దళపతి విజయ్ పరిస్థితి ఇప్పుడు ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్లు తయారైంది. ఆయన కెరీర్ లోనే చివరి సినిమాగా వస్తున్న జన నాయగన్ విడుదలకు సిద్ధంగా ఉంది. కానీ సరిగ్గా రిలీజ్ ముందే సెన్సార్ చిక్కులు వదలట్లేదు. శుక్రవారం సినిమా పెట్టుకుని ఇంకా సర్టిఫికెట్ చేతికి రాకపోవడం అంటే మామూలు టెన్షన్ కాదు. దీనికోసం చిత్ర యూనిట్ ఏకంగా కోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చింది అంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.
ఇదంతా ఒకెత్తయితే, కరూర్ తొక్కిసలాట ఘటన ఇప్పుడు విజయ్ మెడకు గట్టిగా చుట్టుకుంది. సరిగ్గా సినిమా రిలీజ్ టైమ్ లోనే సీబీఐ నుంచి నోటీసులు రావడం యాదృశ్చికం అని ఎవరూ అనుకోవట్లేదు. 12వ తేదీన విచారణ కోసం ఢిల్లీకి రావాలని పిలుపు రావడం అంటే, రాజకీయంగా విజయ్ ను ఇబ్బంది పెట్టే పక్కా స్కెచ్ లాగే కనిపిస్తోందని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ పరిణామాలు చూస్తుంటే మనకు పవన్ కళ్యాణ్ పొలిటికల్ జర్నీ గుర్తుకు రాక మానదు. గతంలో పవన్ సినిమాలకు కూడా సరిగ్గా ఇలాంటి ఇబ్బందులే ఎదురయ్యాయి. టికెట్ రేట్లు, పర్మిషన్ల విషయంలో పవన్ ను ఎంతగా సతాయించారో, లా అండ్ ఆర్డర్ పేరుతో ఆయన్ను ఎలా అడ్డుకున్నారో అందరికీ తెలిసిందే. ఇప్పుడు విజయ్ వంతు వచ్చినట్లుంది. వ్యవస్థను ఎదిరించి కొత్త పార్టీతో నిలబడాలంటే ఇలాంటి వెల్కమ్ కామన్ అయిపోయింది.
అయితే ఇక్కడో చిన్న తేడా ఉంది. పవన్ కళ్యాణ్ కు ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఇలాంటి తొక్కిసలాట లాంటి విషాదాలు జరగకుండా చాలా జాగ్రత్త పడ్డారు. కానీ విజయ్ విషయంలో కరూర్ ఘటన ఒక మాయని మచ్చలా మారింది. దీన్ని ఇప్పుడు ప్రత్యర్థులు ఆయుధంగా మలుచుకుంటున్నారు.
ఎమోషనల్ గా, లీగల్ గా విజయ్ ను దెబ్బకొట్టడానికి ఇది వారికి ఒక బ్రహ్మాస్త్రంలా దొరికింది. సినిమా పేరు ‘జన నాయగన్’ పెట్టడమే ఒక పొలిటికల్ స్టేట్మెంట్. అందుకే రిలీజ్ ఆపడానికి శతవిధాలా ప్రయత్నాలు జరుగుతున్నాయని ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు.
ఒక సూపర్ స్టార్ రాజకీయాల్లోకి వస్తే, అక్కడున్న ఎస్టాబ్లిష్డ్ పార్టీలకు ఎంత భయం ఉంటుందో ఈ సంఘటనలు నిరూపిస్తున్నాయి. విజయ్ మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయడమే లక్ష్యంగా తెరవెనుక పావులు కదులుతున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది.
పవన్ కళ్యాణ్ ఇన్ని అవమానాలు, అడ్డంకులు భరించి చివరకు డిప్యూటీ సీఎం స్థాయికి ఎదిగారు. ఇప్పుడు విజయ్ కూడా అదే బాటలో వెళ్తున్నా, ఆయన ముందున్న సవాళ్లు ఇంకా కఠినంగా ఉన్నాయి. ఈ ఒత్తిడిని తట్టుకుని, లీగల్ గా క్లీన్ చిట్ తెచ్చుకుని, జనంలో సింపతీ గెలుచుకుంటేనే విజయ్ అసలైన నాయకుడిగా నిలబడగలరు. రాబోయే వారం రోజులు విజయ్ పొలిటికల్ భవిష్యత్తును డిసైడ్ చేయబోతున్నాయి.
This post was last modified on January 7, 2026 12:12 pm
దర్శకుడు గుణశేఖర్ అంటే మూవీ లవర్స్ కు వెంటనే గుర్తొచ్చే పేర్లు ఒక్కడు, చూడాలని ఉంది. భారీతనానికి కేరాఫ్ అడ్రెస్…
‘పుష్ప-2’ తర్వాత బన్నీ నుంచి వస్తుందనుకున్న సినిమా వేరు. అతను ఎంచుకున్న సినిమా వేరు. త్రివిక్రమ్తో కొన్నేళ్ల నుంచి ప్లానింగ్లో…
రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పై ఓ వివాహిత సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. తనను…
అడవుల మధ్యలో నుంచి పాములాగా మెలికలు తిరిగిన రోడ్డు మీదుగా వందల కోట్ల రూపాయల లోడ్ తో వెళుతున్న 2…
మహారాష్ట్రలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మృతి చెందారు. పుణెలోని…
తెలుగు సినిమాపై బలమైన ముద్ర వేసిన రామ్ గోపాల్ వర్మ శిష్యుల్లో గుణశేఖర్ కూడా ఒకడు. తొలి చిత్రం ‘సొగసు…