Movie News

నాయకుడి కోసం సెలవు తీసుకున్న నటుడు

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సినిమాలకు శాశ్వతంగా సెలవు చెప్పేశాడు. ఇకపై ప్రజాసేవ కోసం రాజకీయాల్లో పూర్తి స్థాయిలో కొనసాగేందుకు నిర్ణయం తీసుకోవడంతో జన నాయకుడు చివరి మూవీ కానుంది. నిన్న మలేషియాలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ అంగరంగ వైభవంగా జరిగింది.

లక్షలాదిగా వచ్చిన అభిమానులతో ప్రాంగణం కోలాహలంగా మారింది. టీమ్ తో పాటు దర్శకులు అట్లీ, నెల్సన్ దిలీప్ కుమార్ తదితరులు ప్రత్యేక గెస్టులుగా విచ్చేయడంతో పాటు తలపతితో తమకున్న అనుబంధాన్ని గొప్పగా గుర్తు చేసుకున్నారు. సుమారు ఆరు గంటల పాటు జరిగిన ఈ వేడుకని జీ5 ఓటిటి, ఛానల్లో త్వరలో స్ట్రీమింగ్ చేయబోతున్నారు.

చెప్పుకోదగ్గ ఆకర్షణలు తలపతి తిరువిజాలో చాలా జరిగాయి. విజయ్ స్టేజి మీద చివరి స్టెప్పు అంటూ కొన్ని సెకండ్లు డాన్స్ చేయడం, మమిత బైజు తన స్పీచ్ లో ఎమోషనల్ కావడం, విజయ్ తో పని చేసిన దర్శకులు ఆయన గొప్పదనాన్ని వివరించడం, నాజర్ తన కొడుకు బాగవ్వడంలో విజయ్ పాత్రని చెప్పడం తదితరాలన్నీ భావోద్వేగాలకు గురి చేశాయి.

విజయ్ పేరు పేరునా తనను ఈ స్థాయికి తెచ్చినవాళ్లను గుర్తు చేసుకుని ఎన్నో జ్ఞాపకాలను పంచుకోవడం హైలైట్ గా నిలిచింది. ఎక్కడా రాజకీయ ప్రస్తావన లేకుండా, పార్టీ గురించి మాట్లాడకుండా మలేషియా అధికారుల సూచనలకు మేరకు నడుచుకున్నారు.

రాబోయే ఎన్నికల్లో గెలుస్తాడో లేదో చెప్పలేం కానీ యాక్టింగ్ రిటైర్ మెంట్ ని విజయ్ సీరియస్ గా తీసుకున్నట్టు కనిపిస్తోంది. గతంలో ఇలా చెప్పి మళ్ళీ పరిశ్రమకు వచ్చిన కమల్ హాసన్, రజినీకాంత్, చిరంజీవి, పవన్ కళ్యాణ్ లా కాకుండా కంప్లీట్ పొలిటిక్స్ వైపే దృష్టి పెట్టనున్నట్టు పార్టీ వర్గాలు బల్లగుద్ది చెబుతున్నాయి.

విజయ్ చివరి సినిమాగా జన నాయకుడు మీద ఇప్పటికే అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. తెలుగులోనూ జనవరి 9 రిలీజ్ చేయబోతున్నారు. ఓపెనింగ్స్ తోనే కాదు ఫైనల్ రన్ లోనూ కనివిని ఎరుగని రికార్డులు జన నాయకుడు సొంతం చేసుకుంటుందని విజయ్ ఫ్యాన్స్ తో పాటు బయ్యర్ వర్గాలు ధీమాగా ఉన్నాయి.

This post was last modified on December 28, 2025 11:52 am

Share
Show comments
Published by
Kumar
Tags: Jana Nayagan

Recent Posts

‘ఈగ’కు ఇప్పుడైనా పూర్తి న్యాయం జరుగుతుందా?

రాజమౌళి కెరీర్‌ను ‘మగధీర’కు ముందు, ‘మగధీర’కు తర్వాత అని విభజించి చూడాలి. ‘మగధీర’కు ముందు వరకు ఆయన సగటు మాస్…

9 minutes ago

రాజా సాబ్ బ్యూటీకి ప్రభాస్ ‘సారీ’ గిఫ్ట్

ప్రభాస్‌తో పని చేసే ప్రతి ఆర్టిస్టూ, టెక్నీషియనూ తన పెద్ద మనసు గురించి చెబుతూనే ఉంటారు. ముఖ్యంగా కడుపు పగిలేలా…

1 hour ago

మూడు కాదు.. రెండే.. జిల్లాల విభ‌జ‌న‌ పై బాబు నిర్ణ‌యం!

ఏపీలో జిల్లాల విభజన వ్యవహారం ఒక కొలిక్కి వచ్చింది. ఇప్పటివరకు మూడు కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలనే ఆలోచన ఉన్నప్పటికీ,…

4 hours ago

2025.. షర్మిల పొలిటికల్ గ్రాఫ్ ఇదేనా?

ఏపీ రాజకీయాల్లో పార్టీ చీఫ్‌గా పురాతన కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టిన వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ వైఎస్ షర్మిల రాజకీయ…

7 hours ago

ఆర్ఎస్ఎస్‌పై కాంగ్రెస్ సీనియర్ నేత ప్రశంసలు

కాంగ్రెస్ పార్టీలో ఆర్ఎస్ఎస్, బీజేపీలపై నేతలు చేస్తున్న వ్యాఖ్యలు పార్టీ హైకమాండ్‌కు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇప్పటికే కర్ణాటక డిప్యూటీ సీఎం…

8 hours ago

మేం క్యామియోలు చేస్తాం… మీరు చేయరా?

కన్నడ సినిమా టాప్ స్టార్లలో కిచ్చా సుదీప్ ఒకడు. అతడికి వేరే భాషల్లో కూడా మంచి ఫాలోయింగే ఉంది. ‘ఈగ’…

9 hours ago