వింటేజ్ చిరుని బయటికి తెచ్చిన హుక్ స్టెప్

మన శంకరవరప్రసాదుగారులోని చివరి పాట వచ్చేసింది. ముందు నుంచి దీని గురించి ఓ రేంజ్ లో చెబుతూ వచ్చిన టీమ్ ఆ నమ్మకాన్ని ఏ మేరకు నిలబెట్టుకుంటుందోననే ఎగ్జైట్ మెంట్ అభిమానుల్లో విపరీతంగా ఉంది. ఆడియో కన్నా ముందుగా చెప్పుకోవాల్సింది విజువల్స్ అండ్ డాన్స్ గురించి.

హుక్ స్టెప్పు పదాన్ని హైలైట్ చేస్తూ సాగిన ఈ సాంగ్ లో సెల్ ఫోన్ బ్యాక్ లైట్ ఆన్ చేసి చిరుతో వేయించిన స్టెప్ వింటేజ్ మెగాస్టార్ ని గుర్తు చేస్తోంది. చూసేందుకు సింపుల్ గా ఉన్నా ఇమిటేట్ చేయడం కష్టమే. బాబా సైగల్ గాత్రంలో భీమ్స్ కంపోజ్ చేయగా రామజోగయ్య శాస్త్రి సాహిత్యం సమకూర్చారు.

మధ్యలో యానిమేషన్ రూపంలో ముఠామేస్త్రి, ఇంద్ర, ఘరానా మొగుడు హుక్ స్టెప్స్ చూపిస్తూ చిరుతో హుషారుగా డాన్స్ చేయించడం ఈ సాంగ్ లోని మెయిన్ హైలైట్. ఇండోర్ లైటింగ్ కాస్త ఎక్కువగా సెట్ చేసినట్టు అనిపించినా చిరు గ్రేస్ ముందు అలాంటి లోపాలు కనిపించకుండా పోయాయి.

ట్యూన్ మరీ క్యాచీగా లేకపోయినా జోష్ లో అలా పనైపోయిందని చెప్పాలి. గతంలో వచ్చిన చిరు సోలో సాంగ్స్ తో పోల్చుకుంటే దీంతో భీమ్స్ జస్ట్ పాస్ మార్కులు తెచ్చుకున్న ఫీలింగ్ కలుగుతుంది. పాట మొత్తం రివీల్ చేయలేదు కాబట్టి కేవలం తెరమీద చూసేందుకు ఇంకేమైనా స్టెప్స్ దాచారేమో చూడాలి.

దీంతో మ్యూజిక్ కు సంబంధించి మన శంకరవరప్రసాద్ గారు నుంచి కంటెంట్ మొత్తం వచ్చేసినట్టే. థియేటర్ సర్ప్రైజులు వేరే ఉంటాయని సమాచారం. జనవరి 12 విడుదలకు రెడీ అవుతున్న ఈ ఎంటర్ టైనర్ లో చిరంజీవి వెంకటేష్ మొదటిసారి స్క్రీన్ చేసుకోవడంతో అంచనాలు పీక్స్ లో ఉన్నాయి.

దానికి తగ్గట్టే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఇద్దరూ కలిసి హుషారుగా కనిపించడం వచ్చినవాళ్ళకు కిక్ ఇచ్చింది. హుక్ స్టెప్ సాంగ్ తో అంచనాల మీటర్ పెరిగిందని చెప్పాలి. రాజా సాబ్ కనక హిట్టు టాక్ తో సంక్రాంతి బోణీ చేస్తే మన శంకరవరప్రసాద్ గారుతో పాటు మిగిలిన సినిమాలు దాన్ని కొనసాగించాలనేది మూవీ లవర్స్ కోరిక