కెరీర్లో ఎన్నడూ లేని విధంగా సుదీర్ఘ విరామం తీసుకున్న మంచు మనోజ్.. ఈ ఏడాదే రీఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. భైరవంలో నెగెటివ్ టచ్ ఉన్న పాత్ర చేసిన మనోజ్.. మిరాయ్‌లో పూర్తి స్థాయి విలన్‌గానే నటించాడు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవడమే కాక.. మనోజ్‌కు మంచి పేరూ తెచ్చిపెట్టింది. ఈ ఊపులో మళ్లీ హీరోగా సినిమా చేయడానికి రెడీ అయ్యాడు మంచు హీరో. డేవిడ్ రెడ్డి పేరుతో ఒక పీరియడ్ ఫిలింను కొన్ని నెలల కిందటే మనోజ్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ రోజే దాని గ్లింప్స్ రిలీజైంది.
సౌండ్ ఆఫ్ డేవిడ్ రెడ్డి పేరుతో రిలీజైన ఆ గ్లింప్స్ అదిరిపోయిందనే చెప్పాలి. బ్రిటిష్ కాలంలో భారతీయులు అల్లాడిపోతున్నపుడు.. జలియన్ వాలా బాగ్ ఘటన అనంతరం ఇండియన్స్ గుండెలు మండిపోతున్నపుడు.. 25 కోట్ల మంది కోపాన్ని తన ఒక్కడిలో నింపుకుని.. బ్రిటిష్ వాళ్ల మీద దండెత్తిన యోధుడి కథగా దీన్ని నరేట్ చేశారు.
ఈ గ్లింప్స్ ఆద్యంతం మంచి విజువల్స్, బీజీఎంతో హుషారుగా సాగి సినిమా మీద అంచనాలను పెంచింది. కాకపోతే పీరియడ్ ఫిలిం అన్నారు కానీ.. గ్లింప్స్ చూస్తే మోడర్న్ టచ్ కనిపించింది. మరి సినిమాలో పీరియడ్ టచ్ ఎలా చూపిస్తారో చూడాలి.
ఈ గ్లింప్స్ లాంచ్ సందర్భంగా మంచు మనోజ్.. డేవిడ్ రెడ్డిలో క్యామియో రోల్స్ గురించి మాట్లాడాడు. ఇందులో మనోజ్ ఫ్రెండయిన తమిళ స్టార్ హీరో శింబు ఒక ప్రత్యేక పాత్ర చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అలాగే మరో పాత్ర కోసం రామ్ చరణ్‌ను అడుగుతున్నట్లు కూడా ప్రచారం జరిగింది. దీని గురించి మనోజ్‌ను ప్రశ్నిస్తే.. ఈ సినిమాలో చాలా ఆసక్తికరమైన పాత్రలు కొన్ని ఉన్న మాట వాస్తవమే అన్నాడు.
ఐతే క్యామియో కోసం రామ్ చరణ్‌ను ఇంకా తాము అడగలేదని స్పష్టం చేశాడు. ఇప్పుడే సినిమా మొదలవుతోందని.. గ్లింప్స్ లాంచ్ చేశామని.. ఇందులో నటీనటుల గురించి మాట్లాడడం మరీ తొందర అవుతుందని.. మిగతా విశేషాలు పంచుకోవడం కోసం కొన్ని రోజులు వెయిట్ చేయాలని అతనన్నాడు. కొత్తవాడైన హనుమరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నాడు.
This post was last modified on December 18, 2025 9:09 am
బాలీవుడ్ స్టార్లు ప్రైవేటు పెళ్లిళ్లకు వెళ్లి డ్యాన్సులు చేయడం ఎప్పట్నుంచో ఉన్న సంప్రదాయమే. అందుకోసం భారీగా పారితోషకాలు అందుకుంటూ ఉంటారు. షారుఖ్…
సినీ జనాలు తమ కెరీర్లో ఏదైనా పెద్ద డిజాస్టర్ ఎదురైనపుడు.. దాని గురించి తర్వాతి రోజుల్లో మాట్లాడడానికి పెద్దగా ఇష్టపడరు.…
పార్లమెంటు శీతాకాల సమావేశాలు శుక్రవారం(రేపు)తో ముగియనున్నాయి. ఈ సమావేశాల్లో చివరి రెండో రోజైన గురువారం రాజకీయ వేడి లోక్‌సభను కుదిపేసింది.…
రెండేళ్లు సిల్వర్ స్క్రీన్ గ్యాప్ తీసుకున్న అడవి శేష్ ఈసారి డెకాయిట్ గా రాబోతున్నాడు. టీజర్ ప్రామిసింగ్ గా అనిపించింది.…
వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై పలు కేసులు నమోదైన సంగతి తెలిసిందే. గన్నవరం టీడీపీ ఆఫీసుపై…
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అంటే వేరే వాళ్ల భాగస్వామ్యంలో లో బడ్జెట్ సినిమాలు తీసే నిర్మాణ సంస్థ. కానీ గత కొన్నేళ్లలో…