మాములుగా రాజమౌళితో స్టార్ హీరోలు సినిమా చేస్తే ఆ తర్వాత మూవీ డిజాస్టర్ అవుతుందనే సెంటిమెంట్ కొన్ని సంవత్సరాల పాటు ఋజువవుతూనే వచ్చింది. ప్రభాస్ నుంచి రామ్ చరణ్ దాకా ఎవరూ మినహాయింపుగా నిలవలేదు. జూనియర్ ఎన్టీఆర్ దేవరతో దీన్ని బ్రేక్ చేయడం గత ఏడాది చూశాం.
అయితే బయటికి కనిపించని ట్రెండ్ ఒకటుంది. అదేంటో చూద్దాం. రాజమౌళితో పని చేసిన స్టార్లు తమ స్వంత ప్రొడక్షన్ లేదా పార్ట్ నర్ షిప్ ఉన్న బ్యానర్ ద్వారానే తమ నెక్స్ట్ ప్రాజెక్టులు చేయడమనేది కొన్నేళ్లుగా జరుగుతోంది. ఫలితాల సంగతి పక్కనపెడితే దాదాపు అందరూ ఇదే ప్యాట్రన్ ఫాలో అయ్యారు.
బాహుబలి అయ్యాక ప్రభాస్ ఎంచుకున్న సాహు, రాధే శ్యామ్ పూర్తిగా యువి క్రియేషన్స్ స్వంత ప్రొడక్షన్ నుంచి వచ్చినవి. వాటికైన ఖర్చు నిర్మాతలే కాదు అభిమానులు కూడా ఇప్పట్లో మర్చిపోలేరు. యువి నిర్మాతలు ప్రభాస్ కు ఎంత సన్నిహితులో తెలిసిందే.
ఆర్ఆర్ఆర్ అయ్యాక రామ్ చరణ్ క్యామియో చేసిన ఆచార్యలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ భాగస్వామిగా ఉంది. అంతకు ముందు మగధీర తర్వాత ఆరంజ్ కూడా బాబాయ్ నాగబాబు నిర్మాణమన్న సంగతి మర్చిపోకూడదు.
ట్రిపులార్ అయ్యాక జూనియర్ ఎన్టీఆర్ దేవర కోసం అన్న కళ్యాణ్ రామ్ స్థాపించిన ఎన్టీఆర్ ఆర్ట్స్ ని ముందు వరుసలోకి తెచ్చాడు. సింహాద్రి. యమదొంగకు ఇది ఫాలో కాకపోవడం వేరే విషయం.
ఇప్పుడు వారణాసి తర్వాత మహేష్ బాబు కూడా ఇదే రూట్ లో వెళ్ళబోతున్నట్టు సమాచారం. తన జిఎంబి బ్యానర్ ని మళ్ళీ యాక్టివేట్ చేసి తన నెక్స్ట్ సినిమా అందులోనే తీయాలనే ప్లాన్ ఉందట. ఒకవేళ బడ్జెట్ ఎక్కువైన పక్షంలో ఇంకో పార్ట్ నర్ ను తీసుకుని మేజర్, శ్రీమంతుడు తరహాలో టై అప్స్ పెట్టుకుంటారు.
మరి జక్కన్న చేశాక ఎలాగూ మార్కెట్ ఇంటర్నేషనల్ స్థాయికి వెళ్తుంది కాబట్టి ఇలాంటి ఆలోచన చేయడం బిజినెస్ కోణంలో చాలా మంచి ఆలోచన. కాకపోతే ఇప్పటిదాకా ఎవరూ సాధించలేకపోయినా ఎక్స్ ట్రాడినరి ఇండస్ట్రీ హిట్ ని నిర్మాతగా మహేష్ బాబు చేసి చూపిస్తాడేమో లెట్ వెయిట్ అండ్ సి.
Gulte Telugu Telugu Political and Movie News Updates