ఆచార్యలో చరణ్‌కి జోడీగా రష్మిక నటిస్తుందనే వార్త కొద్ది రోజులుగా హల్చల్ చేస్తోంది. రష్మిక ఆ వార్తపై స్పందించలేదు. చరణ్ నుంచి కూడా ఎలాంటి సమాచారం లేదు. అయితే ఆచార్యలో రష్మిక నటించడం ఉత్తమాటేనట. ఒక బాలీవుడ్ హీరోయిన్‌తో ఆ పాత్ర చేయించాలని కొరటాల శివ భావిస్తున్నాడట. హిందీ హీరోయిన్ ఎవరయినా వుంటే సినిమాకు రీచ్ పెరుగుతుందని, డిజిటల్ డీల్‌తో పాటు హిందీ డబ్బింగ్ రైట్స్ కూడా బాగా వస్తాయని ఇలా ప్లాన్ చేస్తున్నారట.
ఇంకా హీరోయిన్ ఎవరనేది ఖరారు కాలేదు కానీ చరణ్‌తో బాలీవుడ్ హీరోయినే నటిస్తుందనయితే చెబుతున్నారు. ఆర్.ఆర్.ఆర్.లో చరణ్ సరసన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ నటిస్తోన్న సంగతి తెలిసిందే. బహుశా అది దృష్టిలో వుంచుకుని ఆచార్యకి కూడా బాలీవుడ్ టచ్ ఇస్తున్నారేమో తెలీదు. ఈ చిత్రంలో చరణ్ పాత్ర నిడివి బాగానే వుంటుందని, చిరంజీవి, చరణ్‌లపై సన్నివేశాలుంటాయని, ఒక అరగంట పాటు చరణ్ పాత్ర తెరపై కనిపిస్తుందని టాక్. ఈ చిత్రంలో చరణ్ నటించేందుకు రాజమౌళి నుంచి గ్రీన్‌సిగ్నల్ లభించలేదు కానీ ఆర్.ఆర్.ఆర్. బాగా డిలే అవుతోంది కనుక ఈ చిత్రానికి అతను అడ్డు చెప్పకపోవచ్చునని భావిస్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates