ముందు నుంచి జన నాయకుడు దేనికీ రీమేక్ కాదని దబాయిస్తూ వచ్చిన టీమ్ ట్రైలర్ తర్వాత సైలెంటయిపోయింది. మూడు నిమిషాల వీడియో సాక్షిగా పక్కా ఆధారాలు కళ్ళముందు కనిపిస్తుండటంతో ఇంక డిఫెండ్ చేసుకోవడానికి ఏమి లేదు. యాంటీ ఫ్యాన్స్ ఒక్కసారిగా యాక్టివ్ అయిపోయి విజయ్ ని టార్గెట్ చేయడం మొదలుపెట్టారు.
దానికి తగ్గట్టే కొన్ని ఏఐ షాట్స్ ట్రైలర్ లో పెట్టడం మరింత డ్యామేజ్ చేసింది. అయితే జన నాయకుడు స్పష్టంగా భగవంత్ కేసరి రీమేక్ అనే క్లారిటీ వచ్చేయడంతో అసలు దాంట్లో ఏముందాని కోలీవుడ్ సినీ ప్రియులు అమెజాన్ ప్రైమ్, జియో హాట్ స్టార్ లో బాలయ్య మూవీని చూడటం మొదలుపెట్టారు.
ట్విస్టు ఏంటంటే భగవంత్ కేసరి తమిళ డబ్బింగ్ తో సహా ఓటిటిలో అందుబాటులో ఉంది. దీంతో భాష సమస్య, సబ్ టైటిల్స్ అవసరం లేకుండానే షోలు వేసుకుంటున్నారు. ఓవర్సీస్ లో మాత్రమే స్ట్రీమింగ్ చేసే సింప్లీ సౌత్ అనే యాప్ అదే పనిగా ట్విట్టర్ వేదికగా భగవంత్ కేసరి తమిళంలో చూడమని పదే పదే ట్వీట్లు వేయడం ట్రెండ్ ఏంటో చెప్పకనే చెబుతోంది.
ఇప్పుడీ సినిమా అమెజాన్ ప్రైమ్ లో రెండు నుంచి ఎనిమిది అంకెల మధ్య నెంబర్లు మారుతూ టాప్ ట్రెండింగ్ లోకి వచ్చేసింది. థియేటర్ రిలీజైనప్పుడు భగవంత్ కేసరిని యావరేజ్ అన్న తమిళ క్రిటిక్స్ ఇప్పుడు వాటే మూవీ అంటూ కితాబులు ఇస్తున్నారు.
ఇలా టాలీవుడ్ లోనూ ఒకసారి జరిగింది. మోహన్ లాల్ లూసిఫర్ తెలుగు డబ్బింగ్ ప్రైమ్ లో అందుబాటులో ఉండగా చిరంజీవి గాడ్ ఫాదర్ నిర్మాణం జరిగింది. దీంతో మెగా ఫ్యాన్స్ అందులో ఏముందో చూద్దామని ట్రై చేసి కథ పట్ల ఎగ్జైట్ మెంట్ పోగొట్టుకున్నారు.
సెకండాఫ్ పూర్తిగా మార్చేయడం వాళ్ళను నిరాశ పరిచింది. ఫలితం కూడా ఆశించిన స్థాయిలో రాకపోవడానికి కారణం ఇదే. మరి ఇప్పుడు జన నాయకుడుకి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి. కేవలం ట్రైలర్ కే ఇంత రచ్చ జరిగితే రేపు అసలు సినిమా రిలీజయ్యాక ఇంకెంత ట్రోలింగ్ ఉంటుందో. కానీ విజయ్ ఇమేజ్ దానికి రక్షణ కవచంలా నిలబడేలా ఉంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates