Movie News

పుష్ప 2, ఆర్ఆర్ఆర్ రికార్డులకు ఎసరు

గత నెలలో ‘దురంధర్’ సినిమా రిలీజవుతున్నపుడు మరీ అంచనాలేమీ లేవు. పైగా భారీ బడ్జెట్ పెట్టి తీసిన ఈ సినిమాకు కనీసం బ్రేక్ ఈవెన్ అయినా అవుతుందా అన్న అనుమానాలు కలిగాయి. కానీ రిలీజ్ తర్వాత ఈ చిత్రం సంచలన వసూళ్లతో దూసుకెళ్లింది. రోజులు గడుస్తున్నా వసూళ్లు తగ్గుముఖం పట్టలేదు. మూడు, నాలుగు వారాల్లోనూ కొత్త సినిమాలా కలెక్షన్లు కొల్లగొడుతూ.. రికార్డుల మోత మోగిస్తూ సాగిపోయింది. 

గత ఏడాది హైయెస్ట్ గ్రాసర్‌ రికార్డును బద్దలు కొట్టి 2025ను ముగించిన ‘దురంధర్’.. కొత్త ఏడాదిలోనూ డ్రీమ్ రన్ కొనసాగిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా వసూళ్లు రూ.1200 కోట్లు దాటిపోయాయి. ఇంకా కొన్ని వారాలు ‘దురంధర్’ వసూళ్ల మోత కొనసాగేలా ఉంది. ఈ క్రమంలోనే ‘పుష్ప: ది రూల్’ పేరిట ఉన్న అద్భుత రికార్డును ‘దురంధర్’ బద్దలు కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది.

ఇండియాలో అత్యధిక నెట్ వసూళ్లు సాధించిన చిత్రంగా ‘పుష్ప-2’నే కొనసాగుతోంది. 2024 డిసెంబరు 5న రిలీజైన ‘పుష్ప-2’ ఫుల్ రన్లో ఇండియా వరకు రూ.830 కోట్ల వసూళ్లు రాబట్టి కొత్త రికార్డును నెలకొల్పింది. అంతకుముందు ‘బాహుబలి’ పేరిట ఉన్న రికార్డును బన్నీ సినిమా బద్దలు కొట్టింది. ఇప్పట్లో ఈ రికార్డు బద్దలు కాదనుకున్నారంతా. కానీ ‘దురంధర్’ ఆ రికార్డుకు చేరువ అయింది. ఇప్పటికే ఈ సినిమా డొమెస్టిక్ కలెక్షన్లు రూ.820 కోట్లకు చేరుకున్నాయి. 

ఈ నెల చివర్లో డిజిటల్‌గా రిలీజయ్యే వరకు ‘దురంధర్’ రన్ ఆగేలా లేదు. కాబట్టి పుష్ప-2 రికార్డును దాటడమే కాక.. రూ.850 కోట్ల మార్కును కూడా అందుకునేలా కనిపిస్తోంది. దీంతో పాటే ‘దురంధర్’ మరో ఘనతను కూడా అందుకోబోతోంది. ‘ఆర్ఆర్ఆర్’ ఓవరాల్ కలెక్షన్ల మార్కును కూడా దాటేసి ఇండియన్ హైయెస్ట్ గ్రాసింగ్ మూవీస్‌లో నాలుగో స్థానాన్ని చేరుకోబోతోంది. ‘ఆర్ఆర్ఆర్’ రూ.1230 కోట్ల వరల్డ్ వైడ్ వసూళ్లు సాధించగా.. ‘దురంధర్’ కలెక్షన్లు ప్రస్తుతం రూ.1210 కోట్ల వద్ద ఉన్నాయి. దంగల్, బాహుబలి-2, పుష్ప-2 టాప్-3లో ఉన్నాయి.

This post was last modified on January 5, 2026 2:45 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

ఎవ‌రా హీరోయిన్… ద‌ర్శ‌కుడికి మినిస్ట‌ర్ల ఫోన్లు

సీనియ‌ర్ ద‌ర్శ‌కుడు గుణ‌శేఖ‌ర్ కెరీర్లో చూడాల‌ని ఉంది, ఒక్క‌డు లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ల‌తో పాటు సైనికుడు, వ‌రుడు, నిప్పు లాంటి దారుణ‌మైన…

10 minutes ago

10 వేల కెపాసిటీ బ్యాటరీతో ఫోన్ వచ్చేసింది

స్మార్ట్‌ఫోన్ ప్రపంచంలో రియల్‌మీ సరికొత్త రికార్డు సృష్టించింది. గురువారం భారత మార్కెట్లో పీ4 పవర్ 5G ఫోన్‌ను విడుదల చేసింది.…

5 hours ago

వెండి కూడా బంగారానికి చేరువయ్యేలా..

​హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. జనవరి 29 నాటి గణాంకాల ప్రకారం, కేవలం…

6 hours ago

కూతురు కాదు కసాయి… షాకింగ్ ఘటన

అమ్మాయిది అగ్రకులం... అబ్బాయిది వెనుకుబడిన కులం...ఇద్దరూ ప్రేమించుకున్నారు...కానీ, ఈ కులాంతర వివాహానికి అమ్మాయి తల్లిదండ్రులు ఒప్పుకోలేదు...ఆ తర్వాత ఆ ప్రేమ…

6 hours ago

జగన్ పాదయాత్రపై షర్మిల సంచలన వ్యాఖలు

ఈ మధ్యకాలంలో పొలిటికల్ సౌండ్ తగ్గించిన ఏపీ కాంగ్రెస్ చీఫ్, వైఎస్ షర్మిల మళ్ళీ రంగంలోకి దిగారు. మహాత్మా గాంధీ…

9 hours ago

‘ఒరేయ్ తరుణ్ భాస్కర్… క్యారెక్టర్లో ఉండిపోకు’

దర్శకుడిగా తొలి చిత్రం ‘పెళ్ళిచూపులు’తో తరుణ్ భాస్కర్ రేపిన సంచలనం అంతా ఇంతా కాదు. రెండో సినిమా ‘ఈ నగరానికి…

10 hours ago