కృష్ణ అండ్ హిజ్ లీల సినిమాతో సడన్‍గా తెలుగు సినిమా పెద్దల దృష్టిలో పడ్డాడు సిద్ధు. యూత్‍కి నచ్చే ఫీచర్స్తో పాటు యూత్‍కి ఏమి కావాలో అవి సినిమాలో వుండేట్టు చూసుకునే టాలెంట్ కూడా వుండడంతో మూడు కోట్ల లోపు బడ్జెట్‍లో మినిమమ్ గ్యారెంటీ సినిమాలు తీయాలనే నిర్మాతలకు ఇతనే కనిపిస్తున్నాడు.
ఇప్పుడతని చేతిలో నాలుగైదు సినిమాలున్నాయి. తనకే బడ్జెట్ ఇచ్చేసి సినిమా తీసిపెట్టమని అడిగే నిర్మాతలున్నారు. ఇదిలావుంటే ఈ సిద్ధు జొన్నలగడ్డ వరుసగా రెండు సినిమాలలో సీరత్ కపూర్‍తో నటించాడు. ముద్దు సీన్లకు, హాట్ సన్నివేశాలకు ఎలాంటి అభ్యంతరం చెప్పని సీరత్ ఓటిటి కంటెంట్‍కి తగ్గ ప్రదర్శన ఇవ్వగలదు. దీంతో తన సినిమాలకు సీరత్‍నే సిద్ధు సిఫార్సు చేస్తున్నాడనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
‘మా వింత గాధ వినుమా’ చూసి సీరత్ వద్దని నిర్మాతలు చెబుతున్నా కానీ సిద్ధు ఆమె వుంటే బాగుంటుందని పట్టు పడుతున్నాడనే ప్రచారం జరుగుతోంది. ఆ బడ్జెట్‍లో వేరే హీరోయిన్లు ఈజీగా దొరుకుతారని తెలిసినా కానీ సిద్ధు ఆమె పట్లే ఆసక్తి చూపించడం పలు గాసిప్‍లకు తావిస్తోంది. అయితే ఒక జంట రెండు సినిమాల్లో రిపీట్ అయితే వచ్చే రెగ్యులర్ గాసిప్సా లేక నిజంగానే వీరిమధ్య నిప్పు రాజుకోవడం వల్ల ఈ పొగ వస్తోందా అనేది ఇన్‍సైడర్స్ కే తెలియాలి.
This post was last modified on December 9, 2020 11:45 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…