తమిళంలో విలక్షణ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే దర్శకుడు మిస్కిన్. రాజు భాయ్ ఒరిజినల్ ‘చిత్తిరం పేసిదడి’తో మొదలుపెడితే అంజాదే, నందలాల, యుద్ధం సెయ్, సైకో, తుప్పరివాలన్ (డిటెక్టివ్), పిసాసు (పిశాచి) లాంటి మూవీస్‌తో తనకంటూ ప్రత్యేకంగా ఓ అభిమాన వర్గాన్ని సంపాదించుకున్నాడు మిస్కిన్. ఎక్కువగా థ్రిల్లర్ మూవీస్ తీస్తూ ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతిని పంచుతాడు మిస్కిన్.. తన సూపర్ హిట్ మూవీ పిసాసుకు సీక్వెల్ తీయాలని కొన్నేళ్ల నుంచి అనుకుంటున్నాడు. కొన్ని కారణాల వల్ల ఈ సినిమా ఆలస్యం అయింది.
గత ఏడాది ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్లింది. సింగర్‌గానే కాక నటిగానూ పేరు సంపాదించిన ఆండ్రియా ఇందులో లీడ్ రోల్‌కు ఎంపికైంది. ఈ చిత్రంలో ఆమె న్యూడ్ సీన్ చేయబోతోందనే వార్త కొన్ని నెలల ముందు సంచలనం రేపింది. ఈ సినిమాకు బజ్ రావడానికి ఆ న్యూసే కారణమైంది. కథ డిమాండ్ చేయడం వల్లే ఆ సీన్ చేస్తున్నట్లు కూడా ఒక ఇంటర్వ్యూలో ఆండ్రియా చెప్పింది.
ఐతే ఇప్పుడు ఆ న్యూడ్ సీన్ విషయంలో అంచనాలు పెట్టుకున్న వాళ్లకు పెద్ద షాకిచ్చింది ఆండ్రియా. స్క్రిప్టులో ఉన్న ఆ సన్నివేశాన్ని ఇప్పుడు తీసేశారట. ఇంతకుముందు అనుకున్న ఆ సన్నివేశం సినిమాలో ఉండబోదని ఆండ్రియా తేల్చేసింది. చిత్రీకరణ దశలో సినిమాకు ఆ సన్నివేశం అవసరమా అనే చర్చ జరిగిందని.. దర్శకుడు మిస్కిన్ దాన్ని పక్కన పెట్టేశాడని ఆమె వెల్లడించింది.
కానీ ఈ చిత్రంలో బోల్డ్ అండ్ ఎరోటిక్ సీన్లు మాత్రం ఉంటాయని.. అవి ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తాయని ఆమె చెప్పింది. మిస్కిన్‌కు ఇది సర్వైవల్ ఫిలిం అని.. అలాంటి దర్శకుడి కోసం ఏమైనా చేయాలనే ఉద్దేశంతో ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నానని ఆండ్రియా తెలిపింది. ఈ సినిమా థ్రిల్లింగ్‌గా ఉంటుందని ఆమె చెప్పింది. పిసాసు-2లో విజయ్ సేతుపతి విలన్ పాత్ర చేస్తున్నట్లు సమాచారం. ఇందులో అవును భామ పూర్ణ కూడా ఒక కీలక పాత్ర చేస్తోంది. వచ్చే ఏడాది వేసవిలో ఈ మూవీ రిలీజయ్యే అవకాశముంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates