కమల్ హాసన్, శంకర్‌ల కాంబినేషన్లో రెండు దశాబ్దాల కిందట వచ్చిన ‘భారతీయుడు’ ఎంతటి సంచలనం సృష్టించిందో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. అటు తమిళంలో, ఇటు తెలుగులో ఆ చిత్రం బ్లాక్‌బస్టర్ కావడమే కాదు.. జనాల ఆలోచనల్ని కూడా ఎంతగానో ప్రభావితం చేసింది. దీని సీక్వెల్ గురించి తర్వాతి కాలంలో అనేకసార్లు చర్చ జరిగింది. చివరికి ‘భారతీయుడు’ వచ్చిన 20 ఏళ్ల తర్వాత దాని సీక్వెల్‌ను మొదలుపెట్టి ఈ సినిమాను అభిమానించేవారిని అమితానందంలో ముంచెత్తాడు శంకర్.
ఐతే ఏ ముహూర్తాన ఈ సినిమాను అనౌన్స్ చేశాడో కానీ.. నాటి నుంచి ఏదో ఒక అడ్డంకి తప్పట్లేదు. రకరకాల కారణాల వల్ల ఈ సినిమా షూటింగ్‌కు బ్రేకులు పడ్డాయి. చివరగా సెట్స్‌లో జరిగిన ప్రమాదం వల్ల బ్రేక్ పడగా.. ఆ తర్వాత కరోనా సినిమాకు అడ్డం పడింది. ఐతే కరోనా అనంతరం అందరూ షూటింగ్ మొదలుపెట్టినా ఈ సినిమా మాత్రం ముందుకు కదల్లేదు.
దర్శకుడు శంకర్, లైకా ప్రొడక్షన్స్ అధినేతల మధ్య బడ్జెట్, ఇతర విషయాల్లో విభేదాలే ‘ఇండియన్-2’ ముందుకు కదలకపోవడానికి కారణం. ఐతే ఎట్టకేలకు వారి మధ్య విభేదాలు తొలగిపోయాయటయ. వారి మధ్య విభేదాలు తొలగిపోయాయట. సినిమాను ముందుకు తీసుకెళ్లేందుకు ఏం చేయాలన్నదానిపై చర్చలు జరుపుతున్నారట. జనవరి నెలాఖరు లేదా ఫిబ్రవరి ఆరంభంలో ఈ సినిమా షూటింగ్ పున:ప్రారంభం అవుతుందని సమాచారం.
ఇంకా ముందే చిత్రీకరణ మొదలుపెట్టాలనుకున్నారు కానీ.. ‘ఇండియన్-2’ సంగతి ఎటూ తేలకపోయేసరికి కమల్ ఈ మధ్యనే లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో ‘విక్రమ్’ అనే సినిమాను మొదలుపెట్టాడు. ఆ చిత్రాన్ని శరవేగంగా పూర్తి చేసి జనవరి నెలాఖరులో ఆయన అందుబాటులోకి వస్తారని ‘ఇండియన్-2’ బృందం ఆశిస్తోంది. ఒక దశలో ఈ సినిమా మధ్యలోనే ఆగిపోతుందేమో అన్న సందేహాలు కలిగాయి. అవి తొలగిపోయి ఈ మెగా మూవీ ముందుకు కదలబోతుండటం కమల్, శంకర్ అభిమానుల్ని ఆనందంలో ముంచెత్తుతోంది.
This post was last modified on December 11, 2020 3:28 pm
అగ్రరాజ్యం అమెరికాలో చోటు చేసుకున్న పరిణామాలు.. విదేశీ విద్యార్థులు, వృత్తి నిపుణులను ఇరకాటంలోకి నెడుతున్నాయి. మరో రెండు మూడు వారాల్లోనే…
జైలు శిక్ష ఏమిటి? అందులోనూ ఫిఫ్టీ-ఫిఫ్టీ ఏమిటి- అనే ఆశ్చర్యం అందరికీ కలుగుతుంది. కానీ, ఇది వాస్తవం. దీనికి సంబంధించి…
ఏపీలో రాజకీయ వ్యూహాలు, ప్రతివ్యూహాలు ఎలా ఉన్నా.. అధికార పార్టీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు మాత్రం కాక పుట్టిస్తున్నాయి. ఇప్పటికే…
టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పరిటాల రవి గురించి యావత్ ఉమ్మడి రాష్ట్రానికి తెలిసిందే. అన్నగారు ఎన్టీఆర్ పిలుపుతో…
క్రిస్మస్కు తెలుగులో భారీ చిత్రాల సందడి ఉంటుందని అనుకున్నారు కానీ.. ఈ సీజన్లో వస్తాయనుకున్న గేమ్ చేంజర్, తండేల్, రాబిన్…