కొంత ఆలస్యంగా అనౌన్స్ చేసినప్పటికీ చివరి నిమిషం దాకా నాన్చే ఇబ్బంది లేకుండా ఆదివారం ఉదయమే టికెట్ల అమ్మకాలు మొదలుపెట్టేశారు. ఏపీలో మొన్నే టికెట్ల అమ్మకాలు స్టార్ట్ అయ్యాయి.
ఇరవై నాలుగు గంటల వ్యవధిలో మన శంకరవరప్రసాద్ గారుకి బుక్ మై షోలో లక్షకు పైగా టికెట్లు అమ్ముడుపోవడం శుభ సూచకం. రాత్రికి వచ్చే టాక్ ని బట్టి ఈ నెంబర్లలో గణనీయమైన మార్పు ఉంటుంది. ముఖ్యంగా చిరంజీవి, అనిల్ రావిపూడికి బలంగా నిలిచే ఫ్యామిలీ ఆడియన్స్ దీని పట్ల చాలా ఆసక్తితో ఉన్నారు.
వెంకటేష్ క్యామియో తోడవ్వడంతో హైప్ మరింత పెరిగింది. మీసాల పిల్ల, హుక్ స్టెప్ సాంగ్స్ ఛార్ట్ బస్టర్స్ కావడం, మెగా విక్టరీ పాటను ఫ్యాన్స్ బాగా రిసీవ్ చేసుకోవడం బజ్ కి తోడ్పడుతున్నాయి. ఓవర్సీస్ లో దాదాపు మిలియన్ మార్కుకు దగ్గరగా వెళ్తున్న ప్రసాద్ గారు షో టైంకి దాన్ని చేరుకున్నా ఆశ్చర్యం లేదు.
పాజిటివ్ టాక్ వస్తే మటుకు నిజమైన పండగ వాతావరణం థియేటర్లలో చూడొచ్చు. రేపంతా చిరంజీవికి ఓపెన్ గ్రౌండ్ దొరకనుంది. చాలా సెంటర్లలో పెద్ద ఎత్తున థియేటర్లు, షోలు కేటాయిస్తున్నారు. ఆ తర్వాత వచ్చే భర్త మహాశయులకు విజ్ఞప్తి, అనగనగా ఒక రాజు, నారి నారి నడుమ మురారి పోటీని తట్టుకోవాలంటే ప్రసాద్ గారు యునానిమస్ టాక్ తెచ్చుకోవాల్సిందే.
అభిమానులైతే సంక్రాంతికి వస్తున్నాం రేంజ్ లో అంచనాలు పెట్టేసుకున్నారు. భోళా శంకర్ తర్వాత రెండేళ్లకే పైగా గ్యాప్ తీసుకున్న చిరంజీవికి ఈ సక్సెస్ చాలా కీలకం. హిట్టు కొడితేనే ఇంత కాలం తీసుకున్న గ్యాప్ కు న్యాయం చేసినట్టు అవుతుంది.
This post was last modified on January 11, 2026 10:31 am
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…
మెగాస్టార్ చిరంజీవి.. పోస్టర్ మీద ఈ పేరు చూస్తే చాలు.. కళ్లు మూసుకుని థియేటర్లకు వెళ్లిపోయేవాళ్లు ఒకప్పుడు. ఆయన ఫ్లాప్…
తెలంగాణలో ఓ మహిళా ఐఏఎస్ అధికారిపై నల్గొండ జిల్లాకు చెందిన ఓ సీనియర్ మంత్రి మనసు పారేసుకున్నారని, లేటు వయసులో…
ఏపీ రాజధాని అమరావతి అందరిదీ. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. ప్రజల పరంగా ఎక్కడా రాజధానిపై వ్యతిరేకత కూడా…
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, అక్కినేని నాగార్జున, విక్టరీ వెంకటేష్.. ఒకప్పుడు టాలీవుడ్‌కు నాలుగు స్తంభాల్లా నిలబడ్డ స్టార్ హీరోలు.…
ప్రభాస్ సినిమా అంటేనే భారీ యుద్ధాలు, హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ లు గుర్తొస్తాయి. అయితే వరుసగా అవే చేయడం…